22, ఏప్రిల్ 2024, సోమవారం

కాశీలో జీవనం

 

కాశీలో జీవనం

 

వివిధ ప్రాంతాలనుంచి అనేదానికన్నా వివిధ దేశాలనుంచి ఎంతోమంది కాశీకి వచ్చి రోజులకొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాలకొద్దీ నివసిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు లభించిన సమాధానం నేను ఏప్రిల్ 5 తారీకు ఉదయం 8-30 నుండి 9 గంటలవరకు పొందిన అనుభవం, అనుభూతే సమాధానంగా లభించింది. కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక అనుభూతి,. అక్కడి భక్తులందరూ నాకు ఈశ్వరుని ప్రమద గణాలుగా అనిపించారు. ఆలయ ప్రాంగణం సాక్షాతు కైలాసంగా అనిపించింది. సాధకుడు పొందిన దివ్యానుభూతిని వర్ణించ మాటలు లేవు. అటువంటప్పుడు ప్రతివారు ఈశ్వరుని సన్నిధిలో ఉండాలని అనుకోటంలో ఆశ్చర్యం ఏముంది. కాశీ పట్టణం ఎంతో పురాతనమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడు నడచిన ప్రదేశం. అమ్మవారు తిరిగిన స్థలం. ఇప్పటికి అక్కడికి దేవతలు వస్తారని ప్రతితీ.

 

సాధకుల జీవనం:

 

అరిషడ్వార్గాలను వదిలి దేహాభిమానాన్ని త్యజించిన సాధకులు అనేకులు మనకు కాశీలో  తారసపడతారు. బిక్షాటన చేస్తూ పరమేశ్వరుని కొలిచేవారు కొందరు ఆంధ్రశ్రమంలో రోజు 20,30 మంది సాధువులు వచ్చి కూర్చోవటం    వారికి అక్కడ రోజు భోజనం పెట్టటం నేను చూసాను. . ఆలా కాశీలో ఎన్నిచోట్ల అన్నదానం జరుగుతుందో  ఏమో మరి. ఇక కొందరు సాధువులు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం చేస్తూ జీవిస్తున్నారు.  కొందరు. సాధువులే కాదు సామాన్యుజనం కూడా సాదారణ జీవనం పెట్టుబడి  లేకుండా,లేక కొద్దీ పెట్టుబడితో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను.

 

కొద్దిపెట్టుబడితో అంటే : ఒక రూ 100-500 పెట్టుబడితో జీవనం. కొందరు సాధువులు ఒక చిన్న పళ్ళెరం పట్టుకొని అందులో భస్మం యెర్రని చెందనం, ఒక త్రీసులపు లేక మూడుగీతాల ముద్రలు కలిగిన ముద్రలు వెంట పెట్టుకొని భక్తులకు బొట్లు పెట్టి డబ్బులు వసులు చేసుకుంటున్నారు. హీనపక్షం వారు రోజుకు 1000 నుండి 1500 వరకు సంపాయించవచ్చు. మేము బోటులో గంగ హారతి చూస్తూవుంటే ఒక సాధువు ఒక పళ్ళెరంలో చిన్న దీపారాధన కుంది పెట్టుకొని చిన్న సీసాలో నూనె పెట్టుకొని అందరికి హారతి చూపిస్తున్నాడు.  ఒక్కొక్కరు 10,20 ఇంకా కొంతమంది అంతకన్నా ఎక్కువ డబ్బులు వేయటం నేను చూసాను. చాలా తక్కువ పెట్టుబడితో రకంగా కూడా జీవించవచ్చు. అన్నీ  పడవలు తిరిగితే అతనికి రూ 2000 వరకు కూడా రోజుకు రావచ్చు. కేవలం గంట నుండి 2 గంటల వరకు బొట్లు తిరిగితే సరి రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా జీవనం సాగించవచ్చు. దేవాలయూయానికి వెళ్లే మార్గంలో ఉమ్మెత్తకాయలు, జిల్లేడు పూవులు, జిల్లేడు పులా మాలలు, మారేడు దళాలు అమ్మే వాళ్ళు కొంతమంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం బయలు ప్రదేశాలకు వెళ్లి ఆకులు, అలమలు  ఏరుకోరావటం చేసి సంపాదిస్తున్నారు.  పెట్టుబడి ఏమిలేదు కేవలం తిరిగి ఏరుకొని రావటమే.  చాలా తక్కువ ఖర్చుతో అంటే జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ఉండే ప్రదేశానికి వెళ్ళటమే. ఆలా ఏమాత్రం ఖర్చు లేకుండా సంపాదన. నాకు అనిపించింది పుణ్యక్షేత్రాలలో ఏదో ఒక పని చేసి పొట్టపోసుకోవచ్చు అని.

 

ఇక కొంచం పెట్టుబడితో జీవనం:

 

కొంతమంది పిల్లలు 15 నుంచి 20 సం మధ్యవాళ్ళు  ఒక కిరోసిన్ స్టవ్వును ఒక డబ్బాలో పెట్టి పైన ఒక రాతివెండి కెట్లి పెట్టి లెమెన్ టీ అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఒక్కో టీకి రూ 20 తీసుకుంటున్నారు.  వీళ్ళు రాత్రి గంగ హారతి సమయంలో బోట్లమీద తిరుగుతూ, పగటి పుట గల్లీలలో తిరుగుతూ అమ్ముతున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు ట్రిప్పులు తిరిగితే 60 నుంచి 80 టీలు సునాయాసంగా అమ్మవచ్చు. వాళ్లకు వేయి రూపాయుయాలకన్నా ఎక్కువ గిట్టుబాటు కాగలవు.

 

చిన్న దుకాణాలు. రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ సామానుల దుకాణాలు వీటికి 2000 నుండి 5000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది.

 

చొక్కాల వ్యాపారం. మహాదేవ అని ఇంకా ఇతర శివనామాలు హిందీలో వ్రాసినవి  అచ్చువేసిన చొక్కాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్క చొక్కాకు రూపాయలు 50 లాభం రావచ్చు. అంతే  కాక ఆడవారి డ్రస్సులు, చీరలు కూడా ఫూటుపాత్ మీద అమ్ముతున్నారు. వ్యాపారానికి కొంత ఎక్కువ పెట్టుబడి కావాలి. లాభం మంచిగా ఉంటుంది.

 

రాగి ఇత్తడి సామానులవ్యాపారం. రాగి చెంబులు,  కంకణాలు,చిన్న పాత్రలు (గంగ నీరు పట్టుకోవటానికి) ఇవి ఇనుపవే కానీ రాగివాటిలాగా కనపడతాయి. ఇత్తడి కుందులు, చిన్నచిన్న వస్తువులు, శివలింగాలు, జంధ్యాలు, విబూది, రుద్రాక్షమాలలు, స్పటిక మాలల దుకాణాలు మనకు అడుగడుగునా కనపడతాయి. వస్తువుల ధరలు మనకు ఇక్కడికన్నా  పెద్దగా తేడా నాకు కనిపించలేదు. రెండు ఇత్తడి కుందులు 150 చెప్పి రూ 120 కి ఇచ్చాడు.

చిన్న టీ స్టాళ్ళు , చిన్న ఇడ్లీ, వడ, దోశ హోటళ్లు అంటే రోడ్డు ప్రక్క బండ్లు అరుగు మీద పెట్టి అమ్మే చిన్న షాపులు మనకు కాశీలో కో కొల్లలు గా కనపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దాదాపు అందరు తెలుగులో మాట్లాడటమే కాదు ప్రతి సందులో మనకు తెలుగు బోర్డులు ఉండటం విశేషం. చిన్న వ్యాపారస్తులు అక్కడి ట్రావెల్స్ తో సంబంధం పెట్టుకొని తెలుగులో కరపత్రాలు ముద్రించి మేము గయకు, ప్రయాగకు, అయోధ్యకు కార్లు, చిన్న బస్సులు సప్లై చేస్తామని వ్యాపారం చేస్తున్నారు. వారికి ఒక్కొక్క త్రిప్పకు 500 పైన కమిషన్ లభిస్తుంది. వీరు వారి వ్యాపారానికి అనుబంధంగా కమీషను  కూర్చొని సంపాదిస్తున్నారు.

ఇక తొక్కే రిక్షాలు రిక్షావాళ్లు 1-2 కిలోమీటర్ల దూరం వరకు వెళతారు 70 రూపాయలకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు.

బ్యాటరీతో నడిచే రిక్షాలు వీరి సంపాదన చాలా బాగుంది. వీరు ఒక ట్రిప్పుకు 300 నుంచి 400 వందల వరకు అడుగుతున్నారు. వీరు రోజులో 20 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేయగలరు అంటే వారి సంపాదన ఎలా ఉందో ఊహించండి. బ్యాటరీ రిక్షా ఖరీదు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు. రిక్షాలు మెయింటెనెన్స్ ఫ్రీ కేవలం రెండు మూడు ఏళ్లకు ఒకసారి బ్యాటరీలు మార్చాలి. ఒక ఊడదీసిన రిక్షాను చూసాను అందులో లేడ్  యాసిడ్(Led Acid ) బ్యాటరీలు ఉన్నట్లు కనిపించింది. వారణాశిలో, గయలో, నాకు చాలా బ్యాటరీ రిక్షాలు కనిపించాయి. వీటిలో 8 మంది దాకా ప్రయాణించవచ్చు. వెడల్పు తక్కువగా వుంది ఎదురెదురుగా కుర్చునేటట్లు రెండు సీట్లు ఇంకా డ్రైవర్ పక్కన కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. రిక్షా వాళ్ళ సంపాదన చాలా బాగుంది.

ఆటోలు కూడా చాలా కనపడుతున్నాయి కానీ ఆటోలు బ్యాటరీ రిక్షాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. . ఇవి కాక టాక్సీ కారులు, మినీ బస్సులు  అంటే ట్రావెలర్ వాళ్ళవి అన్నమాట, రకంగా రవాణా వాహనాల వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు.

నేను ఒక గల్లీ లోంచి వెళ్తుంటే ఒక యువతితో పరిచయం అయ్యింది.  ఆమె రెండు నెలల క్రితం ఆంధ్ర నుంచి వచ్చిందట, తెలుగు తప్ప ఏమీ రాదు.  అక్కడ ఒక ఆశ్రమంలో ఆమె వుంటున్నది. ఆశ్రమ అరుగు మీద ఒక చిన్న దుకాణం పెట్టుకున్నది.  అది ఆశ్రమం స్వామీజీ ఏర్పాటు చేశారని అన్నది.  ఆమె రుద్రాక్ష మాలలు,  తెలుగు పుస్తాకాలు, కొన్ని హిమాలయ డ్రగ్స్ వారి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నది. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు వచ్చి రుద్రాక్షమాలలు 10 కొన్నాడు. వాటికి 600 రూపాయలు ఇచ్చాడు. నేను ఆమెతో హిమాలయ ఆయుర్వేదం కాక పతంజలి మందులు విక్రయించమని సూచించాను. రెండు మూడు సాదారణ వ్యాధులకు పనికి వచ్చే  మందుల పేర్లు కూడా చెపితే ఆమె పుస్తకంలో వ్రాసుకుంది.

ఇన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నేను మన తెలుగువారు అనేకమంది వారణాసి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నట్లు నాకు అర్ధమైనది. అలాంటి వారికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో నేను కాశీలో వివిధ రకాల ప్రజల జీవన సరళి గురించి నేను చూసి గమనించి అర్ధంచేసుకున్నది వివరించాను నాకు తెలిసినంతవరకూ కాశీలో మధ్యతరగతి వారే ఎక్కువగా వున్నారు. కేవలం తెలుగు వస్తే చాలు కాశీలో బ్రతకవచ్చు.  నా వ్యాసం తెలుగు వారికైనా పనికి వస్తే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే.

కామెంట్‌లు లేవు: