22, ఆగస్టు 2024, గురువారం

దేవాలయాలు & పూజలు 18

 *దేవాలయాలు & పూజలు 18*


సభ్యులకు నమస్కారములు.

 

దేవాలయాలు శీర్షికలో *పూజా కార్యక్రమాలను* తెలుసుకునే ముందు, పూజలలో 

*వివిధ సంప్రదాయాల* గురించి అవగాహన ఏర్పరచుకుందాము. సంప్రదాయము అనేది అభ్యాసము (ఆచరించుట), వీక్షణము (గమనించుట), మరియు వైఖరుల (ప్రవర్తన) సమాగము. ఇది వరుసతరంచే (వంశీయుల లేక అనువంశిక/ అనుయాయుల) ప్రసారం (అందించ) చేయబడుతుంది, పునర్నిర్వచింపబడుతుంది. సంప్రదాయ దీక్ష గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ....

*గురు శిష్య సంప్రదాయం* లో ఒక నిర్దిష్టమైన   

*ఆది గురు* వంశ కొనసాగింపును

గురుపరంపర అంటారు. వీటిని కొనసాగించడానికి, నిర్వహించడానికి గురుకులాలు, ఋష్యాశ్రమాలు, అఖారాలు, అఖాడాలు ఉంటాయి.


దక్షిణ భారతదేశంలో ప్రధానమైన ఐదు సంప్రదాయాలను గమనిద్దాము. 

1) వైఖానస

 2) స్మార్త 

3) శ్రీ వైష్ణవ 

4) మధ్వ 

5) శైవ.

వివరాలు టూకీగా...

1) *వైఖానస* ఆది వైష్ణవ ఆచారం. ఈ ప్రస్తావన పద్మ పురాణంలో కలదు. ఋషి *విఖనసుడు* శ్రీ మహా విష్ణువు అంశతో జన్మించిన వారు. బ్రహ్మతో బాటు వీరికి ఉపనయనం జరిగినది. 

శ్రీ మహా విష్ణువే గురువుగా సమస్త వేదాలు, భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆ పై నైమిశారణ్యం వెళ్లి అక్కడ *వైఖానస కల్ప సూత్రాన్ని* రచించి, తన నలుగురు ప్రధాన శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు మరియు మరీచికి పై కల్ప సూత్రాన్ని ఉపదేశిస్తాడు. వైఖానసుల ప్రకారం *వైదిక హవిస్సు క్రతువునే* వీరు కొనసాగిస్తారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సు వేస్తే వచ్చే ఫలితమే *వైష్ణవారాధన* ద్వారా వస్తుందని నమ్ముతారు. మధ్వాచార్యుల ప్రకారం కొందరు *ద్వైత* సిద్ధాంతాన్ని అనుసరిస్తారు.

2) *స్మార్త సంప్రదాయము* స్మార్త సంప్రదాయము, శృతుల స్మృతులను ఆధారంగా ఏర్పడినది.

స్మార్త ఆచారము అనేది సంస్కృతము నుండి ఉద్భవించినది. ఒక ఆధునిక లేదా శాఖలు లేని హిందూమతం లోని మత సంప్రదాయంగా విలువలు కల్గిన వారు. వీరు దాదాపు అందరూ హిందు దేవతలను అంగీకరిస్తారు, పూజిస్తారు. *వేదాలు, శాస్త్రాలు అనుసరించే అనుచరులుగా "స్మార్త" అనే పదం సూచిస్తున్నది*.వీరు 

*శ్రీ ఆది శంకరాచార్యుల* వారిచేత ప్రతిపాదింపబడిన *అద్వైత సిద్ధాంతాన్ని* పాటిస్తారు. షోడష కర్మలు 

బోధాయనుల 

*సూత్ర*,.....

*భట్టీ యాల* ను అనుసరిస్తారు.

3) *శ్రీ వైష్ణవ సంప్రదాయం*

విష్ణువును అతని రూపాలను, అవతారాలలో వేటినైనా ఆరాధించే వారే వైష్ణవులు. ఇందులో ప్రధానంగా 

శ్రీ వైష్ణవులు,(పంచసంస్కారాలనిచ్ఛేవారు, ఆచరించేవారు...ఆచార్య పరంపరలోనివారు)

వైష్ణవులు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో

శ్రీ లక్ష్మీ సహిత శ్రీమహా విష్ణువు అవతారమైన వాటిని ఆరాధన క్రమం ఉంటుంది. వైష్ణవ సంబంధమైన అన్ని ఉపశాఖల గురించి ఇక్కడ ప్రస్తావించుట అసంబద్దమే అవుతుంది.


 దక్షిణ భారత దేశంలో శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఇచ్చిన భక్తి మార్గం. పనిద్దరాళ్వార్ లు అనగా 

12 మంది సన్యసించిన (పీఠాధిపతులు) వారి ప్రబోధనల ద్వారా శ్రీ వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగినది. భగవద్ రామానుజుల వారిచేత ప్రతిపాదింపబడిన *విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని* పాటిస్తారు. వీరు *ఊర్ధ్వపుండ్రాలను* అనగా నిలువు నామాలను నుదిటిన ధరిస్తారు. వీరిలో శ్రీ వైష్ణవ,(తెంగల) వైఖానన,(వడహల)

చాత్తాది వైష్ణవ

(యజ్ఞోపవీతార్హతలేని) మొదలైన ఉప శాఖలు గూడా ఉన్నాయి. 


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: