20, ఏప్రిల్ 2024, శనివారం

మూర్ఖుని మనసు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

      🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝. 

*శక్యో వారయితుం జలేన హుతభుక్చత్రేణసూర్యాతపో*

*నాగేంద్రో నిశితాంకుశేన సదండేన గౌర్గర్దభః*

*వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం*

*సర్వస్వౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్త్వౌ షధం!!*


  నీటితో నిప్పును, గొడుగుతో సూర్యుణ్ణి, ముల్లుకర్రతో ఎద్దును, గాడిదలనూ,అంకుశంతో మదపుటేనుగును, ఔషధంతో రోగాన్ని, మంత్ర ప్రయోగంతో విషాన్ని చక్కబరచవచ్చు.... కానీ, *మూర్ఖుని మనసును మాత్రం ఏ విధంగానూ సరిచేయలేము*..

కామెంట్‌లు లేవు: