20, ఏప్రిల్ 2024, శనివారం

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*20-04-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

వృషభం


ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

---------------------------------------

కర్కాటకం


మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------

సింహం


వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

---------------------------------------

కన్య


చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలోఅధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

---------------------------------------

తుల


పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

---------------------------------------

వృశ్చికం


ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

---------------------------------------

మకరం


వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపుబాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------

కుంభం


కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

---------------------------------------

మీనం


అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

కామెంట్‌లు లేవు: