21, అక్టోబర్ 2023, శనివారం

గరికిపాటినరసింహారావు గారు

 



#గరికిపాటినరసింహారావు గారు💐వీరిని పత్రికల్లోను,  టీవీల్లోనూ ఫేస్ బుక్ యూట్యూబ్ మొదలైన ప్రసార మాధ్య మాలలో చూస్తూనే వుంటారు. హాస్యంగా వ్యంగంగా సెటైరికల్ గా మాట్లాడటంలో దిట్ట. వీరి పుట్టుపూర్వోత్తరాలు తెలియని వారు ఎవరైనా వుంటే తెలుసుకుంటారని ఈ పోస్ట్ పెట్టడమైనది. 


          శ్రీ గరికిపాటి నరసింహా రావు గారు  పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958సం.లో, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించారు. వీరు ఎం.ఎ., రెండు ఎం.ఫిల్ లు, రెండు పి.హెచ్.డీలు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. వీరి భార్య పేరు శారద గారు. తనకొడుకులిద్దరికీ శ్రీ శ్రీ, గురజాడ అని పేర్లుపెట్టుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.


          గరికిపాటి నరసింహారావు గారు కవి, రచయిత, ఉపన్యాసకులు, అయినప్పటికీ అవధానిగా సుప్రసిద్ధులు. సుమారు మూడువందల అష్టావధానాలు; 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు; ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009సం.లో 8 కంప్యూటర్ల తో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తుండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్  మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.

           పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహి స్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశారు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి వారు రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 


💐గరికిపాటి వారి రచనలు కొన్ని💐

1)సాగరఘోష (పద్యకావ్యం), 2)మనభారతం (పద్యకావ్యం), 3)బాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి),  4)పల్లవి (పాటలు), 5)సహస్రభారతి, 6)ద్విశతావధానం, 7)ధార ధారణ, 8)కవితా ఖండికా శతావధానం, 9)మౌఖిక సాహిత్యం (పరిశోధన), 10)పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు, 11)మా అమ్మ (లఘుకావ్యం), 12)అవధాన శతకం, 13)శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం), 14(శతావధాన విజయం (101 పద్యాలు)


💐గరికిపాటి వారు టి.వి.ఛానల్ ప్రోగ్రామ్స్💐 

1)ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం

2)ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం

3)భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం: 1818 ఎపిసోడ్లు

4)భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం

5)దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం

6)ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)

7)తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో 

     సాహిత్యంలో హాస్యం


💐గరికిపాటి వారి  సిడిలు,  డివిడిలు💐

1)పలకరిస్తె పద్యం (హాస్య పద్యాలు), 2)శివానంద లహరి, 3)సౌందర్య లహరి, 4)కనకథారా స్తవము, 5)భక్త ప్రహ్లద, 6)గజేంద్ర మోక్షము, 7)కాశీ ఖండము, 8)భగవద్గీత, 9)శకుంతలోపాఖ్యానము, 10)శ్రీ కాళహస్తి మహాత్మ్యం, 11)సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానం తో సహా) (డివిడి)


 💐గరికిపాటి వారికి లభించిన బిరుదులు💐

1)ప్రవచన కిరీటి ,   2)అమెరికా అవధాన భారతి, 3)ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997), 4)సహస్రభారతి (1996),  5)అవధాన శారద (1995), 6)శతావధాన గీష్పతి (1994),  7)శతావధాన కళా ప్రపూర్


💐గరికిపాటి వారు అందుకున్న సత్కారాలు, సన్మానాలు💐 

1)ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)

2)కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)

3)సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)

4)పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)

5)2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం

6)2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి

7)2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

8)2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి

9)భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం

10)2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

11)2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం

12)సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)

13)తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

14)2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం

15)రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018సం.

16)పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018సం.

16)గురజాడ విశిష్ట పురస్కారం, 2016సం.

18)లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015సం.

19)శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013సం.

      (విశాఖ ఉక్కు కర్మాగారం)

20)ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి

     వారిచే ప్రదానం, 2012సం.

21)‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002సం.

22)ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను .కందుకూరి వీరేశలింగం మరియు జయంతి రామయ్యపంతులు అవార్డు, 1978సం.

 💐********💐********💐********💐********💐

For information

కామెంట్‌లు లేవు: