22, ఆగస్టు 2024, గురువారం

సాష్టాంగ నమస్కారం

 🙏🙏🙏🙏🙏

సాష్టాంగ నమస్కారం

🙏🙏🙏🙏🙏


సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము అని అర్ధం.ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో^ ష్టాంగ ఈరితః


అష్టాంగాలు :- అంటే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు, "కర్ణాభ్యాం" అంటే చెవులు. ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటారు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు 

తాకాలి.


3) దృష్టితో - నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.


అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమశ్శివాయ అనో 

అంటూ నమస్కారం చేయాలి.


6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8.జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

🙏🌞🙏🌞🙏

కామెంట్‌లు లేవు: