14, నవంబర్ 2023, మంగళవారం

శివస్తుతి

 *పవిత్ర కార్తీక మాసం సందర్భంగా...*

*రోజూ శివస్తుతి*

*శ్రీ శివ మహాపురాణం నుంచి......*.


********

నమో నిష్కల రూపాయ

నమో నిష్కల తేజసే

నమస్సకల నాథాయ

నమ: ప్రణవ లింగినే

నమ: స్సృష్ట్యాది కర్త్రేచ

నమ: పంచముఖాయతే

పంచ బ్రహ్మ స్వరూపాయ

పంచకృత్యాయతే  నమ:

ఆత్మనే బ్రహ్మణే తుభ్యం

అనంత గుణశక్తియే

సకలాకల రూపాయ

శంభవే గురవే నమ:

ఇతి స్తుత్వా గురంపద్యై

బ్రహ్మ విష్ణుశ్చనేమతు

   ***

*శంకరా!*

 నిరాకారుడవైన నీకు నమస్కారం.

తేజోరూపుడవైన నీకు నమస్కారం.

సాకారుడవైన నీకు నమస్కారం.

ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం,

ఓంకారం నీకు చిహ్నం.

సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల (ఈశానుడు, తత్పురుషుడు,అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే పంచముఖాలు)గల నీకు నమస్కారం.

పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారం.

ఆత్మస్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, అనంత కళ్యాణగుణ శక్తియుతుడవైన నీకు నమస్కారం.

సాకార , నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారం. అంటూ పై  విధంగా బ్రహ్మ– విష్ణువులు ఇరువురూ గురువైన శంకరుని స్తుతించారు.


*****

*నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం*

*పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం*

*నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం*

*నమో నమశ్శంకర పార్వతీభ్యాం*

*నమో నమశ్శంకర పార్వతీభ్యాం*

*****

కామెంట్‌లు లేవు: