మానవ జన్మ-దాని విశిష్టత
మనం పుట్టినప్పటి నుంచీ చూస్తున్నామీ ప్రపంచాన్ని. ఇది ఎంత విచిత్రమైనదో అంత విశాలమైనది. అచేతనాలని పరగణించబడే రాళ్ళురప్పలు మొదలుకొని చేతనాలన్నింటిలో గొప్పవాడని పట్టం కట్టుకొన్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్ళురప్పలు మొదలైన అచేతన పదార్ధాలకు అసలు ప్రాణమే లేదు. చెట్లకు, చేమలకు ప్రాణముంది గాని జ్ఞానం లేదు. పశుపక్ష్యాదులైన తిర్యక్కులకు ప్రాణము, జ్ఞానమూ రెండూ ఉన్నాయి. కాని ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే. వివేక జ్ఞానం కాదు. వివేక జ్ఞానమున్నది మానవుడొక్కడికే. ఇంతే కాదు. కాష్ఠ లోష్టాదుల మాదిరి మానవుడికి జడమైన శరీరమూ ఉంది. ఓషధి వనస్పతుల మాదిరి ప్రాణమూ ఉంది. పశు పక్ష్యాదుల మాదిరి వాసనా జ్ఞానమూ ఉంది. అన్నిటికన్నా అదనంగా వివేక జ్ఞానమూ ఉంది.
ఈ విధంగా అన్ని లక్ష్ణణాలు ఒక్క మానవుడిలో ఒనగూడి ఉందంటం మూలాన్నే అతడికి పురుషుడనే పేరు సార్ధకమైంది. పురుషుడంటే పూర్ణుడని అర్ధం. పూర్ణత్వం మానవుడొక్కడిలోనే ఉంది. మిగతా సృష్టిలో ఎందులోనూ లేదు. ఎందుచేతనంటే మిగతా సృష్టిలో ఒక్కొక్క దానిలో ఒకటి రెండు లక్షణాలు మాత్రమే అయితే, మానవ సృష్టిలో ఉండవలసిన అన్ని లక్షణాలు మనకు ప్రత్యక్షమౌతున్నాయి. ఇదే పూర్ణత్వమనే మాటకు అర్ధం.
పూర్ణత్వాని కపూర్ణత్వ మెప్పుడూ తక్కువే. అపూర్ణములైన వస్తువులన్నీ పూర్ణత్వాన్ని అందుకునే మార్గంలో ఏర్పడ్డ అనేకములైన మజిలీలు. అందులో మొదటి మజిలీ మృత్తికా పాషాణాదులు. రెండవ మజిలీ వృక్షలతాగుల్మాదులు. మూడవది పశుపక్షిసరీసృపాదులు. మొత్తంమీద అన్నీ కలిసి మానవుణ్ణే తమలో అధికుడిగా భావించి అతనికే ఈ సృష్టి సామ్రాజ్యాన్ని కట్టబెట్టాయా అనిపిస్తుంది. చేతనాచేతనాలన్నిటి మీద చాలా వరకు మానవుడు తన అధికారం చెలాయించటంలోనే ఈ అంశం మనకు దాఖలా అవుతుంది. ఆంతేకాదు. ఒక సార్వభౌముడికి సామంత రాజులందరూ కప్పాలు చెల్లించినట్లు, చరాచర సృష్టి అంతా మానవుడికే తన సర్వస్వాన్ని ధారపోస్తున్నట్టు కూడా కనిపిస్తుంది.
చూడండి! నిర్జీవమైన భూమి అమూల్యమైన తన ఖనిజ సంపదనంతా బయటపెడుతూ ఉందంటే తన కోసమా? కాదు మానవుడి కోసమే. అట్లాగే చెట్లు కాయలు కాస్తున్నాయి, పండ్లు పండుతున్నాయి అంటే అదంతా మానవుడి భుక్తి కోసమే. ఇక జంతుజాలము మాట చెప్పనే అక్కర లేదు. పాడి ఆవు మొదలు పట్టపుటేనుగు వరకు ఏదో విధంగా మానవుడి కుపయోగపడని జంతువంటూ లేదు. ఇలా ప్రతి ఒక్కటి సృష్టిలో ఈ మానవుడికి దాసోహ మంటున్నదంటే అతడిలో ఏదో ఒక విశిష్టత ఉండితీరాలి. ఏమిటా విశిష్టత. మిగతా గుణాలన్నీ పశుపక్ష్యాదులకు అతనికి సాధారణమే. పోతే వాటికంటే అధికంగా కనిపించే జ్ఞానమనే దొక్కటే అతనికుండే విశిష్టత.ఆదిత్యయోగీ..
ఈ జ్ఞానం కూడా వాసనా రూపమైతే మరలా ప్రయోజనం లేదు. అది జంతువులకూ ఉంది. వివేచనాత్మకమైన జ్ఞానం కావాలి. వాసనా జ్ఞానమని, వివేచనా జ్ఞానమని అప్పటికి జ్ఞానం రెండు విధాలు. కేవలం ఆకలిదప్పులు రాగద్వేషాల దాకా పరిమితమైన జ్ఞానమే అయితే అది వాసనా జ్ఞానం. అంతకు మించి పూర్వాపరాలను కలియబోసుకొని ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం అనే విమర్శనాత్మకమైన జ్ఞానమైతే అది వివేక జ్ఞానం. దీనినే ఆలోచన, మననమని గూడా పేర్కొంటారు.
ఈ మననమనే శక్తి కలవాడే మనువు. ఆ మను సంతతిలో జన్మించిన వాళ్ళం గనుక మనమంతా మనజులమని, మనుష్యులమని, మానవులమని అనిపించు కుంటున్నాము. మననం చేయటాని కొక ప్రత్యేకమైన ఉపకరణం కూడా ఉంది మనకు. అదే మనస్సు. మనస్సు, మానవుడు, మనువు అనే మూడు మాటలు గమనించండి. అన్నింటిలోనూ ’మన’ అనే అక్షరాలు రెండు అనుగతంగా వస్తాయి. ’మన’ అనే ధాతువుకు సంస్కృతంలో ఆలోచన చేయటమనే అర్ధం. మొత్తం మీద ఆలోచనాశక్తియే మానవుడి కున్న విశిష్టతకు ఏకైక కారణమని భావించవచ్చు.
ఐతే ఈ ఆలోచనా శక్తి యుక్తాయుక్త వివేచనాత్మక మని చెప్పాము. వాసనాత్మకమైన జ్ఞానంలో ఈ వివేచనకు చోటు లేదు. కనుకనే పశుపక్ష్యాదులైన ప్రాణులూ జీవిస్తున్నాయి. మనమూ జీవిస్తున్నాము. కాని అవి జీవించటానికి మనం జీవించటానికి ఎంతో తేడా ఉంది. వాటి జీవితం వాసనా ప్రేరితమైనది. మనదలా కాదు. ఒక పెద్దపులి కేదైనా ఒక జంతువు కనిపిస్తే చాలు. మీద పడి కరిచి చంపుతుంది. ఒక కుక్క మరి ఒక కుక్కను చూస్తే చాలు వెంటబడి తరుముతుంది. ఒక యెనుబోతు రొడ్డు మధ్య నిలుచొని మనుషులు పోతున్నా బండ్లు పోతున్నా కొంచమైనా ప్రక్కకు తొలగదు. ఒక గబ్బిలం మూసివేసిన అద్దాల తలుపులు తెరచిఉన్నాయని భావించి, మయ సభలో దుర్యోధనుడి లాగా, మాటిమాటికి తల పగుల గొట్టు కుంటుంది. ఇలాంటి వ్యవహారం మానవుడిలో కనపడదు. కనపడకూడదు. ఎందుకంటే మానవుడీ వాసనా భూమికను దాటి వివేక భూమికలో అడుగు పెట్టిన వాడు. అతడికి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో విభజించి చూచే జ్ఞానముంది. దానితో ఇది కర్తవ్యమని ఇది అకర్తవ్యమని స్పష్టంగా గ్రహించగలడు. కర్తవ్య జ్ఞాన మెప్పుడున్నదో అప్పుడా కర్తవ్యాన్ని జీవితాంతమూ పాటించవలసిన బాధ్యత గూడా ఏర్పడింది మానవుడికి...
.
*శాంతి లోపల నుండి ఉద్భవిస్తుంది. అది మొలకెత్తడానికి మరియు ఎదగడానికి మరియు వృద్ధి చెందడానికి వేచి ఉన్న ఒక చిన్న విత్తనం వలె ప్రతి ఆత్మలో ఉంటుంది. ఇది మొలకెత్తడానికి ముందు సరైన పరిస్థితులు, సరైన వాతావరణం మరియు సరైన చికిత్స అవసరం.ఆదిత్యయోగీ.నిశ్చలంగా ఉండండి మరియు సరైన పరిస్థితులను సృష్టించండి. నిశ్చలంగా ఉండండి మరియు విత్తనం పాతుకోవడానికి అవకాశం ఇవ్వండి. మట్టిలో బాగా పాతుకు పోయిన తర్వాత, అది పెరుగుతూనే ఉంటుంది; అయినప్పటికీ, దాని లేత ప్రారంభంలో పోషణ మరియు సంరక్షణ అవసరం. కనుక నిశ్చలతని, ధ్యానం ద్వారా అభ్యాసం చేయండి*
*ప్రపంచ శాంతికి తాళంచెవి మీలోనే ఉంది. ప్రపంచంలోని గందరగోళం మరియు అశాంతి గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు, కానీ మీలో విషయాలను సరిగ్గా ఉంచడం ప్రారంభించండి. సంకల్పం చేయడంలో నిశ్శబ్దంగా ఉంటూ, దానితోనే ఉండండి. మీరు దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, జీవించండి. మీ స్వంత జీవితంలో అశాంతిని మరియు గందరగోళాన్ని - శాంతి, ప్రశాంతత మరియు దివ్యతగా మార్చుకోండి. మీరు నివసించే సమాజంలో మరియు ప్రపంచంలో ఉపయోగకరమైన సభ్యుడిగా అవ్వండి. మీరు ఏదైనా చేయగలరని మీకు తెలిసిన చోట మీలో, మీతోనే ప్రారంభించండి, ఆపై బాహ్యంగా పని చేయండి. దివ్యతకి బాటలు వేయండి...
ఈ జాగ్రదవస్థ 'ఓ పెద్ద కల' అని తెలుసుకున్నాక ఇందులోని ప్రతి ఘట్టము నవ్వులాటగా ఉంటుందే తప్ప దేనికి సీరియస్ గా స్పందించడం అనేది ఉండదు...
.
స్వీయ-సాక్షాత్కారానికి అన్ని సహాయాలలో గొప్పది గ్రహించిన వ్యక్తి యొక్క ఉనికి. దీన్నే సత్ సాంగ్ అంటారు, అంటే అక్షరార్థంగా జీవితో సహవాసం. ఇక్కడ కూడా భగవాన్ కొన్నిసార్లు నిజమైన 'ఉండడం' నేనే అని మరియు అందువల్ల సత్ సాంగ్ కోసం భౌతిక రూపం అవసరం లేదని వివరిస్తాడు. అయినప్పటికీ, అతను దాని ప్రయోజనాలపై తరచుగా నివసించాడు.
సత్యాన్ని గ్రహించిన ఋషులతో సహవాసం భౌతిక అనుబంధాలను తొలగిస్తుంది; ఈ అనుబంధాలు తొలగిపోతే, మనసులోని అనుబంధాలు కూడా నాశనం అవుతాయి. అలా ఎవరి మనసులోని అనుబంధాలు నశించిపోతాయో వారు చలనం లేని దానితో ఏకమవుతారు. వారు జీవించి ఉండగానే విముక్తిని పొందుతారు. అటువంటి ఋషులతో సహవాసాన్ని గౌరవించండి. ఋషుల సాంగత్యం ఫలితంగా ఇక్కడ మరియు ఇప్పుడు లభించిన ఆ పరమ స్థితిని, హృదయంతో సంపర్కంలో ఉన్న ఆత్మవిచారణ యొక్క లోతైన ధ్యానం ద్వారా సాక్షాత్కరింపబడిన ఆ సర్వోన్నత స్థితిని గురువు సహాయంతో లేదా గ్రంధాల జ్ఞానం ద్వారా పొందలేము. లేదా ఆధ్యాత్మిక యోగ్యత ద్వారా లేదా మరే ఇతర మార్గాల ద్వారా.......*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి