🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
. *శివానందలహరీ – శ్లోకం – 22*
. శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
*ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధనిగృహే*
*ప్రవేశోద్యుక్త స్సన్ భ్రమతి బహుధా తస్కరపతే!*
*ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర ! విభో !*
*తవాధీనం కృత్వామయి నిరపరాధే కురుకృపామ్ ||*
దొంగలకు అధిపతివైన ప్రభూ! శివా! నా చిత్తమనే చోరుడు, అధిక లోభాదులచే ప్రేరితుడై , ధనమును హరించడంలో ఆసక్తి కలిగి, ధనికుల గృహాలలోకి ప్రవేశించడానికి సిద్ధమై, అనేకవిధాలుగా కొట్టు మిట్టాడుతున్నాడు. నా చిత్తమనే చోరుని నేను ఎలా సహిస్తాను? నీవు తస్కర పతివి. కాబట్టి నా చిత్తచోరుని స్వాధీనం చేసుకొని, నిర్దోషినైన నా విషయంలో దయ చూపించు. నా మనస్సు మోహప్రేరితమై, ఇతర ధనికులను హరింౘడానికి ప్రయత్నిస్తోంది. నేనెలా సహిస్తాను? నీవుదొంగను, చోరుని నీ అధీనంలో ఉంచుకొని, దోష రహితుడైన నాయందు దయ చూపించు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి