19, సెప్టెంబర్ 2023, మంగళవారం

తల్లి మొక్కును

 


మనకు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే, పురాణాలను, దేశాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను, పెద్దలను, సంస్కృతాన్ని విమర్శించే స్థాయికి వచ్చామని విర్రవీగుతుంటారు కొంతమంది.

వాళ్ళకు బుద్ధి వచ్చే సంఘటన ఈ మధ్యనే జరిగింది. 

దివాకర్ అనే వ్యక్తి రాసిన పోస్టు దీనికి మూలం.


''నాసిక్ హై వే మీద, రోడ్డు మీద వెళుతున్న జనాల వంక ఆసక్తిగా చూస్తున్న ఒక వృద్ధ జంటను చూసాను. చూడ్డానికి వాళ్ళు చాలా పేదవారిలా, ఏదో అవసరంలో ఉన్నవారిలా అనిపించింది. నేను వారికి ఆహారం కానీ, మరేదైనా సహాయం కావాలా అని అడిగి వారు మొహమాట పడుతుంటే, ఒక వంద రూపాయల నోటు ఇస్తే వాళ్ళు నిరాకరించారు. నేను వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు చెప్పిన విషయం విని నా మతి పోయింది. 


 *వాళ్ళు 2200 కిలోమీటర్ల దూరాన్ని మూడు నెలల్లో కాలినడకన పూర్తి చేసి ''ద్వారక''కు తిరుగు ప్రయాణం చేస్తున్నారట.* ఇల్లు చేరడానికి మరొక నెల పడుతుందట. 


అలా ఎందుకు నడవడం అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, 


నా చిన్నప్పుడు నా రెండు కళ్ళలోని చూపు పోతే, మా అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అక్కడి డాక్టర్లు, ప్రపంచంలోని ఏ గొప్ప డాక్టరు కూడా కళ్ళు తెప్పించలేడని చెప్పారట. అయినా, వాళ్ళమ్మ పట్టుబట్టి ఆపరేషన్ చేయమని, ఫలితం భగవంతునికి వదిలేద్దామని చెప్పిందట. అంతేగాక, తన కొడుకుకు కంటి చూపు వస్తే, కొడుకుని కాలి నడకన పండరిపూర్, తిరుపతికి యాత్రకు పంపిస్తానని మొక్కుకున్నదట. అతనికి చూపు వచ్చిందట. 


అందుకని ఆ కొడుకు కాలి నడకన, అమ్మ కోరిక ప్రకారం యాత్ర పూర్తి చేసి, తిరుగు ప్రయాణంలో ద్వారకకు బయల్దేరారట. 


కానీ, మరి ఆ స్త్రీ ఎందుకు ప్రయాణం చేస్తుందనే ఆసక్తితో అడిగితే, ఆమె, 


'నా భర్త ఒంటరిగా అంత దూరం కాలినడకన వెళ్ళడం ఇష్టం లేకా, దారిలో ఆయనకు అన్నపానీయాలు అమరుస్తూ, ప్రయాణంలో ముచ్చటించుకుంటూ సరదాగా గడపవచ్చని నడుస్తున్నానని' చెప్పింది. 


వాళ్ళిద్దరూ చక్కటి హిందీ, ఇంగ్లీషుల్లో మాట్లాడడం చూసి వారి చదువు గురించి ప్రశ్నించిన నాకు వారు చెప్పిన సమాధానం విని మతిపోయింది. 


ఆ మగ వ్యక్తి *ఆస్ట్రో_ఫిజిక్స్* లో *పి.హెచ్.డి* చేసి లండన్ లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఏడేళ్ళు *సీ_రంగరాజన్*, *కల్పనా_చావ్లాతో* కలిసి పనిచేసాడట....

అతని భార్య లండనులోని ఒక విశ్వవిద్యాలయం నుండి *హ్యూమన్_సైకాలజీలో_ పీ హెచ్ డి* చేసిందని చెప్పేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. వాళ్ళ ముఖాల్లో అంత చదువుకున్నామనే, అంత గొప్పవారమనే ఛాయలు కనిపించడమే లేదు. 


వాళ్ళు చెప్పిన మరొక విషయం కూడా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. వాళ్ళకు వచ్చే పెన్షన్ మొత్తం అంధులకు సహాయం చేసే, ఒక ట్రస్టుకు విరాళంగా ఇస్తున్నారట. 


 *అతని పేరు డాక్టర్ దేవ్ ఉపాధ్యాయ.* 


 *ఆమె పేరు డాక్టర్ సరోజ్ ఉపాధ్యాయ.* 


తల్లి మొక్కును ఇప్పటికైనా తీర్చిన వాళ్ళిద్దరూ, *ధన్యులు*


ఇది కదా మన దేశపు ఔన్నత్యం.  


👆This is a humble effort to translate the post in Marathi by Diwakar.🌹🌻🌹🌻🌹

*తల్లి ఋణం

 *తల్లి ఋణం - తీర్చలేనిది..!!* 


🌟 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.


🌟 తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.


🌟 అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.


🌟 అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.


🌟 తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.


🌟 తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.


🌟 అప్పుడు తల్లి ..... బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.


🌟 నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.


🌟 ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. 


👉నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు.


అందుకే తల్లిని మాతృదేవోభవ అన్నారు. తల్లి దేవత. తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.


నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.


 *దయచేసి తమ పిల్లలకు ఇది పంపించండి🙏

Flying weel


 

Winding technology


 

Gate mechanism


 

Amazing bicycle


 

Peroectual motion


 

Mechanical engineering


 

Mechanical engineering


 

Sweet potato tsmoto curry


 

సంసారం సారము లేనిదైనను

 శ్లోకము

*అసారే ఖలు సంసారే*

 *సారం శ్వశుర మందిరం l*

    *హిమాలయేహరశ్శేతే"

  *హరిశ్శేతే మహోదధౌll*


 *తాత్పర్యము. సంసారం సారము లేనిదైనను శ్వశురగృహము నసారము గలది .కనుకనే శివుడు హిమాలయము నందును,విష్ణువు పాలసముద్రము నందును  శయనించినారు.*

Panchaag


 

శ్రీ మా భవాని మందిర్

 🕉 మన గుడి : నెం 183





⚜ ఛత్తీస్‌గఢ్ : కొర్భా


⚜ శ్రీ మా భవాని మందిర్ 


💠 కోర్బాలోని భవానీ మాత ఆలయం దాని అద్భుతాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.


💠 24 సంవత్సరాల క్రితం అమ్మవారు కలలో కనిపించి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చెప్పారని, ఆపై ఆలయాన్ని స్థాపించారని నమ్ముతారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయంపై భక్తుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. 

ఆలయ ప్రఖ్యాతి ఇప్పుడు మరింత పెరిగింది. నవరాత్రుల సందర్భంగా ఆలయ అందాలు చూడాల్సిందే.



💠 భవానీ దేవాలయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.. ఏ కథ నిజమో ఎవరికీ తెలియదు.. కానీ ప్రతి కథపై ప్రజలకు అచంచలమైన నమ్మకం ఉంటుంది. 

ఈ ఆలయంలో అమ్మవారు స్వయంగా ఉన్నట్లు చెబుతారు. హస్దేవ్ నది ఒడ్డున కూర్చున్న భవానీ తల్లి భక్తుల బాధలను పోగొడుతుంది. 

చత్తీస్‌గఢ్‌ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.


💠 భవానీ ఆలయ ప్రధాన పూజారి చంద్ర కిషోర్ పాండే మాట్లాడుతూ, "ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 1999లో శివరాత్రి రోజున స్థాపించారు. అప్పుడు ఈ ఆలయాన్ని కత్ఘోరాలో నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ కలలో నా భార్య జ్యోతి పాండేకి అమ్మవారు వచ్చి నది ఒడ్డున నా విగ్రహం ఉంది అని సంకేతం ఇచ్చింది.

తర్వాత మేము ఈ ప్రాంతానికి చేరుకున్నాము, హస్దేవ్ నది ఒడ్డున వెతికిన తర్వాత మాకు దేవత విగ్రహం కనిపించింది.

ఆ రోజు నుండి  దేవాలయంకి పునాది  ఇక్కడ వేయబడింది.


💠 ఈ ప్రదేశం పేరు జోగియ డేరా, ఇది 7 దేవతల ప్రదేశం, నర్మదేశ్వరుడే ఇక్కడ శివశక్తి రూపంలో ఉన్నాడు, రామేశ్వరం నుండి తెచ్చిన 750 సంవత్సరాల శివలింగం ఇక్కడ ప్రత్యేకత.


💠 కలలో దేవత శివశక్తి స్థాపనకు ఆదేశించిందని, ఆలయంలో భవానీ మాతను స్థాపించిన తర్వాత శివలింగం కోసం అన్వేషణ ప్రారంభమైందని , ఈ ఆలయం గురించి కూడా ప్రసిద్ధి చెందింది. 

ఆలయ పూజారులు రామేశ్వరం ధామ్‌కి వెళ్లారు, అక్కడ ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన అప్పటి రాణి అహల్య హోల్కర్ శివలింగాన్ని ప్రతిష్టించారు. 

అయితే గతంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది, ఆ తర్వాత శివలింగాన్ని మరెక్కడా ప్రతిష్టించలేదు. అప్పుడు రామేశ్వరం ధామ్‌లోని మహామండలేశ్వరుడు ఈ శివలింగాన్ని భవానీ ఆలయ అర్చకుడికి ఇచ్చాడు. దీని తరువాత, 750 సంవత్సరాల నాటి అరుదైన శివలింగం రామేశ్వరం నుంచి తీసుకొచ్చి భవానీ ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి, భవాని ఆలయంలో మాతా భవానీ మాత్రమే కాకుండా, పరమేశ్వరుని కూడా పూజించడం ప్రారంభించారు.


💠 ప్రతి సోమవారం ఇక్కడ మాత ఆస్థానం జరుగుతుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు లేదా ఏదైనా బాహ్య అడ్డంకులు, శారీరక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. 

చంద్ర కిషోర్ పాండే మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, ఇదంతా అమ్మవారి కోరిక మేరకే జరుగుతుందని, ఆమె ఆదేశానుసారం భక్తుల సమస్యలు పరిష్కరిస్తారని, దీని ఖ్యాతి ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు. ఇతర రాష్ట్రాలలో కూడా ఉందని అంటారు


💠 మా భవానీ ఆలయానికి ఎలా చేరుకోవాలి : 

రహదారి ద్వారా ; మా భవానీ దేవాలయం కోర్బా బస్ స్టాండ్ నుండి 8 కి.మీ దూరంలో , కోర్బా రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

 దేశంలోని అనేక నగరాల నుండి కోర్బా రైల్వే స్టేషన్‌కు నేరుగా రైలు సౌకర్యం ఉంది మరియు చంపా జంక్షన్ మరియు బిలాస్‌పూర్ జంక్షన్ నుండి కూడా కోర్బా రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు.


 

హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు

 🎻🌹🙏హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు ....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿1. చాలీసా" అంటే ఏమిటి? 


🌸జ. ఈస్తోత్రంలో  40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)



🌿2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?


🌸జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. అజ్ఞానమును హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.



🌿3. ఆంజనేయ - అర్థం?


🌸జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.



🌿4. తులసీదాస్ అస్సలు పేరు ?


🌸జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.



🌿5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?


🌸జ. దేవుళ్ళ భార్యలను,  మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య  వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.



🌿6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?


🌸జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 

హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.



🌿7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?


🌸జ.  తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా  అర్ధం  చేసుకోవాలి.



🌿8. హనుమంతుని పంచముఖములు ఏవి?


🌸జ.  హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,

హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః  వచ్చినది అది సద్యోజాత శివవదనము.


🌿దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం  గరుడ ముఖం  అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.


🌸ఉత్తరం  వరాహ ముఖం  అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 


🌿ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు  వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది    



🌸9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?


🌿జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం  అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.



🌸10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?


🌿జ.126 సం.జీవించాడు...స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 26*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 26*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


         *విరించిః పంచత్వం వ్రజతి హరి రాప్నోతి విరతిం*

         *వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |*

         *వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా*

         *మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ ||*


నాలుగో పాదంలో *మహా సంహారే అస్మిన్* అని అన్నారు. ఏమిటీ మహాసంహారము అంటే, బ్రహ్మ గారికి నూరు కల్పాలు పూర్తయితే, మహాకల్పము అంటారు. అప్పుడిక ఆయన పని అయిపోతుంది. ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.

కల్పాంతం వేరు, యుగాంతం వేరు.యుగాంతంలో మార్పులుంటాయి కానీ ప్రళయం, జగత్తు మాయం అవటం వుండవు. అది కల్పాంతంలో జరుగుతుంది.


అస్మిన్ = ఆ సమయంలో


విరించిః పంచత్వం వ్రజతి = బ్రహ్మ మరణిస్తాడు.


హరిరాప్నోతి విరతిం = స్థితి చేయటానికి సృష్టి జరగలేదు కాబట్టి విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు.


వినాశం కీనాశో భజతి = యముడు కూడా వెళ్ళిపోయాడు. దిక్కులే లేవు కనుక దిక్పాలకులూ లేరు.


ధనదో యాతి నిధనమ్ = కుబేరుడు కూడా. ఆయనా ఒక దిక్పాలకుడేగా!


వితంద్రీ మాహేంద్రీ వితతిరపి = ఇంద్రులంతా వెళ్లిపోయారు.


సంమీలితదృశా విహరతి సతి త్వత్పతి రసౌ = 22 వ శ్లోకార్ధం లో చెప్పుకున్నాము సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడని. అమ్మవారికి అన్వయిస్తే సతి అవుతుందని. ఆమె శాశ్వతమైన ఉనికి కలది.*దేశ కాలా పరిచ్చిన్నా* ఆమె.

ఈ జగత్తు అంతా నాశనమవుతుంటే ఆయన, ఆవిడా విహరిస్తూ చూస్తూ ఉంటారట. ఆయన నాట్యం చేస్తుంటే, ఆమె చూస్తూ ఆనందిస్తుందట. గుర్తు తెచ్చుకోండి--అమ్మవారి నామాల్లో *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ*


అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందుచున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా ! 


360 మానవ సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.

12 వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగం.నాలుగు యుగాలు కలిపి మనుష్యమానంలో 

43 ,20 ,000 సంవత్సరాలు.

అలాటి 2 వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహో రాత్రం. (ఒక పగలు, ఒక రాత్రి)

ఇటువంటి 360 బ్రహ్మ దివసాలు ఒక బ్రహ్మ మాన సంవత్సరం.

అలాటి 50 బ్రహ్మ వత్సరాలు ఒక పరార్ధం. బ్రహ్మ జీవిత కాలం 2 పరార్ధాలు. మన లెక్కలో 31104 కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు మనం రెండవ పరార్ధంలో వున్నాము.


వెయ్యి చతుర్యుగాలు పధ్నాలుగు మన్వంతరాలుగా విభజించారు. ఈ 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పము. అట్టి 100  కల్పములు బ్రహ్మ జీవిత కాలం. ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధిపతి. ప్రస్తుతం శ్వేత వరాహ కల్పంలో ప్రస్తుత బ్రహ్మ గారి 51 వ సంవత్సరం నడుస్తున్నది. ఈ కల్పంలో ఇప్పుడు 7 వ మనువు వైవస్వతుడు అధిపతి. 

మనువులు స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఔత్తమి, తామసుడు, రైవతుడు, చాక్షషుడు, వైవస్వతుడు, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య సావర్ణి, ఇంద్ర సావర్ణి వీరు పదునాలుగు మంది మనువులు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹