🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శ్రీ శివానందలహరి*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు రచించిన స్తోత్ర గ్రంథాలలో" సౌందర్య లహరి", " శివానందలహరి" ఒక ప్రత్యేకతను సంతరించుకుని మకుటంలేని శతకాలుగా కీర్తి శిఖరాలను అందుకున్నాయి.*
*"సౌందర్య లహరి" శ్రీ విద్యా రహస్యాలతో శోభిల్లగా, "శివానందలహరి" పరబ్రహ్మ భావనయే పరమేశ్వర భావనగా విరాజిల్లునట్టిది.*
*జగద్గురువులు ఆదిశంకరులు అనుగ్రహించిన "శివానందలహరి" ఒక భక్తిరస సింధువు.*
*శివాత్మకమైన ఆనందపయోనిధిలోని ఒక్కొక్క తరంగము ఒక్కొక్క శ్లోకము.*
*నేను పామరుణ్ణి అనుకొనే వాడు కూడా ఈ శ్లోకాలను, అందులోని భావాలను చదివి, పండితుడయ్యే అవకాశముంది. చదవడానికి ప్రయత్నం చేయడమే మనపని. ఆ తరువాత అదే చదివిస్తుంది.*
*దేవాది దేవుడైన పరమశివుడిని చేరుకోవాల్సిన అవసరాన్ని, అందుకు మార్గాన్నీ "శివానందలహరి" మనకు చూపిస్తుంది.*
*రేపటినుండి రోజుకో శ్లోకం క్లుప్తంగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. శివుని కృపాదృష్టికి పాత్రులవుదాం.*
*ఓం నమః శివాయ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి