*_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*
𝕝𝕝 శ్లో 𝕝𝕝
*ధూమాయన్తే వ్యపేతాని జ్వలన్తి సహితాని చ l*
*ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ ll*
(సుభాషితరత్నకోశః)
𝕝𝕝తా𝕝𝕝
ధృతరాష్టా! జ్ఞాతులు కొఱువులవలే (కాలిన కట్టెలవలే) వేరువేరుగా ఉంటే పొగలు కక్కుతారు.... కలిసి ఉంటే వెలిగిపోతారు. (ప్రకాశిస్తారు).
ఆ.
మహిని జ్ఞాతి మిగుల మండెడు కాష్టమ్ము
పొగను చిమ్ముచుండు పగను తలచి
విమలమైన వెలుగు విరజిమ్ము నాతండు
కలహబుద్ధి వీడి కలుపు కొనిన
పద్యానుసరణ
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి