27, జనవరి 2025, సోమవారం

చదువుకో.. గట్టిగాపొదువుకో...

 చదువుకో.. గట్టిగాపొదువుకో...


సీ..

విజ్ఞాన వేదంబు వేవేగ ప్రసరింప 

       నంతకంటెను భాగ్యమింతకలదె?

జంతుజాలములోన సరసంపుహృదయంబు

     మనుజజన్మకుదక్కె మాటతోడ

దివిజుల మెప్పించు ధీశక్తి చూపింప

     అక్షరంబువలయు కుక్షులకును

ప్రతిభావిశేషమున్  పనిగట్టిసాధింప

        మానవుండె మహిని మచ్చుతునక

తేగీ..

అక్షరమునునేర్వ మనిషికందమౌర

బాల్యసమయాన విద్యనే పడవలయు

చదువు సంస్కారమొకచోన సాగగాను

విద్యతోడ వివేకము వెంటవచ్చు

చదువుకొమ్మునరుడ!యనిశమ్ము..చదువు..

.

అక్షరాస్యతాదినోత్సవ శుభాకాంక్షలతో

రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి

కామెంట్‌లు లేవు: