14, ఆగస్టు 2023, సోమవారం

విద్యుత్‌ చార్జీల విశ్లేషణ*

 *విద్యుత్‌ చార్జీల విశ్లేషణ*


 *01. ఫిక్స్డ్ చార్జీలు*

*02. కస్టమర్ చార్జీలు*

*03. విద్యుత్ డ్యూటీ* 

*04. ట్రూఅప్ చార్జీలు (11/36)* 

*05. ఇందన సర్దుబాటు (FPPCA charges) చార్జీలు  (5/2021)*

*06. ఇందన సర్దుబాటు (FPPCA charges)  చార్జీలు  (4/2023)* 


*1.  ఫిక్స్ డ్  చార్జీలు*:  మన ఇంటికి కరెంటు రావటానికి  లైన్లు, సబ్‌ స్టేషన్లు , ట్రాన్స్‌ ఫార్మర్లు వగైరా వేయాలి.  వాటికి చేసిన ఖర్చును వసూలు చేయడాన్ని ఫిక్స్‌డ్‌ చార్జీలు అంటారు.  మన ఇంటికి కనెక్షన్‌ తీసుకునేటప్పుడు 2 కేవీ, 4 కేవి, 5 కేవి  అలా మన అవసరాన్ని బట్టి తీసుకుంటాము. ఒక కేవి కి రు.10లు చొప్పున ఎన్ని కేవీ లోడు ఉంటే అన్ని 10లు వసూలు చేస్తున్నారు. ఇవి ఎల్లప్పుడూ కొనసాగుతాయి.  కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్లకు పైగా అయిన ప్రాంతాలలో కూడా ఇప్పుడు ఈ చార్జీలు  వసూలు చేస్తున్నారు. 


*2. కస్టమర్‌ చార్జీలు*:  మన ఇంటికి కరెంటు సప్లై చేసినందుకు వేసే చార్జీలు. ఇవి  మనం నెలలో వాడుకునే యూనిట్ల శ్లాబును బట్టి రు25,రు.30,రు.45,రు.50,రు.55లు గా ఉన్నది.


*3.  విద్యుత్ డ్యూటీ* : మనం విద్యుత్‌ వాడుకున్నందుకు  ప్రభుత్వానికి కట్టే పన్ను. ఇది యూనిట్‌ కు  6 పైసలు వసూలు చేస్తున్నారు. షాపులకు అయితే యూనిట్‌కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు.    


*4. ట్రూ అప్‌ చార్జీలు*:  2014 నుండి 2019 వరకు వాడిన విద్యుత్‌ పై రు.3,013 కోట్ల రూపాయలు ప్రజలనుండి 36 నెలలో వసూలు చేయబోతున్నారు. అవే మనకు బిల్లులో  True-Up Charges (11/36) పేరుతో ఉన్నాయి. ఆనాడు అంటే 2014 నుండి 2019 వరకు మనం వాడిన యూనిట్లకు యూనిట్‌ కు 0.22 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు.   వీటిని ఆగస్టు 2022 నుండి జులై 2025 వరకు వసూలు చేస్తారు.  ఆతర్వాత 2019 నుండి 2021 వరకు వసూలు చేస్తారు.


*5. ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges)* :  2021-2022 ఆర్థిక సంవత్సరానికి వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు.  అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో (FPPCA charges (5/2021))  బిల్లులో ఉన్నాయి. ఆనాడు మనం వాడిన కరెంటుకు యూనిట్‌కు ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జులైనుండి సెప్టెంబరు వరకు యూనిట్‌కు 0.63 పైసలు, అక్టోబర్‌ నుండి డిశంబరు వరకు యూనిట్‌కు 0.57 పైసలు, జనవరి నుండి మార్చివరకు యూనిట్‌కు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు.  ఈ వసూళ్ళు అయిన అనంతరం   2022-2023 ఆర్థిక సంవత్సరానికి తర్వాత వసూలు చేస్తారు.  


*6. ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges)* :  ప్రస్తుత ఆర్థిక సంవత్సం అంటే 2023-2024 లో వాడిన కరెంటుకు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అవే మనకు ఇంధన సర్దుబాటు చార్జీలు (FPPCA charges (4/2023 )) పేరుతో బిల్లులో ఉన్నాయి. ఇవి ఇక మీదట ప్రతి నెలా కొన సాగుతాయి.

కామెంట్‌లు లేవు: