అష్టస్వరూపధారిణి
కష్టనివారణి మధురిపు గాదిలిరాణీ
దుష్టదనుజ సంహారిణి
తుష్టి విధాయిని మముకృపతోడను కనుమా!
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఉసిరికాయతో వైద్యం -
* ఉసిరి , తాని , కరక్కాయ ( త్రిఫల ) చూర్ణాన్ని ఆవునెయ్యితో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది .
* ఉసిరిక మురబ్బాను లేదా పూటకు రెండు లేదా మూడు ఉసిరికాయల చొప్పున తీసుకుంటే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం 1 టీ స్పూన్ , క్యారెట్ రసం 1 గ్లాస్ , తేనే 1 టీ స్పూన్ కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లు అయితే క్యాన్సర్ వ్యాధికి , కోబాల్ట్ చికిత్స తీసుకున్న వారికి నీరసం తగ్గి ఉత్సాహం గా కూడా ఉంటారు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* ఉసిరిక రసము ఒక టీ స్పూన్ , కొబ్బరి పాలు ఒక కప్పు కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే జీర్ణకోశంలో గల నులిపురుగులు , బద్దెపురుగులు , కొంకి పాములు , ఎలిక పాములు వంటివి నశిస్తాయి.
* ఉసిరిక రసము 1 టీ స్పూన్ , తేనే 1 టీ స్పూన్ కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే ఉబ్బసం , స్కర్వీ వ్యాధి , రక్తహీనత ( ఎనిమియా ) వంటివి తగ్గుతాయి .
* సాధారణ జలుబు , జ్వరం ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించవచ్చు.
* ఉసిరికాయలు , పెద్ద ఉల్లిగడ్డలను సమానంగా తీసుకుని వాటిని నూరి రసమును తీసి ఆ రసాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తం అభివృద్ధి చెంది శుద్ది చేయబడుతుంది.
* ఉసిరిక వగరు , ద్రాక్షాపళ్లు ఈ రెండింటిని సమభాగాలుగా శొంఠిని కూడ కలిపి నూరి దానిని తేనెతో కలిపి తీసుకుంటే నోటి అరుచి తగ్గుతుంది .
* ప్రతిరోజు ఒక ఉసిరికాయని తిన్నట్లైతే అన్నిరకాల పైత్యాలు తగ్గుతాయి .
* ప్రతిరోజు ఉసిరికాయని తింటూ ఉంటే కఫము తగ్గును . మేధస్సు పెరుగుతుంది. నేత్రవ్యాధులు తగ్గుతాయి .
* పాత ఉసిరికాయల పచ్చడిని తింటూ ఉంటే గర్భిణి స్త్రీలకూ ఎంతో మంచిది.
* ఉసిరికాయ చెట్టు వేరుతో కషాయాన్ని కాచి త్రాగుతూ ఉంటే అతిదాహం తగ్గుతుంది .
* పచ్చి ఉసిరికాయలు దొరకనప్పుడు ఎండు ఉసిరికాయలు వాడవచ్చు.
* ప్రతిరోజు ఉసిరికాయను తింటూ ఉంటే మూలవ్యాధులు తగ్గిపోతాయి . ఆయుష్షు పెరుగును .
* జీర్ణశక్తి పెరుగుతుంది.
* పాత ఉసిరిక పచ్చడిని తినడం వలన విరేచనాలు నివారించ వచ్చు. వాతవ్యాధులు ను తగ్గిస్తుంది.
* ఉసిరిక వగరు తినడం వలన మెదడు నందు చేరిన చెడు నీరు తగ్గిపొతుంది.
* కడుపులో తిప్పడం ఉన్నవారు ఉసిరిక ని ఆహారంలో బాగం చేసుకొండి.
* ఎండిన ఉసిరికాయల రసాన్ని కాచి దానిని చర్మం మీద పొక్కులు , చర్మవ్యాదులు , వాపులు ఉన్న ప్రదేశంలో రాసినట్లైతే మంచి ప్రభావం కనిపిస్తుంది.
* పండు ఉసిరికాయల రసాన్ని తీసుకుంటూ ఉంటే ఉబ్బువ్యాధులు తగ్గుతాయి .
* ఉసిరికాయలోని గింజలను నీటితో కలిపి నూరి దానికి తగినంత చక్కర కలిపి తీసుకుంటూ ఉంటే కుసుమవ్యాధులు తగ్గుతాయి .
* ఉసిరిక లేహ్యాన్ని తీసుకుంటే భయంకరమైన దగ్గులు నివారించబడతాయి. క్షయ వ్యాధిలో వచ్చే దగ్గు కూడా నివారించబడుతుంది.
*Sadguru ADVICE TO 60-YEARS OLD & OLDER* Must read ...
*Because none of us have many years to live, and we can't take along anything when we go, so we don't have to be too thrifty.*
*Spend the money that should be spent, enjoy what should be enjoyed, donate what you are able to donate*
*DON'T WORRY about what will happen after we are gone, because when we return to dust, we will feel nothing about praises or criticisms. The time to enjoy the worldly life and your hard earned wealth will be over!*
*DON'T WORRY too much about your children, for children will have their own destiny and should find their own way. Care for them, love them, give them gifts but also enjoy your money or what is left of it, while you can. Life should have more to it than working from the cradle to the grave!!*
*60-year olds, don't trade in - your health for wealth, by working yourself to an early grave anymore. Because your money may not be able to buy your health.*
*When to stop making money, and how much is enough*
*Out of thousand hectares of good farm land, you can consume only three quarts (of rice) daily; out of a thousand mansions, you only need eight square meters of space to rest at night.*
*So, as long as you have enough food and enough money to spend, that is good enough. You should live happily. Every family has its own problems.*
*Just DO NOT COMPARE with others for fame and social status and see whose children are doing better etc., but challenge others for happiness, health, enjoyment, quality of life and longevity.*
*DON'T WORRY about things that you can't change because it doesn't help and it may spoil your health.*
*You have to create your own well-being and find your own place of happiness. As long as you are in good mood and good health, think about happy things, do happy things daily and have fun in doing, then you will pass your time happily every day.*
*One day passes WITHOUT happiness*, *you will lose one day.*
*One day passes WITH happiness and then you gain one day.*
*In good spirit, sickness will cure*;
*In a happy spirit, sickness will cure faster;*
*in high and happy spirits, sickness will never come.*
*With good mood, exercise, sun, variety of foods, good amount of vitamin and mineral intake, hopefully you will live another 20 or 30 years of healthy life*
*ABOVE ALL* -
Learn to cherish the goodness around... *like your spouse , she’s not called the better half for nothing and FRIENDS*........... *They all make you feel young and "wanted"... without them you are sure to feel lost !!*
Wishing you all the best for the years to come. 💐🙏🔔
Please share this with all your friends who are 60 plus and those who will be 60 plus after some time.
210222B0602. 220222-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఒంటి బ్రాహ్మణుడు*
➖➖➖✍️
*ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకునం కాదా ?*
*చాలా మంది ఆఖరికి బ్రాహ్మణులకి తో సహా ఈ అపోహ ఉంది.*
*అసలు తోటి బ్రాహ్మడు [అతను వేద పండితుడే కానక్కరలేదు, అసలు అతడు బ్రాహ్మణుడు అయితే చాలు చుట్టమైనా పక్కమైనా] ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళి పోతారు.*
*ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు.*
*నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్ధం.*
*పూర్వం గురుకులాల్లో ప్రతీ రోజూ గురువుగారు తనవద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని బిక్షాటనకు ఊరిలోకి పంపేవారు.*
*ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్లి గృహస్తుల నుంచి వాళ్ళు ఇచ్చిన బిక్ష సేకరించి తెచ్చేవారు.*
*ఆ కాలంలో ఎవరైనా గృహస్తు తన ఇంట్లో నుంచి బయటకి వెళ్లే సమయంలో, అలా భిక్షకి వస్తున్న ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి గానీ ఎదురయితే, వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానించి తగిన బిక్షవేసి పంపించే వారు.*
*అలా ఒంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురయి నప్పుడు అతన్ని చూసి, అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యంచేసి బిక్ష వెయ్యకుండా వెళ్లడం అతన్ని అవమానపరచి నట్టు ఉంటుందని, అలా ఆ విధంగా బిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి, లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించు కోకుండా వెళ్లడం దోషం.*
*అందుకే అలా [బిక్ష వేయకుండా] వెళ్ళకూడదు అంటారు.*
*అంతే తప్ప అది అపశకునం కాదు.*
*ఒక వేద పండితుడు, జ్ఞాని ఎదురవ్వడం వలన మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు.*
*ఒక్కో సారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వాళ్ళు ఏదో సమావేశానికో, వేద పారాయణానికో, చర్చలకో, లేక ఏ జప హోమాలకో వెళ్తూన్నారని అర్ధం.*
*ఈ రోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు [ ఒకవేళ ఉన్నా అక్కడడక్కడా ఉండచ్చు గాక ]. అలా రోజు వారి విద్యార్థుల చేత బిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు.*
*కాబట్టి ఏ కాలంలో అయినా సరే, ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంత మంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి*.
*అయితే ఇక్కడ ఒక్క విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి.*
*మనం బయటకి వెళ్తున్నప్పుడు ధర్మము అంటూ ఎవరయినా ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడే కానీయండి వీలయితే అతనికి మీకు చేతనైన సహాయము నిష్కామకర్మతో చేసి కదలండి.*
*అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.*
*మీరనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది.*
*సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన మెంత? మన కున్న జ్ఞానమెంత? ఒక్కసారి ఆలోచించండి!*
*అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
Once a TTE (Train Ticket Examiner) who was on duty on a Bangalore bound train from Mumbai caught a girl who was hiding under a seat. She was around 13 or 14 years old.
The TTE asked the girl to produce her ticket. The girl hesitantly replied that she had no ticket.
The TTE told the girl to get off the train immediately.
Suddenly, a voice from behind said "I will pay for her". That was the voice of Mrs. Usha Bhattacharya, who was a college lecturer by profession. Mrs. Bhattacharya payed for the girl's ticket and requested her to sit near her.she asked her what her name was.
"Chitra", the girl replied.
"Where you are going?"
"I have nowhere to go." the girl said..
"Then come with me." Mrs. Bhattacharya told her. After reaching Bangalore, Mrs. Bhattacharya handed over the girl to an NGO, to be taken care of. Later Mrs. Bhattacharya shifted to Delhi and the two lost contact with each other.
After around 20 years Mrs. Bhattacharya was invited to San Francisco (USA) to deliver a lecture in a college there.
She was in a restaurant, having a meal. After she finished she asked for the bill , but she was told that bill was already paid for. When she turned back, she saw a woman with her husband smiling at her. Mrs. Bhattacharya asked the couple, "why did you pay my bill? "
The young woman replied, "Ma'm, the bill I paid is extremely little, compared to the fare you paid for me for that train journey from Mumbai to Bangalore .
Tears rolled down from the eyes of both women.
"Oh Chitra... It's you..!!!" Mrs.Bhattacharya said happily astonished
While hugging each other, the young lady said, "Ma'm my name is not Chitra now. I am Sudha Murty. And this is my husband... Narayan Murty".
Don't be astonished. You are reading the true story of Mrs. Sudha Murty, the chairman of Infosys Ltd, and Mr. Narayan Murty, the man who established the multy million Infosys software company.
Yes, the little help you extend to others can change their whole lives!
"Please do not withhold doing good to those in distress esp when it is in your power to do it".WISH YOU A BEAUTIFUL HAPPY LIFE
Going a bit deeper into this story...
Akshata Murthy is the daughter of this couple and married to RISHI SUNAK *who's about to become the Prime Minister of UK*. 🌹👏👏
Old man has 8 hair on his head.
He went to Barber shop.
Barber in anger asked:
shall i cut or count ?
Old man smiled and said:
"Colour it!"
LIFE is to enjoy with whatever you have with you, keep smiling
If you feel STRESSED,
Give yourself A Break.
Enjoy Some..
Icecream
Choclates
Candy
Cake
Why?
B'Coz
STRESSED backwards spelling
is DESSERTS ...enjoy
Alphabetic advice for you:
*A B C*
Avoid Boring Company..
*D E F*
Don't Entertain Fools..
*G H I*
Go for High Ideas .
*J K L M*
Just Keep a friend like *ME..*
*N O P*
Never Overlook the Poor
*Q R S*
Quit Reacting to Silly tales..
*T U V*
Tune Urself for ur Victory..
*W X Y Z*
We Xpect You to Zoom ahead in life
Very ....beautiful lines pls store it.
ONE Good FRIEND is equal to ONE Good Medicine. . .
Likewise ONE Good Group is equal to ONE Full medical store...👌🙏👍
☺😊😉😄😴
*So Believe in YOURSELF*
We all are tourists on Planet Earth and we are lucky to have lived and met! So “Enjoy the "Trip" called LIFE...
You will never come back again .. .Live Today Meaningfully
*When you wake up tomorrow, remember to make full/best use of it*
బ్రాహ్మణ భోజన ప్రియః
బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ'బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:
" అలంకార ప్రియో విష్ణు
అభిషేక ప్రియః శివ
నమస్కార ప్రియః భాను
బ్రాహ్మణ భోజన ప్రియః"
సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే
ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ కొశ్చెను, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"
కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని 'బ్రేవ్' మని త్రేలుస్తారని కాదు.
1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు.
2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు.
3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.
4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు.
5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.
6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.
బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు .
౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'
౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'
౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'
౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'
౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'
౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి
౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'
౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'
౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'
౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'
౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.
౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద
౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'
౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'
౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'
౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.
ఇదంతా ఎలా సాధ్యమైంది?
కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,
1. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'
2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారం.
3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'
4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'
5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'
6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'
7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'
8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'
9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'
10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'
11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'
12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'
13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'
14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'
15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'
16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'
17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'
18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!
జయ మహాకాల, జయ పరశురామ, జయగురుదత్త.
దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి.
*ఎక్కడుందో రహస్యం.*.
చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
Dress కుట్టిస్తే..
ఎంత ఆనందమో...
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...
ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...
కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....🏃🏻♂️
సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..
20/-రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..
ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...
కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..
రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్,
చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
ఎందుకు...? ఎందుకు...?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..
మార్పు ఎందులో...?
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో ...?
....
శ్లోకం:☝️
*అసారభూతే సంసారే*
*సారభూతా నితంబినీ ll*
*ఇతి సంచిత్య వై శంభుః*
*అర్ధాంగే కామినీం దధౌ ll*
భావం: అసారమైన ఈ లోకమందు సారభూతమైనది తరుణియే. ఇది తెలిసే శివుడు తన అర్ధ శరీరమున స్త్రీని ధరించినాడు కాబోలు!🙏
_*రేపు ఆండాళ్ తల్లి ( గోదాదేవి ) తిరునక్షత్రం*_
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
రేపటి రోజు ఆండాళ్ తల్లి పుట్టిన రోజు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించినది. కలియుగం ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ఆరంభం అయ్యిన తరువాత ఆండాళ్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించినది. విష్ణుచిత్తులు చాలా భక్తి కల మహనీయుడు , అందుకే లోకం పెరియ ఆళ్వార్ అని కీర్తించేది. భగవత్ ప్రేమవిషయంలో పెద్దరికం కల వాడు. ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలినవాడు అని అర్థం. భగవత్ ప్రేమ అనేది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే , అందులో మునిగి , అడుగుదాకా వెల్లి తిరిగి బయటికి వచ్చి , ఇంత ఉంది సుమా ! అని బయటి లోకానికి తెలియజేసిన వాల్లను ఆళ్వారులు అని అంటాం. ఈ ఆళ్వారులు ద్వాపరంలో ఒక నలుగురు , కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందినవారు ఒక ఆరుగురు. నమ్మాళ్వార్ తో పాటు ఆయన శిష్యుడైన మధుర కవి , ఇక విష్ణుచిత్తులవారి కుమార్తెగా ఆండాళ్ తో కలిసి మొత్తం పన్నెండు మంది ఆళ్వారులు. భగవంతుడు అంటే ఏమిటి , ఆయనను ఎట్లా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీల్లంతా.
*కర్కటే పూర్వఫల్గున్యాం తులసికాననోద్భవామ్ |*
*పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమ్||*
*నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం*
*పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ*
*స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా* *బలాత్కృత్య భూంక్తే*
*గోదా తస్యై నమ ఇద* *మిదం భూయ ఏవాస్తు భూయః*
విష్ణుచిత్తులవారు పాండ్య దేశపు సభకు వెల్లి , భగవంతుని అనుగ్రహంచే , తత్వం అంటే ఇట్లా ఉంటుంది అని నిర్ణయంచేసిన మహనీయుడు. ఆ పాండ్య రాజు ఆయనని ఏనుగు అంబారి పై ఉరేగించి బట్టర్పిరాన్ అని బిరుదిచ్చారు. అప్పుడు ఆ రాజుద్వారా ఆందిన సంపదతో శ్రీవెల్లిపుత్తుర్ ఆలయ గోపురం , ప్రాకారాదులకు కైకర్యంగా వినియోగించారు. తులసివనం పెంచి , తులసి మాలలను కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతి దినం. ఒకనాడు ఆయనకు ఒక పాప ఆ తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడంచే ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. శ్రీకృష్ణుడు యశోదమ్మకి కనకుండానే లభించాడో , ఈయన తను యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. తులసి మాలని తమిళంలో కోదై అంటారు , ఆమెకు కోదా అని పేరు పెట్టుకున్నాడు. సంస్కృతంలో అది క్రమేపి గోదాగా మారింది. భగవంతుని కథలు ఆ గోదాదేవికి చెప్పుతూ పెంచారు ఆమె తండ్రి , అలా శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తనను యశోదగా భావిస్తు విష్ణుచిత్తులవారు ఎన్నో పాటలు పాడేవారు. శ్రీకృష్ణుడి జ్ఞానం కల్గిఉండటంచే ఆయనను ఎలాపొందాలని కోరిక కల్గితే , వాల్ల తండ్రి వివిద దివ్యదేశాల గురించి తెలిపాడు. శ్రీరంగనాథున్ని ప్రేమించింది గోదాదేవి. ఒకప్పుడు విభవంలో మన వద్దకు శ్రీకృష్ణుడిగా వచ్చినప్పడిలా ఇప్పుడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకొని అట్లాంటి అనుభూతిని పొందింది గోదా. తన చుట్టు ఉన్న ఊరినే నందగోకులంలా , తన చుట్టూ వారినే గోపికలవలె , ఆ వూరి వటపత్రశాయి మందిరాన్నే నందగోప భవనంగా భావించింది. ఆనాడు గోపికలు చేసిన వ్రతాన్ని తాను చేసింది. అలా భావిస్తూ రోజుకో పాటని పాడేది. మరి మాములు పాటలు కావు , సర్వ వేద సారం అని పిలవబడే తిరుప్పావై అనే ముప్పై పాటల్ని పాడింది గోదా. ఇంకా భగవంతుని దర్శనం కల్గలేదు, అప్పుడు తన వేదనని తెలియజేస్తూ నాచియార్ తిరుమొఱ్ఱి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది. అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చలించి , తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూర్ నుండి పిలిపించుకుని , శ్రీరంగ క్షేత్రంలో రంగవిళాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహమాడాడు. అమె స్వామి సన్నిదానంలో చేరిపోయింది. తండ్రిగారు అయ్యో నా గోదా ఏది అని విలపిస్తుంటే , భగవత్ తత్వం తెలిసినవాడైనందుకు రంగనాథుడు ఆ విగ్రహరూపంలోనే ఆయనతో విలపించవలదు మీరు మీ వూరికి వెల్లండి , నేను గోదా దేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు.
విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూర్ చేరగానే స్వామి రంగమన్నార్ , అంటే రంగరాజుగా గరుడవాహనంపై గోదాదేవితో కల్సి వేంచేసాడు. శ్రీవిల్లిపుత్తూరులో అసలు దేవాలయం వటపత్రశాయిదే , కాని గోదాదేవి రంగనాథుడిని పొందాక , గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ది చెందినది. పెద్దగోపురం కనిపించేది వటపత్రశాయి ఆలయంకు చెందినది. ప్రక్కన గోదాదేవి నివసించే ఇల్లు ఆమె మందిరంగా ఉంది ఈనాటికి కూడా . ఆగోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి భూమినంతా తరింపజేసింది. తల్లి తన పిల్లల్ని స్తన్యముల ద్వారా పోశిస్తుందో , అలా గోదాదేవి తిరుప్పావై , నాచియార్ తిరుమొఱ్ఱి అనే రెండు దివ్యప్రబంధాలను లోకానికి ఇచ్చి ఈ జీవరాశినంతా పోశిస్తుంది.
"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా"
🌹🌹🌻🌹🌹
"చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా" అన్నది ఒక నానుడి. అర్ధం ఏమిటి అంటే మనం ఎంత చేసుకుంటే ఆంతే మనకి. ఇది ఒక కర్మ సిద్దాంతం. మనం గతంలో చేసుకున్నది ఇప్పుడు, ఇప్పుడు చేసుకునేది ముందు ముందు అని అర్థం. అంటే మన గతం ఇప్పటి వర్తమానం. ఇప్పటి వర్తమానం రాబోయే భవిష్యత్తు.
మరి
అదృష్టం అంటే ఏమిటి?
దురదృష్టం అంటే?
దైవం పాత్ర ఎంత?
జ్యోతిష్యం, గ్రహచారం ఇవ్వన్నీ ఏమిటి మరి? గ్రహ శాంతులు ఏమిటీ?
దైవ పూజలేనిటీ?
హోమాలు ఏమిటి?
1) చేసుకున్నవారికి చేసుకున్నంత మహానుభావా అన్నది
ఇది ఒక సూత్రమును తెలియచేస్తుంది. అది కార్య కారణ సంబంధము. దీనినే ఆంగ్లంలో
" law of cause and effect " అంటారు లేదా "as you sow so you reap" నాటుకో~~కోసుకో అంటారు. వీటి అర్థాలు ఏమిటి అంటే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. నీవు ఏ విత్తు నాటుతావో అదే ఫలాలను పొందుతావు.
2) అదృష్టం/దురదృష్టము
మరి అదృష్టం ఏమిటీ? అంటే మనకి అనుకోకుండా అంతా శుభమే జరుగుతుంటే అదృష్టం పట్టింది అంటాము. అలాగె ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాదించకపోతే అది దూరదృష్టము అంటాము. దురదృష్టము అనగా మనకి కనబడని ఎదో అది అని అనుకుంటాము. అలాగే అదృష్టం అంటే ఎదో కనబడని శక్తి మనకు కావలసినది ఇస్తోందని అనుకోని దీనిని అదృష్టం అంటారు.
అయితే కార్య కారణ సంబంధము అర్థం అయ్యినప్పుడు ప్రస్తుత కార్యానికి ఏదో తెలియని కారణం ఉందని గ్రహిస్తే అప్పుడు అదృష్టం ఇంకా దురదృష్టం మాయం అవుతాయి. కారణంను మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అంతరంగ అన్వేషణలో తెలుస్తుంది. మనకి తెలియకపోవడం వల్ల కారణం లేదు అనుకోవడం పొరపాటు.
3) దైవం
మనకి రావాల్సిన వాటిని ఆపడం కానీ, తొందరగా ఇవ్వడం గాని దైవం చెయ్యాడు. ఆయనకి ఇదేనా పని. ఆయన సృష్టిలో మనం ఎంత. "కోన్ కిస్కా గొట్టం గాళ్లం" . అందుకని దైవం అన్ని చేస్తున్నాడు అనుకోవడం అజ్ఞానం. మరి మన జీవితంలో దైవము వద్దా? అంటే. కావాలి. మన అహంకారాన్ని అణచాలి అంటే దైవం కావాలి ఆయనని శరణు పొందాలి. కానీ ఒక్క విషయం మాత్రం సత్యం భగవంతుడికి మన పాపంతో కానీ పుణ్యం తో కానీ ప్రమేయం లేదు. ఇది భగవద్గీతలో 5 వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది.
🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
శ్లోకం:☝️
*నాస్ధా ధర్మే న వసునిచయే*
*నైవ కామోపభోగే*
*యద్యద్ భవ్యం భవతు భగవన్*
*పూర్వకర్మానురూపం l*
*ఏతత్ ప్రార్ధ్యం మమ బహుమతం*
*జన్మజన్మాంతరేపి*
*త్వత్పాదాంబోరుహయుగగతా*
*నిశ్చలా భక్తిరస్తు ll*
- ముకుందమాల
భావం: ఓ కృష్ణా! ధర్మమును ఆర్జించ వలెనని గాని, అర్థమును కూడబెట్టవలెనని గాని, కామములను అనుభవించ వలెనని గాని నాకు కోరిక లేదు. నా పూర్వకర్మములను అనుసరించి ఏది ఎలా జరగ వలెనో అలాగే జరుగునుగాక. ఈ జన్మయందు గాని, జన్మాంతరమందు గాని, నీ పాదారవిందములయందు గాని, నాకు నిశ్చలమగు భక్తి కలుగవలెననునది ఒక్కటియే అభిమతమగు కోరిక. (జన్మరాహిత్యము లేదా మోక్షము కంటే కూడా, కృష్ణ భక్తినే ముఖ్యముగా ప్రార్థించు చున్నారు కులశేఖరులు. నాలుగు పురుషార్థముల కంటే కూడా భగవంతుని యందు ప్రేమయే పరమ పురుషార్థమ ని వారి ఆశయము)
*లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే*
రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.
విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.
తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
*✨సాహో... ప్రొఫెసర్*
*శాంతమ్మ గారు 🙏🎊*
🕉️🌞🌎🏵️🌼🚩
*కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’.. అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ.*
*పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..*
*‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను.*
*అప్పుడే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.*
*ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.*
*పాఠాలు భోదిస్తూ...*
*వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.*
*నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది.*
*వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు.*
*పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు.*
*మాది🚩 ఆరెస్సెస్ 🚩నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’.*
– బోణం గణేష్, సాక్షి,
🕉️🌞🌎🏵️🌼🚩
జగన్మాత – జగత్పిత
➖➖➖✍️
“వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”
మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. ఇదేవిధంగా భగవత్ పాదులవారున్నూ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్. అని ఒకచోట సెలవిచ్చారు.
ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి ఉన్నట్టున్నది. ఈ విషయాన్నే నామరూపాలని పేర్కొంటారు. వీనిలో ఒక దానినుండి మరొక దానిని వేరుచేయలేము. ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము. ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో, అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ, వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు. ఇదే అర్థ నారీశ్వర తత్త్వం. ఇటు చూస్తే అంబికా అటు చూస్తే అయ్యా లేక పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాషాభ్యాసం చేసే వారందరూ ఈ శ్లోకం చదివి మరీ నమస్కరిస్తారు.
మనకు రూపు ఇచ్చేవారు మన తల్లిదండ్రులు. దేహానికి కారణభూతులు తండ్రి. పుష్టి గలిగించే ఆహారమిచ్చి పోషించేది తల్లి. దేహానికి పుష్టి గలిగించే వస్తువు ఆహారము. కొరత లేకుండా ఆత్మకు పుష్టి ఇచ్చేవారు ఎవరు? ఆత్మ అనగా ప్రాణం, ప్రాణానికి పుష్టి ఏది? ఆనందం, జ్ఞానం.
దేహము ఏనాడు ధరించామో ఆనాటి నుండీ ప్రాణానికి కష్టాలే. అనగా ఈ కష్టాలన్నింటికీ కారణం జన్మ లేక దేహధారణ. ఇంకో జన్మ ఎత్తితే మరిన్ని కష్టాలు. కన్న తండ్రి ఏదో సంపాదించి ఇంత నిలువ చేసి పోయినాడని దేహానికి శ్రమ లేదనుకొన్నా ఆత్మకు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలూ, దుఃఖాలు!
దేహానికి గాని ఆత్మకుగాని ఏ విధమైన కష్టమూ ఉండగూడదని అనుకుంటే జన్మలేకుండాపోవాలి, జన్మ ఎత్తామో ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ.
దుఃఖ స్పర్శలేకుండా ఆరుగాలంలోనూ ఆనందంగా వుండేటట్టు చేసేది ఆత్మ. అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ, ఆత్మ జగన్మాత, ఆయన జగత్పిత. వారికి శరణుపొందితేనే గాని జన్మ లేకుండా పోదు. జన్మ లేకుండా పోవడమంటే అవధి లేని ఆనందమే. జన్మ కలిగిందంటే ఆనందానికి ఒక కొరత అని అర్థం. ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే. కొందరూ ఈశ్వరోపాసనా, కొందరు దేవ్యుపాసనా, మరికొందరు యిరువుర కూడిక ఐన శివశక్త్యుపాసనా చేస్తారు.
అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు. డబ్బులేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు. ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది. మనకు అది లేదూ, ఇది లేదూ అనేకొరతా, ఫలానావాడు అవమానించాడు అనిన్నీ లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది. ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.
మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత. దీనికి కారణం ఏమిటీ? జన్మ. డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే ''జన్మ ఇక మనకు వద్దు'' అని అనుకొన్నవాడు జన్మలేనివాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహమాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది. జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.
మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావునకు కారణం కాలుడు. కామకారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది. కామ వీక్షణంతో మోడు కూడా చిగిరిస్తుంది. కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది. ''కాలో జగద్భక్షకః''. కాలంవచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపులేకుండా పోతున్నారు.
కామం లేకపోతే పుట్టుక లేదు. కాలం లేకపోతే చావు లేదు. ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి. అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది ఎటువంటి వాడు?
''కాముని కంటితో నీఱుచేశాడట
కాలుని కాలితో తన్ని వేశా డట''
మన్మథుణ్ణి చూచి నంతమాత్రాన దగ్ధంచేసినవాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావుపుట్టుకలులేవు. ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు.
పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ? పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కాముని నిగ్రహించింది నొసలి కంటితో. అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సగబాలూ ఆమెకుసగబాలూ, కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామనిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహంకూడా ఉండాలి. జన్మవద్దనుకుంటే మనం ఈ పురాణదంపతుల నిద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి. ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది. వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.
సంగీతంద్వారా భగవదుపాసనచేసినవారిలో ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి అనే మువ్వురు గాయక శ్రేష్ఠులు ఉన్నారు. దీక్షితుల వారు నవావరణ కీర్తనలను వీణమీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు. శ్రీచక్రార్చన చేసేవారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. దీక్షితులవారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు. ఆనాడు కార్తిక అమావాస్య ''శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి'' అనే చరణం పాడుతున్నారు. పాట చివర ''పాశమోచనీ'' అని ఉంటుంది. 'ముదం దేహి పాశమోచని' అని పాడుతూండగా వారిశ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు. ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు. మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితినిపొందారు.
చావుపుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే. జనన నివృత్తిని వెతకికొంటూ ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ ''జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'' అని మనము వారికి శరణాగతి చెయ్యాలి.
--- “జగద్గురు బోధలు” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀