21, డిసెంబర్ 2025, ఆదివారం

సూర్య నమస్కారాలలో

 🌈సూర్య నమస్కారాలలో 

12 భంగిమలు ఉంటాయి. 


వాటి పేర్లు: 

ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, హస్త పాదాసనం, అశ్వ సంచాలనాసనం, చతురంగ దండాసనం, అష్టాంగ నమస్కార, భుజంగాసనం*, 


*పర్వతాసనం, అశ్వ సంచాలనాసనం, హస్త పాదాసనం, హస్త ఉత్తానాసనం, మరియు ప్రణమాసనం*. 


*🌈సూర్య నమస్కారంలోని 12 భంగిమలు:*


*1.🌞 ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*


*2.🌞 హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*3.🌞 హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*4. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*కుడి కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*5. 🌞చతురంగ దండాసనం (Chaturanga Dandasana):*

*శరీరాన్ని నేలమీదకు దించి, చేతులతో బ్యాలెన్స్ చేయడం.*


*6.🌞 అష్టాంగ నమస్కార (Ashtanga Namaskara):*

*శరీరాన్ని నేలమీదకు దించి, 8 భాగాలు (రెండు పాదాలు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతీ మరియు గడ్డం) నేలను తాకడం.*


*7. 🌞భుజంగాసనం (Bhujangasana):*

*పాముల వలె శరీరాన్ని పైకి లేపడం.*


*8.🌞 పర్వతాసనం (Parvatasana):*

*పర్వతం ఆకారంలో శరీరాన్ని పైకి లేపడం*.


*9. 🌞అశ్వ సంచాలనాసనం (Ashwa Sanchalanasana):*

*ఎడమ కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం*.


*10. 🌞హస్త పాదాసనం (Hasta Padasana):*

*ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.*


*11. 🌞హస్త ఉత్తానాసనం (Hasta Uttanasana):*

*చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం*.


*12. 🌞ప్రణమాసనం (Pranamasana):*

*నమస్కార భంగిమలో నిలబడటం*. 

*ప్రతి భంగిమలోనూ మంత్రాలు జపిస్తారు. ఒక్కో మంత్రం ఒక్కో దేవుడికి లేదా సూర్యుడికి సంబంధించినది. ఈ భంగిమలను క్రమ పద్ధతిలో చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.*

మహాభారతం అందులోని పర్వాలు*

  *మహాభారతం అందులోని పర్వాలు*     


*ఆది పర్వము*

వ్యాసుడు రచించిన, మహాభారతములో మొత్తం 18 ఉపపర్వాలు, 8 అశ్వాసాలు ఉన్నాయి. సంస్కృత భారతంలోని ఆది పర్వంలో మొత్తం 9,984 శ్లోకాలు ఉంటే, శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో మొత్తం పద్యాలు, గద్యాలు కలిపి 2,084 ఉన్నాయి.


మహాభారతంలోని పద్ధెనిమిది పర్వాలలో విషయ క్రమణిక ఇలా ఉంది.


*1.ఆది పర్వము:* పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.


*2.సభా పర్వము:* కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.


*3.వన పర్వము (లేక) అరణ్య పర్వము:* అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.


*4.విరాట పర్వము:* విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.


*5.ఉద్యోగ పర్వము:* కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.


*6.భీష్మ పర్వము:* భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*7.ద్రోణ పర్వము:* ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*8.కర్ణ పర్వము*: కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.


*9.శల్య పర్వము:* శల్యుడు సారథిగాను, అనంతరం నాయకునిగాను సాగిన యుద్ధం. దుర్యోధనుని మరణం.


*10.సౌప్తిక పర్వము*: నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.


*11.స్త్రీ పర్వము:* గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.


*12.శాంతి పర్వము*: యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.


*13.అనుశాసనిక పర్వము:* భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)


*14.అశ్వమేధ పర్వము*: యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.


*15.ఆశ్రమవాస పర్వము:* ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.


*16.మౌసల పర్వము:* యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.


*17.మహాప్రస్ధానిక పర్వము:* పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.


*18.స్వర్గారోహణ పర్వము:* పాండవులు స్వర్గాన్ని చేరడం.


వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు. ఇవి కాక తరువాతి కథ అయిన శ్రీకృష్ణుని జీవితగాథను తెలుగు మహాభారతంలో భాగంగా కాక హరివంశ పర్వము అనే ప్రత్యేక గ్రంథంగా పరిగణించారు. నన్నయ మొదలుపెట్టిన కథావిభాగాన్నే తిక్కన, ఎఱ్ఱన అనుసరించారు.



ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.


ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.


రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే

జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్



ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


*ఉపపర్వాలు*


మహా భారతంలోని మొత్తం 100 ఉపపర్వాలలో 19 ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.


*సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు*


1.అనుక్రమణికా పర్వం (పర్వాల సంగ్రహం)


2.పౌష్యం


3.పౌలోమం


4.ఆస్తిక పర్వం


5.ఆదివంశావతరణం


6.సంభవ పర్వము


7.లాక్షాగృహ దహనం


8.హిడింబాసురని వధ


9.బకాసురుని వధ


10.చైత్రరథం


11.ద్రౌపదీ స్వయంవరం


12.వైవాహిక పర్వము


13.విదురాగమనం


14.రాజ్యలాభ పర్వం


15.అర్జునుని వనవాసం


16.సుభద్రా కల్యాణం


17.హరణ హారిక


18.ఖాండవ వన దహనం


19.మయసభా దర్శనం


*ఆంధ్ర మహాభారతం*


అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *యుక్తియుక్తముపాదేయం* 

           *వచనం బాలకాదపి* l

           *అన్యత్తృణమివ త్యాజ్యం*

           *అప్యుక్తం పద్మజన్మనా* ll


         *_----యోగవాశిష్టమ్----_*


తా𝕝𝕝 *యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లలు చెప్పిననూ స్వీకరించవలెను...*.

*యుక్తియుక్తము కాని మాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిననూ గడ్డిపరకగా భావించి వదిలివేయాలి...*


✍️🌹🌸💐🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:అర్జున ఉవాచ


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా 

సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ(32)


ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః 

యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ (33)



పార్థా.. అజ్ఞానాంధకారంవల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్నీ విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి. మనసు, ప్రాణం, ఇంద్రియాలు—వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలధైర్యం సాత్వికధైర్యం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

తిరుప్పావై 7వ పాశురము

 🌹 *తిరుప్పావై 7వ పాశురము*🌹


*(తిరుప్పావై 7వ పాశురము~ దానికి అనువాద పద్యము)*



    *కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు*

    *పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!*

    *కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై*

    *వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్*

    *ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో*

    *నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి*

    *కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో*

    *తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్!!*


*భావం:-*


భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. 

ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజృంభించి, ఆకాశామంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును. 


*అవతారిక:-*


భగవదనుభవము నిత్యనూతనమై మోహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.  


*తాత్పర్యం*



       ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భగవద్విషయానుభవము నెరిగినదానవు.


   సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.

   


*అవతారిక :-*

  


    వ్రతాలూ, నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని.


   ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో...

  

     *(చక్రవాక రాగము - ఆదితాళము)*


ప. తేజోముఖీ! తలుపు తీయుమా!

    ఈ జాము నిడురేల! ఇక మేలుకొనవేల?


అ..ప.. ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద?

    ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో?


1 చ. పరిమళించు కుంతలాల పడుచులు - ఆ

    భరణములు రవళింప చేతులని సాచి

    పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన! నీవేమి వినలేద?

    వినలేద?


2 చ. నాయిక! శ్రీమన్నారాయణుడే

    ఈయిల కేశవుడై ప్రభవించగ   

    మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము

    లే! యిక! వినుచు మొద్దునిద్దురపోదువె?


*భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము*


*(ఆండాళ్ తిరువడిగలే శరణం)*


*కీశు కీశ్ ఎన్ఱ్* పక్షులు మాట్లాడుతున్నాయి. *కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో* పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులే కాదు.


*ఎంగుం* అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి *ఆనైచ్చాత్తన్* భరద్వాజ పక్షి గురించి చెబుతుంది.


ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ

 ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు.


 భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్థకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయుష్షు వేద అద్యయళ కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తస్లపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు.


 మళ్ళీ వేద అద్యయనం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయుష్షు గంగలు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ!


 భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది.


గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు.


*కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు* గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, *వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్* గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. *మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం* కవ్వముతో పెరుగు చిలికే శబ్దం *కేట్టిలైయో* వినబడలేడా. *నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!*

 *ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా ?* అంటూ ఆక్షేపించసాగారు.


*నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో* పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను 

మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే *నారాయణ* సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన *మూర్తి* మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు.


కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, *కేశవన్* కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు.


అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు.


అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. 


 *తేశం ఉడైయాయ్* భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా *తిఱవ్* రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి.


*తిరుప్పావై 7వ పాశురము*

*తెలుగు పద్య అనువాద౦*

*రచన మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు* 

*మిట్టాపల్లి* 


*సీసమాలిక:*


*పవళింపు వీడుము పక్షుల కిలకిల*

           *మనుచు పలుకుచుండె తనివి తీర*

*ఘల్లుఘల్లు మనెడు కాసుల పేర్లను* 

       *కంఠమాలను దాల్చి కాంచు మనుచు*

*గొల్లల యిల్లాండ్రు కోలలు చేదాల్చి* 

      *పెల్లు మనెడు పూ జల్లుచేత* 

*నారాయణ యని కైవారముతో మేము* 

           *ఆలపించిన స్వామి పలుకలేడు*

*గోపబాలల మమ్మ గోవిందు సేవింప* 

        *తరలి నారము వచ్చి తలుపు తెరువు*


 *ఆ.వె. అనుచు పిలిచి వారు మనవిని వినుమని* 


*ఏక చిత్తులగుచు వేడుకొనిరి*

*స్వామి సేవయందు సర్వంబు నర్పించి*

*నోము నోతు మమ్మ సేమముగను*

*శ్రద్ద భక్తి నిచ్చి బుద్ధిని యొసగుచు*  

*శ్రీధరుని మనమున స్థిరము కమ్ము!*


   *(ఆణ్డాళ్ దివ్య తిరువడి గళే శరణమ్)*


                🌹🌹🌹

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *యుక్తియుక్తముపాదేయం* 

           *వచనం బాలకాదపి* l

           *అన్యత్తృణమివ త్యాజ్యం*

           *అప్యుక్తం పద్మజన్మనా* ll


         *_----యోగవాశిష్టమ్----_*


తా𝕝𝕝 *యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లలు చెప్పిననూ స్వీకరించవలెను...*.

*యుక్తియుక్తము కాని మాట సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిననూ గడ్డిపరకగా భావించి వదిలివేయాలి...*


✍️🌹🌸💐🙏

శ్రీ పోతన భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు*

 

(3-193-క)

ఏ నరుఁడే నొక నిమిషం

బైన వృథావాదగతిని హరిపదకమల

ధ్యానానందుఁడు గాడే

నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!


*భావము:-* ఓ మునిశ్రేష్ఠా! పనికిమాలిన వాదాలలో పడి కనీసం ఒక్క నిముషమైన హరిపాదపద్మాలను స్మరించి ఆనందించకుండా ఉండేవాడు ఎవడైనా సరే వాడి ఆయుస్సు అల్పమైపోతుంది.


ధనుర్మాసం ఆరవ రోజు, 'శ్రీ జయదేవుని, ఆరవ అష్టపదితో' శుభాకాంక్షలు...


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం* 

ధర్మో రక్షతి రక్షితః

శ్రీ ద్వారకాధీశో విజయతే

  శ్రీ ద్వారకాధీశో విజయతే


జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్య శ్రీశారదామఠ ద్వారకా సంస్థానాధీశ్వర మహ


శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారణి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠతవశ్చర్యాచరణ చక్రవర్త్యనాద్యవిచ్ఛిన్న గురుపరంపరాప్రాప్త షణ్మతస్థాపనాచార్య సాంఖ్యత్రయప్రతిపాదక వైదికమార్గప్రవర్తక నిఖిల నిగమాగమసార హృదయ శ్రీమత్సుధన్వనః సామ్రాజ్యప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధి రాజగురు భూమండలాచార్య చాతుర్వర్ణ్య శిక్షక గోమతీతీరవాస శ్రీమద్వారకాపురవరాధీశ్వర పశ్చిమామ్నాయ శ్రీమచ్ఛారదాపీఠాధీశ్వర శ్రీమత్కేశవాశ్రమస్వామి దేశికవరకరకమలసంజాత శ్రీ శారదా పీఠాధీశ్వర శ్రీమద్రాజరాజేశ్వరశంకరాశ్రమస్వామిభిః


శిష్యకోటిప్రవిష్టాన్ నిరవద్యవైదికరాద్ధాంతశ్రద్ధధానచేతః సామ్రాజ్యసమలంకృతానశేషభరతఖండ సదాయతనవిద్వద్వరాన్ ప్రతి ప్రత్యగ్రహ్మైక్యానుసంధాననియతనారాయణస్మరణ సంసూచితా శిషస్సముఛసంతుతరామ్ జగద్గురూణాం మహేశ్వరాపరావతార శ్రీమచ్ఛంకరభగవత్పూజ్యపాదాచార్యాణామాదిమైకాంతికాస్థానద్వార కానశ్రీమచ్చారదాపీఠగోచరా భక్తిరనవధిక శ్రేయోనిదానమితి సార్వజనీనమేతత్॥ సాంప్రతమ. భగవత్యాః శారదాయా లష్కరనగరీ గ్వాలియరసంనిహితాంత్రీజనపద సమావేశ వాసర విశేషముపక్రమ్యాప్రస్థితే ర్లష్కరప్రస్థాత్ప్రజ్ఞాపితసాయన నిరయన భేదభిన్నప్రక్రియాతిశయ సమాస్పదీభూత ప్రక్రమభరబు భుత్సాపరాయత్తస్వాంతేన లేలేఇత్యుపాభిధానవిసాజీరఘునాథశర్మణా తన్నగరీ నికేతనేనానుపదమభ్యహింతామభ్యర్ధనామురరీకుర్వాణైర్విగాన విశేషపరామృష్టప్రత్యయసంధానైరిదమత్రాస్మాభిరవధార్యతే తథాహి


దర్శనసామాన్యస్యావాంతర మహాతాత్పర్యవిశేషానుగృహీత విగ్రహవత్తయోపక్రమ పరామర్శోపసంహారాననుగమ్యాపిచరమామేవ తయోస్తాత్పర్యమహాభూమిమభ్యుదితవ లాభిధేయప్రసవిత్రీ మాచక్షాణాస్సమ్మీయంతేతీర్థకారాః


అవాంతరతాత్పర్యతికర్తవ్యతా ప్రయుక్త ప్రసక్తినిర్వహణా యాభ్యంతరపదార్థపరిశీలనౌపయికప్రయత్నాతిశయస్యార్ధవత్వే పి తథాత్వమేవ తస్యావక్లప్తమవసితం భవత్యుపసర్జన ముద్రయా కిలాశేషశ్చ.


మహాతాత్పర్యకథాసుధాత్వవికృతవస్తుభేదప్రగ్రహమేవ ప్రత్యస్తమితసాతిశయవిధావిధానమపూర్వతర మనుభావయంతీ ప్రతర్పయాతీ చ నిరూఢార్థప్రధట్టికామసాధారణీం తాం చకాస్త్యేవ సర్వశః సరణిరేషా సర్వాస్వపి దర్శనస్థితిషు సత్యేవ సాధారణీ ప్రతిష్ఠాపయత్యర్థతత్వమితి వస్తుస్థితిఃప్రకృతే హి సాయననిరయనతంత్రయోరితరేతరప్రత్యనీక భావభావితయోరష్యన్యోన్య స్వరూప విశేషసమర్పణకృతే కృతాకాంక్షయోస్తి హి వైషమ్యం భూయః తచ్చ పరిగణితానేకపదా ర్థవిభాగభాగపి జ్యోతిఃశాస్త్రమహాతాత్పర్యేదం పర్యవిషయీభూతకాలా వయాథాత్మ్యమనుభావయమానం విహితనమస్తశ్రాతస్మార్య క్రియాకలాపనియతకాలీవిభ్రమాపనోదనిర్మరమనుకూలీకృతాశేష భూతవస్తువ్యవస్థాకమ పరామృష్ణ విపర్యయ ప్రతీతిజననమ విపర్యస్తాబాధితాసందిగ్ధదృక్రతీతిపర్యాప్తమేవ వరిసమాప్యతే స్వాభావభావితమర్ధత ఇత్యాదరగోచరం భవత్యేవ సాయనతంత్రగతం తదేతత్.


నిరయనతంత్రాయత్తం తదిదం యథాభూతక్రియాకలాపకాల నిర్దేశనిర్వర్తనాసమర్ధ సత్తదుపజీవకతామేవావివాదమశ్రుత ఇతి స ఏష సాయనపక్షః సర్వైరపి శ్రీమతా విసాజీ రఘునాథ శర్మణా సమర్థితస్సదస ద్విచారణాపురఃసరమాద్రియతాం మహాశయైరశేషవర్ణాశ్రమిభిరితి స్థితమ్| అనాదిసిద్ధ శ్రీమజ్జగద్గురుసంస్థానాజ్ఞాపరిపాలనైకపరంపరాకేషు కిమధికం బ్రహ్మక్షత్రాదిశిష్యవరేష్వితి శివమ్.


శ్రీమచ్ఛంకరభగవత్పూజ్యపాదాచార్యాణామవతారశకాబ్దాః 2362 ఫాల్గుణకృష్ణాష్టమ్యాం 8స్థిరే సంవత్ 1949శకే 1814 (స్వారీ ముం. ధవలపురమ్)

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ! 

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿 

సర్వ శుభకరుడైన భగవంతుడు, విశ్వం యొక్క సృష్టికర్త అయినందున, సమస్త సత్ జీవుల యొక్క మంచి కోసం కూడా ప్రణాళికలు వేస్తాడు. 

మంచి జీవులకు భగవంతుడు తన మంచి సలహాను పాటించమని సలహా ఇచ్చాడు మరియు అలా చేయడం ద్వారా వారు జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. 


భగవంతుడిని తప్ప మరే దేవతను పూజించాల్సిన అవసరం లేదు. 

భగవంతుడు సర్వశక్తిమంతుడు, మరియు ఆయన తన పాద పద్మములపట్ల మన విధేయతతో సంతృప్తి చెందితే, మన భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాలను విజయవంతంగా అమలు చేయడానికి అన్ని రకాల ఆశీర్వాదాలను మనకు అందించగల సమర్థుడు. 


ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందేందుకు, భగవంతునితో మనకున్న శాశ్వత సంబంధాన్ని అందరూ అర్థం చేసుకునేందుకు మానవ రూపం ఒక చక్కటి అవకాశం. 

ఆయనతో మన సంబంధం శాశ్వతమైనది; 

అది విచ్ఛిన్నం లేదా నాశనం చేయబడదు. 

ఇది ప్రస్తుతానికి మరచిపోవచ్చు, కానీ అన్ని కాలాల మరియు అన్ని ప్రదేశాలలోని గ్రంథాలలో వెల్లడి చేయబడిన ఆయన ఆదేశాలను మనం పాటిస్తే, భగవంతుని దయతో ఇది పునరుద్ధరించబడుతుంది.


(శ్రీమద్-భాగవతం, స్కందము.1

అధ్యాయం.11, వచనం.7)


హరే కృష్ణ

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

ఆంజనేయస్వామి_అవతారాలు

 🚩#ఆంజనేయస్వామి_అవతారాలు🚩  


🚩ఆంజనేయస్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు.శ్రీమహావిష్ణువు దశావతారంధరిస్తే..ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు🚩


🚩అవేంటంటే🚩

🚩1.ప్రసన్నాంజనేయస్వామి

🚩2.వీరాంజనేయస్వామి

🚩3.వింశతి_భుజ_ఆంజనేయస్వామి

🚩4.పంచముఖ_ఆంజనేయస్వామి

🚩5.అష్టదశ_భుజ_ఆంజనేయస్వామి

🚩6.సువర్చలాంజనేయస్వామి

🚩7.చతుర్బుజ_ఆంజనేయస్వామి

🚩8.ద్వాత్రింశద్భుజ_ఆంజనేయస్వామి

🚩9.వానరాకార_ఆంజనేయస్వామి.


🚩ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. 

నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం 

ఒంగోలులో ఉంది.ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం 

అని పిలుస్తారు.


🚩ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన 

ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. 


🚩పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. 

శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, 

స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు


🚩అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు 

శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. 

ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


🚩తమలపాకుల దండ:🚩


🚩ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.


🚩మల్లెలు:🚩

గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం 

చాల శ్రేష్టం.


🚩పారిజాతాలు:🚩

స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.


🚩తులసి:🚩

తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, 

అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది


🚩కలువలు:🚩

కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో 

ఇష్టమైన పూలు. 


🚩కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది.అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. 

శ్రీరాములవారికి హనుమంతుడుపై భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.


🚩పంచముఖ హనుమాన్:🚩

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. 


🚩ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.🚩

🚩1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.


🚩2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.


🚩3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, 

దుష్ట ప్రభావలను పోగొట్టీ, 

శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.


🚩4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.


🚩5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.హనుమంతుడంటే ఒక అంకితభావం. 

బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. 

అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. 


🚩సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని 

ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం,విశ్వవిజేతలైన రాక్షస వీరులనేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే...

🚩మిత్రులందరికీ *మంగళవారం*

 *శుభ శుభోదయ శుభాకాంక్షలు*

                 *సేకరణ*

    *న్యాయపతి నరసింహారావు*

ఆదివారం*🌞 *🌹21డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

 *🌹21డిసెంబర్2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                 

         *స్వస్తి శ్రీ విశ్వావసు* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - శుక్లపక్షం*


*తిథి  : పాడ్యమి* ‌ఉ 09.10 వరకు ఉపరి *విదియ*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* రా 03.36 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : వృద్ధి* సా 04.36 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం  : బవ* ఉ 09.10 *బాలువ* రా 10.03 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 10.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *రా 10.21 - 12.06*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.28*

*వర్జ్యం    : ప 11.51 - 01.36*

*దుర్ముహూర్తం  : సా 04.11 - 04.55*

*రాహు కాలం   : సా 04.16 - 05.40*

గుళికకాళం      : *మ 02.53 - 04.16*

యమగండం    : *మ 12.06 - 01.29*

సూర్యరాశి :*ధనుస్సు*                   

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.42* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.31 - 08.45*

సంగవ కాలం         :     *08.45 - 10.59*

మధ్యాహ్న కాలం    :    *10.59 - 01.12*

అపరాహ్న కాలం    : *మ 01.12 - 03.26*


*ఆబ్ధికం తిధి         : పుష్య శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.26 - 05.40*

ప్రదోష కాలం         :  *సా 05.40 - 08.14*

రాత్రి కాలం           :*రా 08.14 - 11.40*

నిశీధి కాలం          :*రా 11.40 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.49 - 05.40*

<><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*ఉన్మత్తభైరవాయ నమః* 

*భీషణభైరవాయ నమః*

*కాలభైరవాయ నమః* 

*సంహారభైరవాయ నమః*

 *ముఖస్థానే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🍁శనివారం 20 డిసెంబర్ 2025🍁*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                             8️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


    *సంపూర్ణ మహాభారతము*            

                *80 వ రోజు*

                

*వన పర్వము ద్వితీయాశ్వాసము*


*నలదమయంతుల వియోగం*```


ఒకరోజు అడవిలో నలుని తొడమీద తల పెట్టుకుని, దమయంతి నిద్రపోతూ ఉంది. అమెను చూసి నలుడు “ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది” అని మనసులో అనుకుని, తాను ధరించిన చీరభాగాన్ని చింపి, పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండచిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండచిలువను చంపి, దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకుని, ఆమెను తాకబోవగా, దమయంతి అతనిని భస్మం చేసింది.

 

భర్తను తలుచుకుంటూ అడవిలో దారీతెన్నూ లేకుండా ప్రయాణిస్తూ ఉండగా, ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్టులను చూసింది. మునులు దమయంతిని చూసి “అమ్మా! నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగారు. 


సమాధానంగా దమయంతి “మునిపుంగవులారా! నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించ లేను” అని అడిగింది. 


మునులు “అమ్మా! నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది. చింత పడకుము” అని చెప్పి, వెళ్ళారు. 


దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. 


ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూసి చూసారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేసారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకుని “అమ్మా! నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము” అన్నాడు. 


దమయంతి వారితో “నేను కూడా మీ వెంట వస్తాను” అన్నది. 


ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకు వెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి, దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోదిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకు వెళ్ళారు. ఛేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో “అమ్మా! నిన్ను చూస్తుంటే రాచకళ ఉట్టి పడుతోంది. నీవు ఎవరు?” అని అడిగింది. 


దమయంతి “అమ్మా! నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతనిని వెతుకుతూ తిరుగుతున్నాను” అని చెప్పింది. 


రాజమాత “అమ్మా! ఇకనుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ రాకుండా నేను చూస్తాను. నీ భర్తను వెతికిస్తాను” అని చెప్పింది. 


దమయంతి అందుకు అంగీకరించి “అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలీ తినను, పరులకు కాళ్ళుపట్టను, పరపురుషులతో మాట్లాడను. కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడు తాను” అని చెప్పింది. 


రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది.```


             *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనఈ రోజు పంచాంగం 21.12.2025 

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి భాను వాసర పూర్వాషాఢ నకత్రం వృద్ధి యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: ద్వితీయ 

 


నమస్కారః , శుభోదయంది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏 నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?`

  *`పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?`*


ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?


*`1. దేవ యజ్ఞం`*


పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి *ఆహుతం* అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. *సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.*


*`2. పితృ యజ్ఞం`*


మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, *అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.*


*`3. భూత యజ్ఞం`*


గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూతదయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. *సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.*


*`4. మనుష్య యజ్ఞం`*


మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు. అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. *తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.*


*`5. బ్రహ్మ యజ్ఞం`*


ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ *ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.* 


*ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.*


     *🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*

జీవిత రహస్యం

  ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️


              *జీవిత రహస్యం*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


          మానవుడు తాను ఖర్చు చేసే ధనములో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలో దానంచేసే సుగుణముంది. భగవంతుడు ఒకరికిచే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు.


             చేతులు కిందికి వాలి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది . ఇమ్ము శ్రద్ధతో ఇమ్ము నిశ్చయముగా ఇమ్ము -ఇదే జీవిత రహస్యం అని నీతిశాస్త్ర కోవిదులను అంటున్నారు.


              మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడు అవుతాడు ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు మంచి వారసత్వానికి వారసుడు అవుతాడు సమాజ క్షేమాన్ని కాంక్షించి గలుగుతాడు.


              మన చేతికి అలంకారం దానం చేయడం అది ఒక గొప్ప సౌశీల్యం దానధర్మాల విశేషంగా చేయాలి తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువ ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడు అవుతాడు మానవుడు. మనిషి జీవితం దానధర్మాల తోనే ముడిపడి ఉంది అదే అతడు దాచుకున్న సంపద అదే సద్గతిని కలిగిస్తుంది అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు జీవితం ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియదు ,అది గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మర్చిపోరు .


               పిసినిగొట్టుతనము మహా ప్రమాదకరమైన అవలక్షణం కొందర్ని మనం అంటూ ఉంటాం పిల్లికి కూడా బిచ్చం వేయడు.... కామక్రోధ,లోభాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు.


               అవి ఆత్మ వినాశనానికి దారులన్నీ వాటిని త్యాగం చేయలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలి జీవించాలి దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము కూటికి గుడ్డకు విద్యకు నోచుకోని నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు . ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి.


            మన సంపాదనలో, కనీసం 5 శాతం నుండి 10 శాతం వరకు, ధనాన్ని ఇతరులకు దానం చేద్దాము . అది తిరిగి రెట్టింపు అయ్యి10 రెట్లు మనకు తిరిగి వస్తుంది. ఒక కేజీ ధాన్యం మనము పొలములో చల్లితే, దాదాపు రెండు మూడు బస్తాల ధాన్యం వస్తుంది, అసలు ఏమి చల్లకపోతే ఏమీ రాదు.


            అదే విధముగా మనము ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకుంటే, మనకు అది తిరిగి ఏదో విధముగా చేరుతుంది . ఇది అక్షర సత్యం...... మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటే, మనం ఆనందంగా ఉండగలుగుతాము ఇది పకృతి రహస్యం. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వారే ఎవరు పరాయి వారు కాదు ఎవరితోనూ విరోధం వద్దు


  🙏జై గురు దేవ దత్త 🙏

తస్మాత్ శాస్త్రం ప్రమాణం

  "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యావ్యవస్థితౌ"


మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక, పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని,

అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది.

శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి".

మంచిమాట

🌹🙏 శుభోదయం 🌞🌹. 🌷🌹 మంచిమాట 🌹🌷. *మంచి స్వభావం ఎప్పుడూ సౌందర్యం తాలూకు లోటును భర్తీ చేస్తుంది.. కానీ సౌందర్యం మంచి స్వభావం లేని లోటును భర్తీ చేయలేదు.*👏🙏💐