22, ఆగస్టు 2024, గురువారం

సూర్యాగ్నుల రూపమున

 👆 శ్లోకం 

ఓజస్తేజో ద్యుతిధరః                              

ప్రకాశాత్మా ప్రతాపనః|.                       

ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః                            చంద్రాంశుర్భాస్కరద్యుతిః||.          


ప్రతిపదార్థ:


ఓజస్తేజోద్యుతిధరః -- పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు


ప్రకాశాత్మా -- ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.


ప్రతాపనః --సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.


ఋద్ధః -- అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.


స్పష్టాక్షరః --స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.


మంత్రః --తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.


చంద్రాంశుః --చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.


భాస్కరద్యుతిః --సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.

కామెంట్‌లు లేవు: