ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
7, జనవరి 2024, ఆదివారం
రాశిఫలాలు
☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
*07-01-2024 / ఆదివారం / రాశిఫలాలు*
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
మేషం
ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.
---------------------------------------
వృషభం
వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
మిధునం
వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.
---------------------------------------
కర్కాటకం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
---------------------------------------
సింహం
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
కన్య
సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
---------------------------------------
తుల
సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
---------------------------------------
వృశ్చికం
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
--------------------------------------
ధనస్సు
వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
---------------------------------------
మకరం
గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూల మౌతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.
---------------------------------------
కుంభం
సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
మీనం
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━
🍁 *శుభం భూయాత్* 🍀
శ్రీమద్భగవద్గీత
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 21-22*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*అర్జున ఉవాచ ।*
*సెనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।।*
*యావదేతాన్ నిరీక్షేఽహం*
*యోద్దుకామానవస్థితాన్ ।*
*కైర్మయా సహ యోద్ధవ్యమ్*
*అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।*
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను;
సేనయోః — సైన్యములు;
ఉభయోః — రెండు;
మధ్యే — మధ్యలో;
రథం — రథము;
స్థాపయ — నిలిపిఉంచు;
మే — నా యొక్క;
అచ్యుత — శ్రీ కృష్ణా (ఎట్లాంటి దోషములు లేనివాడా);
యావత్ — ఎంతవరకు అయితే;
ఏతాన్ — ఈ యొక్క;
నిరీక్షే — చూసి;
అహం — నేను;
యోద్దు-కామాన్ — యుద్ధం కొరకు;
అవస్థితాన్ — నిలిపిఉన్న;
కైః — ఎవరితో;
మయా — నాతో;
సహ — కూడి;
యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి;
అస్మిన్ — ఈ యొక్క;
రణ సముద్యమే — మహా పోరాటంలో.
*భావము:*
అర్జునుడు ఇలా అన్నాడు. అచ్యుతా (శ్రీ కృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి.
వివరణ: సమస్త సృష్టి కి పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడి, భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ ఈ శ్లోకం లో అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని కావలసిన చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. భగవంతుడు తన భక్తుల ప్రేమకు ఋణపడి, వారికి దాసుడు అయిపోతాడు.
అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ
సాధుభిర్గ్రస్త-హృదయో భక్తైర్భక్త-జన-ప్రియః (భాగవతం 9.4.63)
"నేను సర్వ స్వతంత్రుడను అయినా, నా భక్తులకు బానిస అయిపోతాను. వారు నాకు అత్యంత ప్రియ మైన వారు మరియు నేను వారి ప్రేమకు ఋణ పడివుంటాను." అర్జునుడు సుఖంగా రథంలో కూర్చుని తనకి ఆదేశాలు ఇస్తుంటే, అతని భక్తికి వశుడైపోయిన శ్రీ కృష్ణ పరమాత్మ రథాన్ని నడిపే సారధి స్థానాన్ని తీస్కున్నాడు.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
నవగ్రహా పురాణం
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *129వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*సూర్యగ్రహ మహిమ - 2*
సూర్యుడి కిరణాలకు ఏదీ అడ్డుతగలని చోట , ఉదయం నుండీ సాయం సమయం దాకా ఎండ పడేచోట - యాజ్ఞవల్యుడు తపస్సు ప్రారంభించాడు.
సూర్యుడు ఉదయిస్తున్నాడు , అస్తమిస్తున్నాడు. అయితే ఆ రెండు దైనిక క్రియల్నీ గమనించే స్థితిలో లేడు , యాజ్ఞవల్క్యుడు. అతనిలోని పట్టుదల భక్తి శ్రద్ధలకూ , ఏకాగ్రతకు పదనుపెట్టుతోంది. అచిరకాలంలోనే అతడు శారీరక స్పృహను కోల్పోయాడు. ఆకలిదప్పులూ , శీతోష్టాలూ , వెలుగు చీకట్లూ అనే ద్వంద్వాలకు అతి దూరంగా , ధ్యాన క్షేత్రంలో సాగిపోయాడు యాజ్ఞవల్క్యుడు.
కాలం గడిచిపోతోంది. అతను కలలుగన్న కమనీయ ఘడియ కదలి వచ్చింది.
తపస్సులో గాఢంగా మునిగిపోయిన యాజ్ఞవల్క్యుడి అర్ధనిమీలిత నేత్రాల మీద. ఏదో కొత్త వెలుగు పడింది. అతని కనురెప్పలు స్పందిస్తూ మెల్లగా తెరుచుకున్నాయి. ఎదురుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే వెల్తురు ! యాజ్ఞవల్క్యుడి రెప్పలు టపటపలాడి , కళ్ళ మీద వాలిపోయాయి !
*"యాజ్ఞవల్క్య !"* మేఘ గర్జనలాంటి కంఠధ్వని తనను పిలుస్తోంది ! యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. ఈసారి అతడి కళ్ళు నిబ్బరంగా చూడగలుగు తున్నాయి.
ఎదురుగా కేంద్రీకరించిన కాంతిపుంజంలోంచి ఏడు గుర్రాలు రథాన్ని లాగుతూ వెలికి వచ్చాయి ! రథానికి ఒకే చక్రం ఉంది. గుర్రాల వెనక సారథి అరుణుడు !
రథంలో వేయి కిరణాల వేలుపు ! కెందామరలాంటి మనోహరమైన శరీరవర్ణం ! శరీరవర్ణంతో చెలిమి చేస్తూ , దానిని అందంగా ఆచ్ఛాదించిన ఎర్రటి వస్త్రం ! చేతిలో తెల్లని తామర ! చుట్టూ ఆవరించిన సువర్ణకాంతులను చెదరగొడుతూ , చేతిలోని శ్వేత పద్మ వర్ణాన్ని వెక్కిరిస్తున్న చిరునవ్వు !
*"ఓం సూర్యాయనమః ! ఓం సూర్యాయనమః..."* జోడించిన చేతుల్ని , శిరస్సును పైకి యెత్తి , నమస్కరిస్తూ ఆదిత్య మంత్రాన్ని పఠించాడు యాజ్ఞవల్క్యుడు.
*"యాజ్ఞవల్మా ! నీ ధ్యాన కిరణం నా సహస్ర కిరణాలనూ ఆకర్షించి , నన్నిక్కడికి తెచ్చింది ! ఏం కావాలి నీకు ?"* సూర్యభగవానుడి కంఠం ఆకాశంలో సుళ్ళు తిరుగుతూ మారుమ్రోగింది.
*"భగవాన్ ! నీ దయ లోపించిన కారణంగా , నీ వక్రవీక్షణ కారణంగా నేను గురుదేవుల తిరస్కారానికి గురయ్యాను. కోరిన విద్యలను పొందలేకపోయాను. మహత్తరమైన యజుస్సులను ప్రసాదించు. నన్ను కరుణతో చూడు !"* యాజ్ఞవల్యుడు రెండు చేతులూ చాచి , దోసిలిపట్టి అభ్యర్థించాడు.
సూర్యుడు చిన్నగా నవ్వాడు. *"నువ్వు చివర కోరిన కోరికను మొదట అనుగ్రహిస్తాను. నిన్ను కరుణతో చూస్తాను. నీ మీద ఉన్న నా వక్రదృష్టిని ఉపసంహరించి , శుభదృష్టితో వీక్షిస్తాను !"*
*"స్వామీ ! అంత అదృష్టమా నాది !”* యాజ్ఞవల్క్యుడు వణికే కంఠంతో అన్నాడు.
*"నా శుభదృష్టి నీ మీద వాలగానే వాగ్దేవి అయిన సరస్వతి నిన్ను ఆవహిస్తుంది ! ఆ గీర్వాణికి స్వాగతం పలుకుతూ , నీ శరీరానికి మహద్వారమూ , 'తలవాకిలీ' అయిన నోటిని తెరిచి ఉంచు !"* సూర్యుడి పలుకును ప్రకృతి ఆనందంగా ప్రతిధ్వనించింది.
యాజ్ఞవల్క్యుడు ఆదిత్య భగవానుని ఆజ్ఞను శిరసావహిస్తూ , ఆయననే చూస్తూ నోరు తెరిచాడు , సరస్వతిని స్మరిస్తూ.
క్షణంలో మహాశ్వేత అయిన సరస్వతి సాక్షాత్కరించింది. చిరునవ్వులు చిందిస్తూ సూక్ష్మ రూపంలోకి మారి , యాజ్ఞవల్క్యుడి వదనద్వారం గుండా అతని శరీరంలోకి ప్రవేశించింది.
యాజ్ఞవల్క్యుడి శరీరం ఒక్కసారి జలదరించింది. ఏదో తెలియని అలౌకికమైన , ఆందోళనకరమైన 'మహాతాపం' అతని శరీరాన్ని దావానలంలా దహించివేస్తోంది. భరించలేని మంట అతని శరీరాన్ని ఆవరించి , పొగలు చిమ్ముతున్నట్టనిపించింది.
ఆ మహాతాపాన్ని భరించలేకపోతున్న యాజ్ఞవల్క్యుడు అసంకల్పితంగా పరుగెట్టాడు. సరోవర జలంలోకి దూకబోయాడు. సూర్యుడి గంభీర కంఠస్వరం అతన్ని ఆపింది.
*"యజ్ఞా ! ఆగు ! వాగ్రూపిణి మహత్తర శక్తి నీలో ప్రవేశించింది. అదే ఆ తాపానికి కారణం. ఆ తల్లిని ధ్యానించు. ఆ మహాతాపం స్వల్పకాలికమే సుమా !”*
యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వైపు తిరిగి , వినయంగా నమస్కరించాడు. *"ఆజ్ఞ !” సూర్య వచనం నిజమైంది , క్షణంలో ! యాజ్ఞవల్క్యుడి తనువును దహించిన భుగభుగలు మాయమైపోయాయి. ఏదో తెలియని దివ్యకాంతి మంచుతో తడిసి పిల్లగాలిలా అతని శరీరాన్ని రెండవ చర్మంలా ఆవరించింది.*
*"నిష్ఠతో , తపస్సుతో , భక్తితో , విశ్వాసంతో నన్ను మెప్పించావు. నా వక్రదృష్టిని , ప్రసన్న దృష్టిగా మార్చుకున్నావు. వేదవిజ్ఞానం నీకు లభిస్తుంది. నువ్వు కోరిన యజుస్సుల ఉనికిపట్టు అదే ! అంతే కాకుండా నీకు సాంఖ్య యోగాలు సిద్ధిస్తాయి. ఇదిగో , నా చేతిలోని కమలం వికసించినట్టు - నీ మేథస్సు వికసిస్తుంది. శతపథ బ్రాహ్మణం నీకు సిద్ధిస్తుంది. సరస్వతీ మాత నీ వెంట ఉంది ; నీ ఇంట ఉంటుంది. వెళ్ళు ! ఇష్టప్రాప్తి కలుగుతుంది !"*
దీవిస్తున్న సూర్యభగవానుడికి , కృతజ్ఞతా భారంతో చలించిపోతూ , నమస్కరించాడు యాజ్ఞవల్క్యుడు. *"ధన్యోస్మి దేవా , ధన్యోస్మి !”*
చిరునవ్వుతో దీవిస్తున్న సూర్యుడూ , ఆయన రథమూ నెమ్మదిగా గగన నేపథ్యంలో కలిసిపోయాయి. గుండ్రటి సూర్యబింబం - ఆస్థానంలో - యాజ్ఞవల్క్యుడికి కనిపిస్తోంది.
*************************
వాతావరణం ప్రశాంతంగా ఉంది. ప్రాతఃకాలీన అనుష్టాలు తీర్చుకున్న యాజ్ఞవల్క్యుడు , సూర్యభగవానుడి అనుశాసనాన్ని గుర్తుచేసుకుంటూ , సరస్వతీ ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.4
కాస్సేపట్లో శ్రావ్యమైన వీణానాదం వినవచ్చిందతనికి. శబ్ద బ్రహ్మను తలపించే మనోజ్ఞ నాదమది ! తన చుట్టూ ప్రతిధ్వనిస్తున్న దివ్యరాగాన్ని ఆలకిస్తూ యాజ్ఞవల్క్యుడు కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తున్న సరస్వతీ మాత !
శ్వేత వస్త్రాలతో ఉన్న ఆ మహాశ్వేతను అక్షరాలు అచ్చులూ , హల్లులూ అందమైన తమ ఆకారాలతో ఆభరణాలుగా అలంకరించి ఉన్నాయి , ఓంకారం అగ్రభాగాన ఉంది !
అక్షరాభరణ సౌందర్యంతో వెలిగిపోతున్న 'అక్షరస్వరూపిణి'ని యాజ్ఞవల్క్యుడు పులకించిపోతూ దర్శించాడు. చేతులు జోడించి ఆ విద్యాధినేత్రికి నమస్కరించాడు.
*"అమ్మా ! వేదవిజ్ఞాన భిక్ష అనుగ్రహించు !"*
*"పుత్రా ! సూర్యగ్రహ వీక్షణ అనుకూలంగా లేని కారణంగా నీకు ఆశించిన విద్య అందే యోగం లేకపోయింది. ఇప్పుడు ఆ గ్రహరాజును ప్రసన్నుడిగా చేసుకున్నావు. కోరిన విద్యను నీకు అనుగ్రహించాలన్న స్ఫూర్తి నాకు కలిగింది !”*
*“ధన్యుణ్ణి , తల్లీ !"* యాజ్ఞవల్క్యుడు నమస్కరించాడు.
అక్షరరూపిణికి అర్ఘ్యం సమర్పించాడు. పుష్పాలతో పూజించాడు. అర్చన ముగించిన భక్తుడు తీర్థప్రసాదాల కోసం వేచి చూస్తున్నట్టు , కూర్చున్నాడు.
*"యాజ్ఞవల్క్యా ! కళ్ళు మూసుకో ! ఏకాగ్రచిత్తంతో , ధ్యాన నిష్ఠలో నిమగ్నుడివి కా ! ధ్యాన సమయంలో , నా అనుగ్రహంతో కోరిన విద్యలన్నీ నీకు స్ఫురిస్తాయి. ధ్యానగోచర మవుతాయి. ఇష్టవిద్యాప్రాప్తిరస్తు !"* సరస్వతి దీవిస్తూ అంది. ఆమె చల్లని చూపులు జ్ఞాన కిరణాల్లా యాజ్ఞవల్క్యుడి కళ్ళల్లోకి దూసుకెళ్ళాయి. ధ్యాన భారంతో అతని కళ్ళు సగం మూసుకున్నాయి.
జ్ఞాన పరిమళం తన సర్వస్వాన్నీ ఆవరిస్తున్న అనుభూతి కలుగుతోంది యాజ్ఞవల్క్యుడికి !
పదిహేను శాఖల యజుర్వేదం స్ఫురిస్తూ , యాజ్ఞవల్క్యుడి మేధోమంజూషికలో నిక్షిప్తమయింది. సాంఖ్యమూ , యోగమూ అతనిలోని జ్ఞానపుష్పాన్ని సంపూర్ణంగా వికసింపజేశాయి. శతపథ బ్రాహ్మణం పూర్తిగా అతని అంతరంగంలో ఆవిష్కరించబడింది.
మహత్తరమైన , అమూల్యమైన జ్ఞాన సంపదను ఆర్జించిన మహదానందంతో , పరమతృప్తితో కళ్ళు తెరిచాడు యాజ్ఞవల్క్యుడు. అక్షరాభరణాలతో అలౌకికమైన దర్శనాన్ని అనుగ్రహించిన సరస్వతీ మాత , తల్లి ఇచ్చిన క్షీరాన్ని తాగిన పసిబాలుడిలా కనిపిస్తున్న యాజ్ఞవల్క్యుడి వైపు చిరునవ్వుతో చూస్తూనే ఉంది. ఆమె దక్షిణ హస్తం అతన్ని దీవిస్తోంది. చేతులు జోడించి నమస్కరిస్తూ , ఆనందబాష్పాలు రాలుస్తున్న యాజ్ఞవల్క్యుడి ముందు నుంచి అదృశ్యమైంది సరస్వతి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
దేశభక్తి
*"మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు" - రతన్ టాటా*
*26/11 ముంబై దాడులు జరిగిన*
*కొన్నినెలల తరువాత భారత్ మరియు విదేశాల్లో ఉన్న తమ హోటళ్ళన్నీ రీమోడలింగ్ చేయడం కోసం అతి పెద్దవైన టెండర్లను టాటా కంపెనీ ఆహ్వానించింది.* *కొన్ని పాకిస్తానీ కంపెనీలు కూడా టెండర్లు వేసాయి. ఆ కాంట్రాక్టు తాము దక్కించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు ఎలాంటి అపాయింట్ మెంటూ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు బొంబాయిలో ఉన్న బొంబాయి హౌస్ (టాటా హెడ్ ఆఫీస్) కు వచ్చారు.*
*అక్కడి ఆఫీసులో, వారిద్దరూ రతన్ టాటాను కలవడం కోసం చాలా సేపు నిరీక్షించారు. అలా వారు కొన్నిగంటల పాటు నిరీక్షించిన తరువాత సిబ్బంది వచ్చి, సార్ చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్ మెంట్ లేనివారినెవరినీ కలవలేరు అని చెప్పి వెళ్ళిపోయారు.*
*దాంతో నిరాశ చెందిన వారిద్దరూ హస్తినకు వెళ్ళి, పాకిస్తాన్ హైకమీషన్ ద్వారా అప్పటి కాంగ్రెస్ మంత్రి ఆనంద్ శర్మను కలిసి విషయం వివరించారు.*
*ఆ వెంటనే ఆనంద్ శర్మ రతన్ టాటాకు ఫోన్ చేసి ఆ పాకిస్తానీలిద్దరినీ కలవాలని, వారి టెండర్లను పరిశీలించాలని ఒకింత గట్టిగా అడిగారు.*
*అప్పుడు రతన్ టాటా "మీరు సిగ్గు లేని వారు కావచ్చు, నేను కాదు" అని చెప్పి ఫోన్ పెట్టేసారు.*
*ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోలను దిగుమతి చేసుకోవడం కోసం ఆర్డరు ఇచ్చింది.*
*అయితే రతన్ టాటా ఒక్క సుమోను కూడా పాకిస్తాన్ కు పంపడానికి అంగీకరించలేక, ఆ ఆర్డరును తిరస్కరించారు.*
*అదీ రతన్ టాటా యొక్క దేశభక్తి.*
*ఆయన దేశభక్తి ముందు డబ్బూ మరియు వ్యాపారం కూడా చిన్నదే*
6, జనవరి 2024, శనివారం
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
(21-17)
ఎక్కడో ఒకచోట సంపాదించి కౌశికుడి ఋణం తీరుస్తాను. ప్రాణాలు పోయినా యాచనకుమాత్రం దిగను
నాథా ! కాలమనేది శక్తి స్వరూపం. సమస్థితినీ విషమస్థితినీ కలిగిస్తూంటుంది. అవమానాలు
సమ్మానాలూ చేయిస్తూంటుంది. పురుషుణ్ణి మహాదాతను చేసిన కాలమే యాచకుణ్ణి చేస్తూంటుంది. మన
జీవితమే చూడరాదూ, క్షణంలో ఎంత తలకిందులయ్యిందో ! ఒక విప్రుడి క్రోధం కారణంగా రాజ్యం
పోయింది. సుఖాలూ పోయాయి.
దేవీ ! కత్తి పుచ్చుకుని నా నాలుకను నిలువనా చీరనాసరే, అభిమానం చంపుకుని దేహి దేహి
అనిమాత్రం అననుగాక అనను. నేను క్షత్రియుణ్ణి. ఎవరినీ ఏదీ యాచించును. భుజబలంతో సంపాదించి
మరొకరికి ఇంత ఇస్తాను.
ప్రభూ ! యాచనకు నీ మనస్సు అంగీకరించకపోతే పోనీ మరొక పని చెయ్యి. ఇంద్రాదిదేవతలు
న్యాయంగా నన్ను నీకు సమర్పించారు. నేను ముమ్మాటికీ నీ సొత్తును. నా రక్షణ పోషణ శాసన భారాలన్నీ
నీవే. అందుచేత నన్ను అమ్మేసి ఆ డబ్బుతో ఋణం తీర్చు.
ఈ మాట వింటూనే హరిశ్చంద్రుడు కష్టం కష్టం అంటూ విలపించాడు. అయినా ఈసారి
మాధవీదేవి ధైర్యం కోల్పోలేదు. పట్టువదలలేదు. నాథా ! నా మాట విను.కాదనకు. అట్టే వ్యవధిలేదు.
సూర్యాస్తమయమే గడువు. విప్రశాపాగ్నిలో దహించుకుపోయి నీచత్వం పొందకు. నన్ను అమ్ముతున్నది
జూదం కోసం కాదు, మద్యంకోసం కాదు, రాజ్యంకోసం కాదు, భోగంకోసం కాదు. గురు ఋణం
తీర్చడానికి, సత్యవ్రతం సఫలం చేసుకోడానికి. కాబట్టి కించపడవలసింది లేకపోగా ఇది గర్వించదగిన
అంశం. దయచేసి నా మాట ఆలకించు. నన్ను ఎవరికైనా అమ్మేయ్.
ఇలా మాధవీదేవి పోరగా పోరగా కట్టకడపటికి గతిలేక హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే,
దేవీ ! నిన్ను అమ్మేస్తాను. కఠినాతి కఠినుణ్ణి. నాకు దిగులేమిటి! నీచాతినీచులుకూడా చెయ్యని పనికి సిద్ధం
అవుతున్నాను. నాకు సిగ్గేమిటి! అంటూనే రెక్కపట్టుకుని భార్యను చరచరా తీసుకువెళ్ళి వీథిమొగలో
ఒక ఆరుగుమీద నిలబడ్డాడు జీరబోయిన గొంతుతో నలుగురికీ వినిపించేట్టు అరిచాడు
దొంగలు పడ్డారు
*దొంగలు పడ్డారు !*
౼౼౼౼౼౼౼౼౼౼౼
*ఒక కవి ఇంట్లో*
*దొంగలు పడ్డారు!*
*ఆరు వారాల నగలు*
*మూడు లక్షల నగదు*
*ఐదు పుస్తకాలు పోయాయి!!*
*పుస్తకాలది ఏముందయ్యా... నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.*
*పోలీసుల దర్యాప్తు జరుగుతోంది... నెలలు గడుస్తున్నా జాడలేదు... ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి...*
*ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది... అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో... కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...*
*పుస్తకాలు పోతేపోయినయి... సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు...*
*ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...*
*" పోద్దురు బడాయి "*
*" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే... అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి... నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని... కష్టపడితే సొమ్ము సంపాదించగలను... మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే... అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.*
*" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే... నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి... ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది. ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది. దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.*
*కవి గారికి*
*నమస్కారములు...🙏*
*బీరువా తాళాలు పగులగొట్టి చూశా... నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా... బీరువాలో ఎందుకు దాచారు... వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా... నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది... అది జ్ఞాన నిధి... తప్పుచేశానని తెలుసుకున్నా...*
*ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది... చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా... డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా... ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా... ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు... ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...*
*ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...*
*ఇట్లు*
*దొంగతనాలు మానిన దొంగ*
*ఇప్పుడు కవి ముఖంలో ఆనందం... ఆయన భార్య ముఖంలో ఆలోచనలు*
*లక్ష్మీదేవి గొప్పదా?*
*సరస్వతీ దేవి గొప్పదా?*
-------------------------------------------------------
*ఎంత చక్కని కధ. రచయిత కు అభినందనలు.*
*కావున విద్యార్థులకు పుస్తకాపాఠనాన్ని ఒక నిధిగా... పుస్తక అన్వేషణనే ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్పాటు అందించగలరని నా యొక్క మనవి...*
*
శ్రీ గౌరీ శంకర్ మందిర్
🕉 మన గుడి : నెం 290
⚜ హిమాచల్ ప్రదేశ్ : జగత్ సుఖ్
⚜ శ్రీ గౌరీ శంకర్ మందిర్
💠 ఇది కులు జిల్లాలో ఉంది.
ఇక్కడ మహిషాసురమర్ధని ఆలయం కూడ ఉంది.
ఈ ఆలయంలో విగ్రహం మహిషాసురునితో కన్నులు మూసుకుని వధిస్తూ వున్నట్లు ఉంటుంది.
ఇక్కడి స్వామివారు గౌరీ శంకరుడు.
💠 ఉత్తర భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి మరియు కులు జిల్లాలోని కొన్ని శిఖర శైలిలోని ఆలయాల్లో ఒకటి.
💠 సాంప్రదాయ శిఖర వాస్తుశిల్పం ప్రపంచం నలుమూలల నుండి శిల్పశాస్త్ర ప్రేమికులను ఆకర్షిస్తుంది.
నిర్మాణం చుట్టూ ఉన్న సహజ ప్రకృతి దృశ్యం యొక్క సుందరమైన అందం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది
💠 దీనిని జగత్సుఖ్ శివాలయం అని కూడా పిలుస్తారు. జగత్సుఖ్ మనాలికి పూర్వపు రాజధాని మరియు ప్రస్తుతం కులు జిల్లాలో అతి పెద్ద గ్రామం.
💠 ఈ ఆలయం వెలుపలి ద్వారం " శ్రీ మహారాజా ఉదం పాల్ సుండేయా దేవి కాళీ మురుట్" అనే శాసనాన్ని కలిగి ఉంది.
అప్పుడు ఉధమ్ పాల్ కులులో పాలించాడు, అతను సిద్ధ్ సింగ్‌కు పూర్వం పాలించాడు. జగత్సుఖ్ శివాలయం అని కూడా పిలువబడే ఈ ఆలయం పదమూడవ శతాబ్దం చివరి భాగంలో నిర్మించబడింది.
💠 జగత్సుఖ్ గురించి ఆసక్తికరమైన కథనం ఏమిటంటే, 16వ శతాబ్దం ప్రారంభంలో, సిద్ధ్ పాల్ తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి పొందుతానని ప్రవచించిన వృద్ధ మహిళ ముసుగులో హిడింబా దేవతను కలుసుకున్నాడు మరియు ఇక్కడ కూడా రాజవంశం పేరు పాల్ నుండి సింగ్‌గా మార్చబడింది, ఎందుకంటే సిద్ధ్ పాల్ ఒక రోజు తన బ్రాహ్మణ గృహిణి ఆవుకు పాలు పితికే సమయంలో ఆమె కోసం దూడను పట్టుకున్నప్పుడు, ఒక సింహం అకస్మాత్తుగా కనిపించింది, అతను అక్కడికక్కడే దానిని చంపాడు.
సింగ్- అనగా హిందీలో సింహం, అనే పేరును అతను తన వారసులకు అందించాడు.
శ్రీ మదగ్ని మహాపురాణము
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 44*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 17*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*స్వాయంభువ వంశ వర్ణనము - 4*
ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్ ప్రజాపతిః. 21
యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.
సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22
సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.
అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23
ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.
ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే.
ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్. 24
కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ.
భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26
వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.
సశేషం...
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
అర్జున విషాద యోగము*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
. *🌹శ్రీమద్భగవద్గీత🌹*
. *ప్రధమ అధ్యాయము*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
. *అర్జున విషాద యోగము*
. *శ్లోకము 20*
🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷
*అథ వ్యవస్థితాన్ దృష్ట్వా*
*ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।*
*ప్రవృత్తే శస్త్రసంపాతే*
*ధనురుద్యమ్య పాండవః।।*
*హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ।*
అథ — అనంతరము;
వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న;
దృష్ట్వా — చూసి;
ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు;
కపి-ధ్వజః — వానరమును జండా పై కలవాడు;
ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న;
శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి;
ధనుః — ధనుస్సు (విల్లు) ను;
ఉద్యమ్య — పైకెత్తి;
పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు;
హృషీకేశం — శ్రీ కృష్ణునితో;
తదా — అప్పుడు;
వాక్యం — పదములు;
ఇదం — ఇవి;
ఆహ — పలికెను;
మహీ-పతే — రాజా..
*భావము:*
ఆ సమయంలో, తన రథం జెండా పై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండు పుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు.
వివరణ: శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి 'కపి ధ్వజుడు' అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలు విద్య లో తనకున్న ప్రావీణ్యానికి గర్వ పడి, శ్రీ రామ చంద్రుని సమయంలో వానరములు అంత కష్టపడి సేతువు (బ్రిడ్జి) ని భారత" దేశం నుండి లంకకు ఎందుకు నిర్మించారో అని, శ్రీ కృష్ణునితో అన్నాడు. తనే గనక వుంటే, బాణములతో ఒక వారధి ని చేసేవాడిని అన్నాడు. శ్రీ కృష్ణుడు, అది ఎలాగో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపర తో ఒక వంతెన ని నిర్మించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలయింది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన (వానర) సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థం అయింది. అర్జునుడు తన తొందరపాటుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి, ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వ పడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై, మహాభారత యుద్ధం లో నీ రథం పై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా అర్జునుడి రథం, హనుమంతుని చిహ్నం తో ఉన్న జెండాని కలిగి వుంది. దీనితో అతనికి 'కపి ధ్వజుడు' (జెండా పై కపిరాజు ఉన్నవాడు) అన్న పేరొచ్చింది.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*
🌷🌷🌷
*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - దశమి - స్వాతి - స్థిర వాసరే* *(06-12-2023)*
ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.
https://youtu.be/R6_3OLvbjZQ?si=pDAtebbO8sAkEy5S
🙏🙏
భక్తిసుధ
🪷🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷
🪔 ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔
𝕝𝕝 *శ్లో* 𝕝𝕝
*తరుణా రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ*।
*పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ॥*
*ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణా౹*
*పుక్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణా॥*
*శరణ్యా సర్వసత్త్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతామ్౹*
*రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ॥*
- *శ్రీ రామరక్షా స్తోత్రం - 17, 18, 19*
*తా* 𝕝𝕝
మంచి వయో రూప సంపదలు గలవారు మహా బలశాలులు, సుకుమారులు, పద్మములవంటి విశాల నేత్రాలు గలవారు, నారబట్టలు, లేడిచర్మములే వస్త్రములుగా ధరించినవారు, కందమూల ఫలములను ఆహారముగా గ్రహిస్తూ, తాపసులై, బ్రహ్మచర్య దీక్షను పాటించువారు, దశరథ మహారాజు పుత్రులు, సమస్త ప్రాణులకు శరణ మిచ్చువారు, రాక్షసులను సమూలముగా నశింప చేయువారు, *రఘువంశ శ్రేష్ఠులైన రామ లక్ష్మణులు మనలను రక్షింతురుగాక*.
తరుణ వయస్సు కలవారు, రూపంలో అతి సుందరులు బలపరాక్రమలు, కమలములవంటి విశాలమైన నేత్రాలు కలవారు, నారచీరలను, కృష్ణమృగ చర్మాలను ధరించి, కంద మూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, మహా తపస్వులు, శరణు నిచ్చువారు, శ్రేష్ఠ ధనుర్ధారులు, రాక్షసులను నశింపచేయువారు అయినా *రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక*.
యువకులు, అపురూప సుందరమూర్తులు, సుకుమారులు, మహాబలశాలురు, తెల్ల తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, కృష్ణాజినము (జింక చర్మము)ను ధరించినవారు, కందమూలములను ఆహారముగా తీసికొనువారు, తాపసవృత్తిలో ఉన్నవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు, బ్రహ్మచారులు, దశరథ మహారాజు పుత్రులు, రఘుకుల శ్రేష్ఠులు అగు శ్రీరామ లక్ష్మణులు, సకల జీవరక్షకులు, ధనుర్దారులలో కెల్ల శ్రేష్ఠులు, రాక్షస జాతిని నశింప చేయువారు, రఘుకుల శ్రేష్ఠులు అగు *శ్రీరామ లక్ష్మణులు అను ఇరువురు సోదరులు మమ్ములను కాపాడుదురుగాక*.
