7, డిసెంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||



ఇంత కచ్చితంగా ఇంత ధర్మబద్ధంగా ఇంత మృదువుగా ఆ మహాభాగుడు నన్ను వారిస్తే

నిజంగా నాకు సిగ్గువేసింది. ధర్మజ్ఞా ! సత్యం చెప్పావు. నువ్వు అంత్యజుడివైతేనేమి నీ బుద్ధి విశదంగా

ఉంది. నువ్వు వారించడం సమంజసమే. తప్పులేదు. కానీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ధర్మసూక్ష్మాలు కొన్ని

ఉంటాయి. అన్నింటికన్నా ముందు ప్రాణాలను కాపాడుకోవాలి. దేహాన్ని నిలుపుకోవాలి. అందుకోసం

అగతికంగా పాపం చేసినా అటు తరువాత విశుద్ధికోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మసూక్ష్మం. ఏ ఆపదా

లేనప్పుడు పాపంచేస్తే అది దుర్గతికి కారణమవుతుందే తప్ప ఆపదల్లో చేస్తే కాదు.

నివారయామి భక్ష్యాత్ త్వాం న లోభేనాంజసా ద్విజ

వర్ణసంకరదోషోఽయం మాయాతు త్వాం ద్విజోత్తమ ॥(13 - 20)

(13-23, 24)

ఆకలితో చనిపోతే నరకం తప్పదు కనక ఎలాగోలా ఆకలి తీర్చుకోవడం కర్తవ్యం. అందుకని

నేను ఈ దొంగతనానికి పాల్పడ్డాను. ప్రాణాలు నిలుపుకోవాలికదా ! వర్షాలు కురవకపోవడంవల్ల

గడ్డుకాలం దాపురించి నేను ఈ చౌర్యానికి దిగవలసి వచ్చింది. దీనివల్ల వచ్చే మహాపాపం ఏమైనా ఉంటే

అది వానలు కురిపించని పర్జన్యుడికి చెందుతుందే తప్ప నాకు అంటదు.

పాపస్యాంతే పునః కార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే |

దుర్గతిస్తు భవేత్పాపాత్ అవాపది న చాపది

మరణాత్ క్షుధితస్యాథ నరకో నాత్ర సంశయః |

తస్మాత్ క్షుధాపహరణం కర్తవ్యం శుభమిచ్ఛతా ॥

(13-26

కామెంట్‌లు లేవు: