ధార్మిక గీత
శ్లో: వస్త్రేణ వపుషా వాచా
విద్యయా వినయేన చ
వకారై: పంచభి ర్హీనః
వాసవో౽పి న పూజ్యతే
చ. వినయము వాక్కు వస్త్ర వపు విద్యను , పంచ 'వ' కారమెల్ల తా
ననయము గూడినన్ నరుడు నాణ్యతతోడ వసించు నెప్పుడున్,
ఘనమగునట్టి యా యయిదు గల్గకయుండిన , నింద్రుడేనియు
న్ననువగు గౌరవంబు తన కందక కుందెడు , నెల్ల వేళలన్
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి