29, ఆగస్టు 2024, గురువారం

గోమూత్రం

 గోమూత్రం గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .


       మానవ శరీరము నందు వాత, పిత్త , కఫాలు ప్రధానపాత్ర వహించుచున్నాయి. కొన్ని కారణాల వలన వీటిలో అసమతుల్యత ఏర్పడినపుడు మానవునకు రోగాలు సంభవించుచున్నాయి.  ఇలా సంభవించిన రోగాల నివారణకు గోమూత్రం ఒక గొప్ప ఔషధముగా పనిచేయును . గోమూత్రం విషదోషాన్ని హరించును . గోమూత్రం క్రిమిహరముగా కూడా పనిచేయును . మన శరీరము నందలి రోగ నిరోధకశక్తి తగ్గడం వలన కొన్ని రోగాలు రావటం జరుగును. గోమూత్రం రసాయన గుణములు కలిగి ఉండును. రోగనిరోధక శక్తి తగ్గటం వలన రసరక్తాధి ధాతువులు తగ్గును. అటువంటి సమస్యను కూడా గోమూత్రం నివారించును.


                గోమూత్రం నందు తామ్రము అను థాతువు కలదు. అది గోమూత్ర సేవన వలన మనుష్య శరీరం నందు ప్రవేశించినపుడు స్వర్ణముగా మారును . స్వర్ణం శరీరం నందలి సమస్తదోషములను నివారించును. రోగములలో రెండు రకాలు కలవు అవి మానసికం మరియు శారీరకం . మానసిక రోగం అత్యంత విషాదాన్ని కలిగించును. ఈ మనసిక విషాదం కలిగి ఉండటం వలన శరీరం నందు విషాణువులు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషాణువుల సమూహమే క్యాన్సరు వ్యాధిగా పరిమణించును.


                  గోమూత్రానికి విషాణువులను నివారించు గుణం కలదు. అందువలన క్యాన్సర్ నివారణలో ఈ గోమూత్రం అత్యద్భుతంగా పనిచేయును . అదేవిధంగా గోమూత్రాన్ని రసాయనిక విశ్లేషణ చేసినప్పుడు కొన్ని రకాల ధాతువులు ఆ మూత్రపరీక్ష నందు బయటపడినాయి. అవి  వరసగా 


 నత్రజని , గంధకం , అమ్మోనియా , అమ్మోనియా గ్యాస్ , తామ్రము ( రాగి ) , పొటాషియం , మాంగనీస్ , యూరియా , లవణము , ఆరోగ్యాన్ని పెంపొందించే ఆమ్లములు , క్యాల్షియం , జలం , లోహము ( ఐరన్ ) , యూరిక్ ఆసిడ్ , ఫాస్ఫెట్ లు , సోడియం , కార్బానిక్ ఆసిడ్ , A , B , C , D  విటమిన్లు , ఇతర ఖనిజములు , ల్యాక్టోజ్ ( ఇది పాలు ఇచ్చు గోవులలో ఉండును.) , ఎంజైములు , హిఫ్యూరిక్ యాసిడ్ , స్వర్ణక్షారము  మొదలైనవన్నీ గోమూత్రం నందు కలవు.


             గోవు యొక్క వెన్నుముక లోపల సూర్యకేతు నాడి కలదు. ఎప్పుడైతే సూర్యకిరణములు గోవు యొక్క శరీరాన్ని తాకునో వెంటనే అప్పుడు సూర్యకేతు నాడి సూర్యకిరణాల సహాయముతో స్వర్ణమును తయారుచేయును . మూత్రపిండములు   రక్తమును వడపోసినప్పుడు ఈ స్వర్ణక్షారం నిర్మాణం అగును. ఇది సర్వరోగహారం .


       గోమూత్రం సేకరించుటకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కలవు. వాటిని కూడా మీకు నేను వివరిస్తాను. 


  గోమూత్ర సేకరణ నియమాలు  -


 *  పరిసరముల నందలి అడివిలో లేక బీళ్లలో యథేచ్ఛగా తిరుగుతూ ఏ గోవు గడ్డిమేయునో మరియు నిర్మలమైన నీటిని తాగుచూ ఆరోగ్యముగా ఉండునో అట్టి గోవుయొక్క పాలు మరియు మూత్రం గొప్ప ఔషధగుణములు కలిగి ఉండును.


 *  దూడ , పెయ్య  , ముసలి ఆవు , ఎటువంటి గోవు యొక్క మూత్రం అయినను ఔషధ ప్రయోగానికి పనికివచ్చును.


 *  ఎద్దు మూత్రం తీక్షణముగా ఉండును. కాని ఔషధోపయోగమునకు పనికివచ్చును. ఎందువలన అనగా ఆవు మరియు గోవు రెండూ ఒకే జాతికి చెందినివి .


 *  గోమూత్రమును రాగి ,ఇత్తడి పాత్ర యందు ఉంచరాదు. మట్టిపాత్ర , గాజుపాత్ర , పింగాణిపాత్ర లేక స్టీలు పాత్రలో ఉంచవలెను.


 *  ఎంతకాలం నిలువ ఉంచినప్పటికీ గోమూత్రం యొక్క గుణము తరగదు. దాని యందలి లోహము లేక తామ్రము కారణంగా దాని రంగు కొద్దిగా నలుపు లేక ఎరుపుగా మారవచ్చు  . గోమూత్రం నందు గంగ ఉండునని చెపుతారు. గంగాజలం ఎలాగో గోమూత్రం కూడా ఎంతకాలం యున్నను చెడకుండా ఉండును. క్రిమికీటకాలు ఉత్పన్నం అవ్వవు.


 *  పెద్దవారు ఉదయం 25ml ఒక కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు . సాయంత్రం కూడా ఇదే మోతాదులో తీసికొనవచ్చు. దీనివలన మలప్రవృత్తి ఎక్కువ అయ్యి ప్రేగులు శుభ్రపడును .ఎక్కువుగా విరేచనం అవుచున్నచో 10ml మోతాదులో తీసుకొనవచ్చు .


 *  గోమూత్రాన్ని మధుమేహరోగం ఉన్నవారు తీసికొనవచ్చు. ఈ మధ్య కొంతమంది గోమూత్రం నందు బెల్లం కలిపి అమ్ముతున్నారు. అది మాత్రం నిషిద్దం. 


       పైన చెప్పిన ఉపయోగాలన్నీ దేశివాళి గోమూత్రాన్ని స్వీకరించినప్పుడే ఉపయోగపడును. జెర్సీ ఆవు మూత్రం వలన ఎటువంటి ఉపయోగాలు లేవు . నేను రాసిన గ్రంథాలలో ఆవుపాలు , ఆవునెయ్యి , ఆవు వెన్న ఉపయోగాల ఏయే వ్యాధులకు ఉపయోగపడునొ వివరంగా తెలియచేశాను . 


       తరవాతి పోస్టులో గోమూత్రం నందలి ధాతువులు మనశరీరానికి ఏవిధంగా ఉపయోగపడునో సవివరంగా వివరిస్తాను.


  

      మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: