🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *భాగం 109*
*కర్మయోగ భావనలు*
"యావజ్జీవి తమూ నేను నేర్చుకొంటాను" అనేవారు శ్రీరామకృష్ణులు. ఆ విషయంలోనూ స్వామీజీ ఆయనకు నిజమైన శిష్యునిగానే నిలిచారు.. పరిస్థితులు, వ్యక్తులు, సంఘటనలు - ఇలా అన్నింటినుండి ఆయన నేర్చుకొంటూనే ఉన్నారు. పవహారీ బాబా ఉన్నతోన్నత స్థితిని చూసిన స్వామీజీ ఆయన నుండి కూడా నేర్చుకోవాలని ఉవ్విళ్లూరారు. కాని ఉపదేశమనే ప్రసక్తి రాగానే బాబా తప్పుకొనేవారు.
ఉపదేశాలు వింటూ ఎవరూ పురోగ మించలేరనీ, స్వప్రయత్నంతో పాటుబడితేనే పురోగతి సాధ్యమనీ ఆయన విశ్వాసం. కాని స్వామీజీ వదలిపెట్టలేదు. ఏవేవో ప్రశ్నలు అడిగి ఆయన అనుభవ పూర్వమైన జవాబులు ఆసక్తిగా వినేవారు. బాబా వచించిన రెండు భావనలు స్వామీజీ కాలాంతరంలో బోధించిన కర్మయోగ భావనలకు ఆధారప్రాయమైనవిగా ఉండడం చూడవచ్చు.
స్వామీజీ : ప్రారంభ దశలోని సాధకులకు మాత్రమే హోమం, పూజ మొదలైనవి తగినవి. మీ రెందుకు వాటిని అనుష్ఠిస్తున్నారు?
బాబా : ఏమిటి, కర్మలంటే ఒక వ్యక్తి తన నిమిత్తమే ఆచరిస్తున్నాడని నువ్వెందుకు భావించాలి? ఇతరుల కోసమూ కర్మలు ఆచరించవచ్చు కదా!
పనులు విడిచిపెట్ట నక్కరలేదు, అన్ని పనులూ చేయవచ్చు. కాని తన కోసం కాదు, ఇతరుల కోసం. అలా చేసేటప్పుడు అది ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది. ఈ భావన కాలాంతరంలో స్వామీజీ బోధించిన కర్మయోగానికి ఒక ప్రధాన ప్రాతిపదికగా విరాజిల్లింది.
మరొకసారి స్వామీజీ అడిగారు.
స్వామీజీ : ఎలా పని చేయడం?
బాబా : లక్ష్యాన్నీ సాధననూ ఏకం చేయి.
దీనిని వివరిస్తున్నప్పుడు తమ కర్మయోగ ప్రసంగాలలో స్వామీజీ ఇలా ప్రస్తావించారు:
"పవహారీ బాబా ఒకసారి కర్మ రహస్యాన్ని గూర్చి నాతో ఇలా చెప్పారు: 'లక్ష్యాన్నీ సాధనను ఏకం చేయి.' మీరు ఏ పని చేసినా ఆ పని తప్ప మరేదీ యోచించకండి. ఆ పనిని ఒక ఆరాధనగా, ఉన్నతమైన ఆరాధనగా, ఆ సమయంలో మీ జీవితం యావత్తు దానికి అంకితం చేసి చేయండి.”🙏
*ధన్యవాదములు మరియు శుభోదయ వందనములు! 🙏🙏🙏🙏*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి