6, జనవరి 2024, శనివారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 *🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 44*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 17*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*స్వాయంభువ వంశ వర్ణనము - 4*


ప్రాచీనాగ్రాః కుశస్తస్య పృథివ్యాం యజతో యతః | ప్రాచీనబర్హిర్బగవాన్మహానాసీత్‌ ప్రజాపతిః. 21


యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండు నట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యు డైన ఆ ప్రజాపతికి ''ప్రాచీన బర్హిస్సు'' అను పేరు వచ్చెను.


సవర్ణా7ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వే ప్రచేతసో నామ ధనుద్వేదస్య పారగాః. 22


సముద్రుని కుమార్తె యైన సవర్ణ ప్రాచీనబర్హిస్సువలన పదిమంది కుమారులను కనెను వారందరికిని ప్రచేతను లనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణప్రజ్ఞ కలవారు.


అపృథగ్ధర్మచరణాస్తే7తప్యన్త మహత్తపః | దశ వర్షసహస్రాణి సముద్రసలిలేశయాః. 23


ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పది వేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి.


ప్రజాపతిత్వం సంప్రాప్య తుష్టా విష్ణోశ్చనిర్గతాః | భూః ఖం వ్యాప్తం హి తరుబిస్తాంస్తరూనదహంశ్చ తే.


ముఖజాగ్ని మరుద్భ్యాం చ దృష్ట్వాచాథ ద్రుమక్షయమ్‌ | ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రజాపతీన్‌. 24


కోపం యచ్చత దాస్యన్తి కన్యాం వోమారిషాం వరామ్‌ | తపస్వినో మునేః కణ్డోః ప్రవ్లూెచాయం మయ్తెవ చ.


భవిష్యం జానతా సృష్టా భార్యా వో7స్తు కులఙ్కరీ | అస్యాముతృద్యతే దక్షః ప్రజాః సంవర్దయిష్యతి. 26


వారు విష్ణువునుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్రజలమునుండి లేచిరి అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను వారు తమ ముఖమునుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-- ''కోపమును ఉపసంహరింపుడు భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలి యగ కండుముని కుమార్తె యైన ప్రవ్లూెచయందు ఉత్తమురాలగు మారిషయను కన్యను జనింపచేసితిని ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ది పొందించు బార్య యగుగాక. ఆమెయందు పట్టిన దక్షుడు ప్రజలను వృద్దిపొందించును.

సశేషం...


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: