20, ఏప్రిల్ 2024, శనివారం

లోకేశ్వరునకు అంజలి!!

 లోకేశ్వరునకు అంజలి!!


"ఎవ్వనిచే జనించు ?జగమెవ్వని లోపలనుండు లీనమై,?

ఎవ్వనియందు డిందు,? పరమేశ్వరుడేవ్వడు,?మూలకారణం,

బెవ్వ,?డనాది మధ్య లయుడేవ్వడు, ?సర్వము తావెయైనవా,

డెవ్వడు,?వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదవ్;


లోకమంతా ఎవనిచే సృష్టింపబడుచున్నదో,?పోషింపబడుచున్నదో,?లయింపబడుచున్నదో,?


పుట్టుట, పెరుగుట,గిట్టుటలు యెవనితిలేవో,?

ఎవనియందీసృష్టి పరివృధ్ధినొందుచున్నదో,?పరమేశ్వరుడెవ్వడో,సకలమునకూ మూలకారణమెవ్వడో,?నాహృదయమున చైతన్యరూపుడైనిలచిన ఆసర్వేశ్వరుని శరణువేడెదను.!!


       బమ్మెఱపోతన భాగవతములోని గజేద్రుని ప్రార్ధనమిది.

       గజేంద్రుడు  సకలజీవకోటికి ప్రతినిధి

.అహంకారమున్నంతవరకూ పరమేశ్వరుడు గుక్తుకురాడు.

అహంకారమణగినంతవే జీవునకు పరమాత్మజ్ఙప్తికి వచ్చును.

సహజమైన యీపరిణామమును పోతన కడుంగడు సహజముగా చిత్రించి నాడు.


          మనమందరము గజేంద్రులమే! భోగపరాయణులమైఅహంకార మమకారములలో మునిగి,యాదేవదేవునకు నానాటికి దూరమవుచున్నాము.

ఒక్కసారి మనయాత్మలను పరిశీలించికొందము.మరచిన యాపరమేశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లి,మనలోనియహంకారరూపమైన గ్రాహమును పరిమార్చి, భవసాగర  తరణము నొనరింజేసి రక్షింపు మనిశరణువేడెదముగాక!

                           స్వస్తి!🙏🙏👍🌷🌷🌷

కామెంట్‌లు లేవు: