చ.తలచిన తక్షణమ్మె తమ ధారణఁ గల్మిని చాతురి ప్రభా
కలిత మనస్కులై వినుత గమ్యముఁ జేరు తెలుంగు తేజముల్
లలిత హితార్థ సన్మతి విలక్షణమౌ బహుళార్థ సాధన
మ్ములఁ గనిపెట్టి గాంచెదర పూర్వ మహోన్నత కీర్తి భారతీ!౹౹ 23
మ.మహనీయుల్ తమ జీవితమ్ములను సన్మార్గైక లక్ష్యమ్ముతో
బహుళార్థమ్ము లొసంగ నెంచి భువి నిస్వార్థైక యత్నమ్ములన్
విహితమ్మైన విశిష్ట యోచనల దీప్తిన్ సత్య ధర్మమ్ములన్
సహనమ్మున్ మది నమ్మి కూర్చిరి ఘన స్వాతంత్ర్యమున్ భారతీ!౹౹ 24
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి