21, అక్టోబర్ 2023, శనివారం

మహాభారతములో - ఆది పర్వము* *తృతీయాశ్వాసము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *తృతీయాశ్వాసము*


                      *30*


*యయాతీ దేవయానుల వివాహం*


దేవయాని తన చెలికత్తెలతో అదే వన విహారానికి వెళ్ళి అక్కడ తిరిగి యయాతిని  చూసింది. దేవయాని యాయాతి తో తామిరువురికి ఒకసారి పాణి గ్రహణం జరిగింది కనుక తనను అతడు వివాహం చేసుకోవాలని కోరింది. యయాతి బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహమాడవచ్చు కాని క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహమాడటం ధర్మం కాదని చెప్పాడు. పట్టువదలని దేవయాని తన తండ్రిని రప్పించి తండ్రిచే అందుకు అంగీకారాన్ని పొంది యయాతిని వివాహమాడింది. యయాతి తన భార్యతోనూ ఆమె చెలికత్తెలతో తన రాజ్యానికి చేరుకోవడానికి ఆయత్తమైన సమయంలో శుకృడు శర్మిష్ట  వృషపర్వుని కూతురని ఆమెను దూరంగా ఉంచమని ప్రత్యేకంగా చెప్పాడు.

కామెంట్‌లు లేవు: