20, ఏప్రిల్ 2024, శనివారం

కాశీ యాత్ర (నాలుగవ భాగము)

 

కాశీ యాత్ర (నాలుగవ భాగము

 6 తారీకు ఉదయం నేను 3-30 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నా శ్రీమతిని, కుమారుడిని త్వరగా తయారు కమ్మని చెప్పగా ఉదయం 5 గంటలకు మేము రూముకు తాళం వేసి చిన్నగా ఆశ్రమం ప్రక్క సందునుండి సైకిలు బాబా ఆశ్రమం వరకు నడుచుకుంటూ వెళితే అక్కడ ఒక రిక్షా కనిపించింది 300 రూపాయలకు నంది సర్కిల్ వరకు రావటానికి వప్పుకొన్నాడు. బ్యాటరీ రిక్షాలు రోడ్డుమీద వెళితే మనకు ఎడ్ల బండి ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటె వాటి షాక్ అబ్సర్వర్స్ మంచిగా వుండవు. 15 నిముషాలలో మమ్మలను నంది సర్కిల్లో దించాడు. మేము ఆలస్యం చేయకుండా గేటు  నెంబరు 1 ద్వారా వెళ్లి సాక్షి గణపతి మరియు అన్నపూర్ణ అమ్మవారిని, మరియు వారాహి మాత అమ్మవారిని చూడాలని సంకల్పంకాగా అక్కడి పోలీసులు గేటు -1 నుండి వెళ్లనీయలేదు. మేము కొంచం ముందుకు వెళ్లి గేటు-2 నుండి వెళ్లి దైవానుగ్రహంతో ముందుగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాము. ఆంజనేయస్వామికి పూసినట్లు స్వామికి సిందూరం పూసి ఉంచారు. జనం ఎవరు లేరు. చక్కగా దర్శనం అయ్యింది. తరువాత వారాహి అమ్మవారి దర్శనానికి వెళితే అక్కడ చాలామంది క్యూలో వున్నారు. మేము క్యూ చివరకు వెళితే అక్కడ ఒక ఆంజనేయస్వామి దేవాలయం కనిపించింది స్వామిని దర్శించుకొన్నాము దేవాలయ ప్రాంగణం చిన్నగా వుంది అక్కడ్నుంచి చుస్తే గంగ నది కనిపిస్తున్నది. కొంచం సేపు అక్కడ ఉండి దేవాలయం క్రింద ఒక మునిసిపల్ నల్ల కనిపిస్తే కాళీ ఆయిన మా నీళ్ల సీసాను నింపుకొని మరల క్యూను ముందరగా వెళితే అక్కడ వున్న రోడ్డు ప్రక్క దుకాణం ఆమె మీరు ఒక్కొక్కరు రూ 300 ఇస్తే మీకు స్పెషల్ దర్శనం  చేయిస్తాను. అది నాకు ఇవ్వనక్కరలేదు పూజారికి ఇవ్వండి అని మమ్మలను ఆపింది. నాకు ఎండకు అస్వస్థతగా ఉండటం చేత మనం వెళదాం అని మా వాళ్ళను తొందర పెట్టితే ఆమె బాబూజీ ఉండండి మీకు కుర్చీ వేస్తా అని ఒక కుర్చీ తెచ్చి వేసి నాకు త్రాగటానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ఆమె కూతురుకు ఫురమిస్తే అమ్మాయి ఒక పెద్ద గ్లాసునిండా మజ్జిగ పంచదార కలుపుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది తాగి నేను కొంత ఊరట చెందాను. ఇంతలో దేవాలయపు తలుపులు మూయటంతో క్యూలోని వాళ్లంతా వెళ్లారు. అక్కడ మేము ముగ్గురం మా ముందు దుకాణం ఆమె ఆపిన మొరొక 4గురు మాత్రమే మిగిలారు. ఇంతలో ప్రక్క ఇంట్లోంచి ఒక పూజారి వచ్చి కేతేనే లోగ్ హై అన్నాడు. తీన్ అని మా కాంట్రాక్టరు, చారు అని ఎదురు షాపు ఆమె అనటంతో జెల్ది ఆజావ్ అని దేవాలయపు తలుపు ప్రక్కన వున్న గది తలుపు తెరిచాడు. మేము ముగ్గురం మిగిలిన వార్ అందరం లోపలి వెళ్ళాం తీన్  తీన్  సౌ దేవ్ అని ముందుగా మా దగ్గర 900 రూపాయలు తీసుకున్నాడు. నాకు అంతా అయోమయంగా అనిపించిందిమమ్మలను చిన్నగా ఒక గదికి తీసుకొని వెళ్ళాడు అదే వారాహి అమ్మ దేవాలయం. నన్ను కూర్చో మని అన్నాడు నాకు తెలియక బాసుపేట్లు  వేసుకొని కూర్చున్నాను. ఐస నై అని గొంతుకు కూర్చోమని చెప్పాడు అక్కడ 2.x 1 అడుగుల  కంత ఒకటి వున్నది దానిలోంచి క్రిందికి చూడమని చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది అమ్మవారు క్రింద వున్నారని. నేను చుస్తే అమ్మవారి ముఖం ఒక ప్రక్కగా క్రింద కనిపించింది. చేలో చేలో అని నన్ను పంపించి మిగిలిన వారికి కూడా ఒక 2 నిముషాలలో దర్శనం చేయించి పంపాడు. మేము బ్రతుకు జీవుడా అని బయటకు  వచ్చాము. తరువాత అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయట విచారించాం కానీ క్యూ చాల పెద్దగా ఉండటం చేత తల్లిని చూడకుండానే వెళదామని నిర్ణయించుకున్నాం. బయటకు అంటే సందులలోంచి రోడ్డు మీదకు రాగానే ఒక టీ దుకాణం కనిపించింది. మట్టి గ్లాసులల్లో టీ ఇస్తున్నాడు. గ్లాసు 15 రూపాయలు. తాగినవి పారేయటమే. నాకు మట్టి గ్లాసు నచ్చింది. నాకు ఒక కాళీ గ్లాసు కావలి అంటే 3రూపాయలకు ఇచ్చాడు. దానిని భద్రంగా తెచ్చుకొన్నాను

రోడ్డుకు ఇరుపైపుల మన చార్మినార్ రోడ్డులాగా అన్నీ బట్టల  దుకాణాలు,డ్రస్సులు అమ్ముతున్నారు. ఆడవారు చేతినిండా డబ్బులు తీసుకొని వస్తే మోయలేనన్ని బట్టలు కొనటం కాయం. కాకపొతే మాకు ఆకలి బాగా వేయటంతో ఏమి కొనకుండానే 1-30 గంటలకు నంది సర్కిలుకు నడుచుకుంటూ వచ్చి ఒక సైకిల్ రిక్షా ఎక్కి రూము దోవ పట్టము. రిక్షా వాడు రూ 100 తీసుకున్నాడు. రూములో కొంతసేపు ఉండి అక్కడినుండి కరివేనసత్రం భోజనాలయానికి వెళ్లి భోజనం చేసి ఇక రోజు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నామునేను మాత్రం మరుసటి రోజు ప్రోగాంగూర్చి ఆలోచిస్తున్నాను. మేము ఆశ్రమ సందులోకి వస్తూవుంటే ఒకడు కరపత్రాలను పంచుతున్నాడు. అది గయ, ప్రయాగరాజుకు టూరులు అది చదివి నేను మరుసటి రోజు గయకు వెళ్ళటానికి కారు మాట్లాడుకున్నాను. గయా చూపించి తిరిగి తీసుకొని రావటానికి రూ 6000 అడిగాడు. ముందుగా అద్వాన్సు రూ  500 అడిగితె ఇచ్చాను. నాకు ఆతను డ్రైవరు ఫోను నంబరు ఇచ్చాడు. ఉదయం 5గంటలకు బెంగాలీ టోలి దగ్గరకు కారు వస్తుంది అని అన్నాడు. నేను ఇంటికి వచ్చి రేపటి ప్రోగ్రాం గురుంచి మావాళ్లకు చెప్పాను . సాయంత్రం ఆంధ్రశ్రమం నుంచి తెచ్చుకున్నటిఫిన్ బియ్యపురవ్వ ఉప్మా తిని పడుకున్నాము

కామెంట్‌లు లేవు: