30, జనవరి 2026, శుక్రవారం

జంతూనాం నరజన్మ దుర్లభం

 జంతూనాం నరజన్మ దుర్లభం అని వివేకచూడామణి లో శ్రీ ఆదిశంకరాచారులవారు వచించారు. అంటే జంతుకోటిలో అనగా 84 లక్షల జీవరాసులలో మనిషిగా పుట్టటం చాలా దుర్లభమైనది. అంతే కాకుండా ఇంకా ఆచారులవారు ఏమన్నారంటే 




జన్తూనాం నరజన్మ దుర్లభమ్ అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్


వైదిక-ధర్మమార్గపరత విద్వత్త్వం అస్మాత్ పరమ


ఆత్మనాత్మవివేకనమ్ స్వనుభవో బ్రహ్మాత్మనా సస్స్థితిః


ముకీత్ర్ణో శతకోటిజన్మసు కృతైః పునైర్వినా లభ్యతే ॥




అంటే మనిషిగా పుట్టటం కన్నా పురుషునిగా పుట్టటం అందులోను బ్రాహ్మణుడుగా జన్మించి వైదిక్ ధర్మాన్ని ఆచరిస్తూ విద్యావంతుడు అయి ఆత్మాఅనాత్మ అనే వివేకముకలిగి స్వంతంగా బ్రహ్మజ్ఞ్యానం సముపార్జించటం అనేది తత్ద్వారా ముక్తిని పొందటం అనేది శతకోటి జన్మల సుకృతం కలిగి ఉంటే కానీ లభ్యం కాదు అని పేర్కొన్నారు. 




ఈ రోజుల్లో మనం చాలామందిమి దైవానుగ్రహం వలన బ్రాహ్మణులుగా అందునా పురుషులుగా జన్మించినాము. నిజానికి ఇలాంటి జన్మను పొందటం మన పూర్వజన్మ సుకృతం కాక మరొకటి కాదు. ప్రతి బ్రాహ్మడు తెలుసుకోవలసినది ఏమిటంటే మనకు ఈ జన్మే ఆఖరు జన్మ కావలి అని. అది ఎట్లాగ అంటే ఈ జన్మను మనం సార్ధకత చేసుకొని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జన చేస్తే కచ్చితంగా అవుతుంది. ఈ సత్యం తెలుసుకోనుక అనేకమంది విప్రవర్యులు ఇతరులవాలె ఐహిక వ్యామోహాలకు సాంఘిక విషయ మొహాలకు బానిసలుగా మారి తమ విద్యుత్వ కర్తవ్యాన్ని మరచిపోతున్నారు. అలాంటి మన బ్రాహ్మణ సోదరులను తట్టి లేపి వారి ఘాఢనిద్రను వదిలించి కర్తవ్యోన్ముఖులను చేయవలసిన ధర్మం, ధర్మాచరణను ఆచరిస్తున్న ప్రతి శ్రోస్త్రియ బ్రాహ్మణుడి మీద వున్నది. కాబట్టి మనమంతా ఒక సంఘటితముగా మారి ప్రతి బ్రాహ్మణుడిని బ్రహ్మజ్ఞ్యాన సముపార్జనవైపు దృష్టిసారించే విధంగా పురిగొల్పి బ్రాహ్మణులను సత్బ్రహ్మణులుగా మార్చ ప్రయత్నం చేద్దాం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శుక్రవారం 30 జనవరి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣2️⃣0️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


     *సంపూర్ణ మహాభారతము*      

      

                 *120వ రోజు*                  

*వన పర్వము పంచమాశ్వాసము*


*అంగీరసుడు అగ్నిదేవుని పదవిని తిరిగి తీసుకొనమని చెప్పుట*```


తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుని చూసి అంగీరసుడు “అగ్నిదేవా! నీవు పాపరహితుడవు ముల్లోకాల చీకటిని పారద్రోలకలవు. బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు కనుక నీవు నీ పదవిని సంశయించక తీసుకొనుము. నేను ఈ పదవిలో ఉండలేను” అన్నాడు. 


అగ్నిదేవుడు “అయ్యా! నా కీర్తి లోకాలలో నిస్తేజమై పోయింది. ముల్లోకాలలో పూజలందుకుంటున్నావు. కనుక ఈ అగ్ని పదివి నీకే కాని నాకు పనికి రాదు. నీవు చెప్తున్నావు కనుక నీవు ప్రథమ స్థానంలో ఉండు. నేను రెండవ స్థానంలో ప్రజాపత్య అగ్నిగా ఉంటాను” అన్నాడు. 


అంగీరసుడు “దేవా! నీవు నన్ను అలా ఆజ్ఞాపించ వలదు. ప్రథమ పదవి నీదే నన్ను నీకుమారునిగా అంగీకరించి ఆదరింపుము” అని వేడుకున్నాడు. 


అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు. ఈ విధంగా అంగీరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించ సాగాడు.```


         *అంగీరసుడి వంశం*```


అంగీరసునికి భార్య శివ వలన అతనికి బృహత్కీర్తి, బృహత్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనసుడు, బృహన్మంతుడు, బృహత్భానుడు, బృహస్పతి అనే ఏడుగురు కుమారులు కలిగారు. భానుమతి,రాగ, సినీవాలి, కుహువు,నశ్చిష్మతి,మహిష్మతి, మహామతి అను ఏడుగురు కుమార్తెలు జన్మించారు. అంగీరసుని కుమారుడు బృహస్పతికి శంయుడు జన్మించాడు. యాగములలో నేతి హవిస్సును అతనికి సమర్పించే వారు. శంయుని భార్య సత్య. వారికి భరద్వాజుడు, భరతుడు అనే కుమారులు కలిగారు. భరతునకు భారతుడు అనే కుమారుడు, భారతి అనే కుమార్తె కలిగారు. భరద్వాజునకు వీరుడు పుట్టాడు. వీరునకు భానుడు అనే కొడుకు పుట్టాడు. భానునికి నిశ్ఛ్యవనుడు పుట్టాడు. నిశ్చ్యవనునికి నిష్కృతి అనే కుమారుడు పుట్టాడు. నిష్కృతి అనే అగ్నిని ఆరాధించేవాడికి పాపాలన్నీ పోతాయి. నిష్కృతికి రుజస్కరుడు పుట్టాడు. రుజస్కరునకు క్రోధుడు పుట్టాడు. క్రోధునికి రుసుడు అనే కుమారుడు కలిగాడు. రుసునికి స్వాహా అనే కుమార్తె, కాముడు అనే కుమారుడు కలిగారు. కామునికి అమోఘుడు, అమోఘునికి సక్థుడు పుట్టారు. కాశ్యపుడు, వాశిష్టుడు, ప్రాణుడు, అంగీరసుడు, చ్యవనుడు అనే అయిదుగురు తమకు తేజోవంతుడైన కొడుకు పుట్టాలని తపస్సు చేసారు. వారికి కలిగిన కుమారునికి తల నిప్పు రంగులోను, చేతులు సూర్యునిలా, కళ్ళు బంగారు రంగులో, శరీరం నలుపు రంగులో ఉంది. బలవంతుడైన అతడు అయిదుగురు తండ్రులకు జన్మించిన కారణంగా పాంచజన్యుడయ్యాడు. అతడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. అతని తల నుండి బృహద్రథంతరులు, ముఖమునుండి హరి, నాభినుండి శివుడు, బలము నుండి ఇంద్రుడు, ప్రాణముల నుండి వాయువు, అగ్ని జనించగా భుజముల నుండి దంతముల నుండి సమస్త భూతములు సృష్టించబడ్డాయి. తపుడు అనే అగ్ని నిరంతరం తపస్సు చేసి పదునైదు మంది కుమారులను కన్నాడు. కాని వారంతా కపటులు అయ్యారు. వారు వరుసగా సుభీముడు,అతి భీముడు,భీముడు, భీమబలుడు, అతి బలుడు, అను వారు ఒక పక్క సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు ఒక పక్క సురప్రవీరుడు,వీరుడు,సువేషుండు, సువర్చలుడు, సురహంత అను వారలు చేరి యజ్ఞ ఫలములు అపహరిస్తూ ఉండే వారు. వారి దుశ్చర్యలకు బ్రాహ్మణులు తరచూ అగ్ని శాంతి చేయవలసి వచ్చేది. వారి పనులకు బ్రాహ్మణులు మంత్రశక్తితో భయపెట్టి వారిని యజ్ఞశాలకు దూరంగా ఉంచే వారు. తపునకు మరి అయిదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో వైశ్వానరుడు బ్రాహ్మణులచే చాతుర్మాస వ్రతములో పూజింపబడే వాడు. రెండవ వాడు విశ్వపతి. అతడు జగత్ప్రభువు. మూడవ వాడు విశ్వకుడు. నాల్గవవాడు విశ్వభుక్కు అతను భూతములు తినే ఆహారాన్ని జీర్ణం చేసే వాడు. ఐదవ వాడు గోపతి అతడు సమస్త ధర్మక్రియలకు కారణ భూతుడు. భానుడు అనే అగ్నికి ఆరుగురు కుమారులు,నిశ అనే కుమార్తె కలిగారు. పురంధరుడు అనే అగ్నికి మనువు అనే కుమారుడు కలిగాడు. అతను నిశను వివాహమాడాడు. ఆ మనువుకే ప్రజాపత్యుడు అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా సకల విధ అగ్నులు సకల ధర్మ కార్యాలకు కారణమయ్యాయి. ఆపుడు అనే అగ్నికి ముదిత అనే కన్యకు అగ్ని జన్మించాడు. మూడు లోకాలలో జరిగే అన్ని వ్యవహారాలను ఆ అగ్ని నిర్వహిస్తున్నాడు. యజ్ఞాలలో సమర్పించే హవిస్సును దేవతలకు అందిస్తుంటాడు.```


               *సశేషం* 

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గుండె కోసం డిజిటల్ మెడిసిన్

 #బ్రేకింగ్_న్యూస్

తమిళనాడులో....

 గుండె కోసం డిజిటల్ మెడిసిన్ (గుండె మార్పిడి లేకుండా గుండెను రీసైకిల్ చేయవచ్చు)


 కత్తి మరియు రక్తం లేకుండా అల్ట్రా మోడ్రన్ ఇంగ్లీష్ మెడిసిన్.


 1) యాంజియోగ్రామ్ లేదు


 2) బైపాస్ సర్జరీ లేదు


 3) యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ లేదు


 రెండు సూపర్ ఆధునిక యంత్రాలు కనుగొనబడ్డాయి

 1)CT-700

 2)EECP


 1) యాంజియోగ్రామ్ లేకుండా గుండె అడ్డంకిని గుర్తించడానికి CT-700 అనే అత్యంత ఆధునిక యంత్రం కనుగొనబడింది.


 దీనికి రెండు నిమిషాలు సరిపోతుంది.

 దీని కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు


 ఈ ఖర్చు కూడా తక్కువ చెన్నైలో రెండు చోట్ల మాత్రమే చేస్తారు.


 ప్రారంభ దశలో గుండె అడ్డంకులు గుర్తించడం మాత్రల ద్వారా నయం చేయడానికి గొప్ప అవకాశం ఉంది.


 మరియు అది ఇప్పుడు

 2) EECP అనే అధునాతన యంత్రం ద్వారా బైపాస్ సర్జరీ మరియు స్టెంట్ లేకుండా గుండెను నయం చేయవచ్చు మరియు రీసైకిల్ చేయవచ్చు.


 ప్రభుత్వం ఆమోదించిన వైద్య వ్యవస్థ


  వివరాలు,..... తెలుసుకోవాలంటే

 శ్రీ వివేకానంద హాస్పిటల్

 చెన్నై....

 08925015666

 08778463371

 09500037040

 04443192129


   దీని వల్ల లక్షలాది మంది మధుమేహం, హృద్రోగులు ప్రయోజనం పొందారు.


  మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ దీన్ని షేర్ చేయండి.


 ఒక షేర్ చాలా మంది  ప్రాణాలను కాపాడుతుంది


  దయచేసి  షేర్ చేయండి

  🙏ధన్యవాదాలు🙏

సహాదేవుని కి కూడా భవిష్యత్తు ముందే తెలుసు కోగల శక్తి

 సహాదేవుని కి కూడా భవిష్యత్తు ముందే తెలుసు కోగల శక్తి ఉన్నదని ఈవిషయం, శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నాడని కూడా విన్నాను - నిజమేనా?

మీరు అడిగిన ప్రశ్న—"సహదేవునికి భవిష్యత్తు తెలుసు కాగల శక్తి ఉందా? శ్రీకృష్ణుడు అది ఎవరికి చెప్పవద్దని ప్రమాణం చేయించుకున్నాడా?"—ఇది కేవలం ఒక curiosity కాదు. ఇది భవిష్యవాణి, ధర్మ, బంధుత్వం, నిస్సహాయత, బాధ్యత, మౌనం అనే ఎన్నో ఆత్మీయ భావాల సమ్మేళనమైన ప్రశ్న.


భారతీయ పురాణాలలో సహదేవుడు పాండవులలో చిత్తశుద్ధి గలవాడు, శాంతమైన మనసుతో ఉండేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది – "సర్వజ్ఞత" (omniscience). ఇది ఒక శాపం వలె వస్తుంది, ఒక వరంలా కాక. ఎందుకంటే తెలిసినది మాట్లాడలేకపోవడం కంటే పెద్ద బాధ మరొకటి ఉండదు. మనం జీవితంలో కొన్ని విషయాలు ముందే ఊహించగలిగినప్పుడు కూడా, వాటిని మాట్లాడలేక నోరు మూసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం ఎంతగా లోపల తలపడతామో, అదే పరిస్థితి సహదేవునిది.


ఒక పురాణకథ ప్రకారం – సహదేవుడు తన తల్లి మాద్రి మరణించినప్పుడే భవిష్యవాణి చేసే శక్తిని పొందాడని చెబుతారు. ఆ శక్తి వల్ల అతను భవిష్యత్తును స్పష్టంగా చూడగలడు. కానీ ఈ శక్తిని ఉపయోగించడం నిషిద్ధం. ఎందుకంటే ఇది "ధర్మసంకటంలో"కి తీసుకువెళ్ళే శక్తి.


ఇక్కడే శ్రీకృష్ణుడు రంగప్రవేశం చేస్తాడు. శ్రీకృష్ణుడు నైతిక విలువల ప్రతీక. అతడు సహదేవుని భవిష్యత్తు శక్తిని గుర్తించి, ఆయన తో ప్రమాణం చేయించుకున్నాడట – “నీవు నీకు తెలిసిన భవిష్యాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు” అని. ఎందుకంటే కర్మ యాంత్రికతను చెడగొట్టకుండా, ప్రతి మనిషి తన విధి మీద నడవాలి. ఇదే గీతా సారము – "కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన".


మన దైనందిన జీవితాల్లో చూస్తే – ఒక తల్లి తన బిడ్డ పై ప్రేమ ఉన్నప్పటికి ని, కొన్ని విషయాలు ముందే తెలిసినా చెప్పకుండా ఊరుకుంటుంది. ఎందుకంటే అది చెప్పడం వల్ల బిడ్డ బలహీనంగా మారుతాడు. అలాగే, ఒక డాక్టర్ తన పేషెంట్ పరిస్థితిని బాగా తెలుసుకుని, కానీ ఆ బాధను ఊహించి కొన్ని విషయాలు తేలికగా చెప్పేందుకు కష్టపడతాడు. ఇదే మానవతా ధర్మం.


అలాంటిది సహదేవుని స్థితి ఎంత హృదయ విదారకంగా ఉండేదో ఊహించండి. కర్ణుడు తన సోదరుడు అని తెలుసు, కానీ చెప్పలేడు. ద్రౌపదిని పంచభార్యగా మారతుందని ముందే తెలుసు, కానీ మౌనంగా ఉండాలి. శ్రీకృష్ణుడే తనకు చివరికి విష్ణువు అవతారమని తెలుసు, కానీ అంతవరకు చెప్పలేడు. ఇది వేదన, ఇది భవిష్య జ్ఞానపు బాధ. ఇది వేదకాలం నుంచే వచిన తత్త్వం – “జ్ఞానం అంటే బాధ్యత.”


ఇక్కడ మనకు రెండు ప్రశ్నలు రావచ్చు –

ఒకటి: ఈ భవిష్య జ్ఞానం వరమా శాపమా?

రెండు: మనం ఇలాంటివి నమ్మాలా?


మన సమాజంలో నేటికీ పుట్టగొడుగులా astrology apps, పలానా బాబా చెబుతున్నాడట అనే వార్తలు ఉంటాయి. కానీ శాస్త్రీయంగా చూస్తే, భవిష్యవాణి అనేది ఒక speculative science – ఇది జ్యోతిషం, బౌద్ధ తత్త్వం, తాంత్రికం అన్నీ కలిసిన ఒక అంశం. కానీ ఇది సమాజ నిర్మాణంలో ఒక ధైర్యం ఇచ్చే ప్రక్రియగా మారింది. మన పూర్వీకులు భయపడకుండా ఉండేందుకు, అనూహ్య సంఘటనలకు ముందుగా మనస్సు సిద్ధం చేసుకునేందుకు ఈ కథల ద్వారా మానవ మేధస్సును పెంచారు.


సహదేవునికి తెలిసినా, చెప్పలేకపోవడం వల్లనే మహాభారత యుద్ధం జరిగింది. ఎందుకంటే, మనిషి తన కర్మనుబట్టి నడవాలి, shortcut అన్వేషించకూడదు. మనం మన బాధలను ముందుగా తప్పించుకోవడానికి భవిష్యవాణిని ఆశించే ప్రయత్నం చేస్తాం. కానీ నిజంగా ధైర్యం అంటే తెలిసినా తట్టుకునే శక్తి.


ఈ కథలో, సహదేవుడు ఒక నిరాడంబరుడు, అహంకారము లేని, జ్ఞానముతో నిండిన మనిషిగా నిలుస్తాడు. అతను ఒక walking encyclopedia లాంటివాడు, కానీ password locked. అప్పుడు మనకో గుర్తు రావాలి – “ప్రపంచంలో ప్రతి నిజం ఒక్కప్పుడు మౌనంగా ఉంటుంది, అది బయటకు రావాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తుంది.”


ఈ సమాధానం చెప్పేది ఒక వాక్యం కాదు, ఒక జీవితం. ఒక తత్వం.

మనమంతా జీవించే ఒక సందర్భం.

ఇది సహదేవుని శక్తి మీద కాదు, మానవుని మౌనంపై.

జ్ఞానం ఉన్నా, మౌనం ఉండగలగడం గొప్ప శక్తి.


✍️

*ఒక తీయని జోక్ !*

  *ఒక తీయని జోక్ !*


🥰🥰🥰


ఒకసారి ఒక అమ్మాయి ,

తన అవ్వతొ ఆమె వరండాలో కూర్చుంది.


అప్పుడు అనుకొకుండా అమె బాయ్ ఫ్రండ్ అక్కడికి వచ్చాడు.


ఆ అమ్మాయి తన ప్రియుడికి ఆమె ఇలా చెప్పింది.


"మీరు రామ్ పాల్ యాదవ్ రాసిన *Dad is at Home"* పుస్తకాన్ని తీసుకువచ్చారా?


అబ్బాయి ...

"లేదు నేను కీమతి ఆనంద్ రాసిన **Where should I wait for you?* పుస్తకాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను."


అమ్మాయి "నా దగ్గర ఆ పుస్తకం లేదు. నా దగ్గర ప్రేమ్ బాజ్ పేయి రాసిన *Under the Mango Tree* ఉంది.


అబ్బాయి "సరే మీరు ఆనంద్ బక్షి గారి "*Call You In Five Minutes* తీసుకురండి.


అమ్మాయి "సరే నేను జాన్ అబ్రహం రాసిన **Won't Let You Down* పుస్తకాన్ని తప్పకుండా తెసుకువస్తాను.


అబ్బాయి అవ్వకు నమస్కరించి 🙏🏻 వెళ్ళిపోయాడు.


అవ్వ అంది , 

*ఈ అబ్బాయి , చాలా పుస్తకాలు చదువుతాడు అనుకుంటాను.*


అమ్మాయి *వావ్ ! అవును అతను మా తరగతిలో ... చాలా తెలివైన వాడు.*


అవ్వ ..

*అవును, కాని అతను ఒక పుస్తకం చదవటం మర్చిపోయినట్టు ఉన్నాడు.*


అమ్మాయి ...

*ఏమిటది అవ్వ.*


 అతనికి మున్షి ప్రేమ్ చంద్ రాసిన ....

*Old people are not Stupid* పుస్తకాన్ని చదవమని చెప్పు. 


🤣🤣🤣🤣🤣

పంచాంగం

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏

 

   🌺*శుభోదయం* 🌺

--------------------------------------

    🌸 *మహనీయుని మాట* 🌸

--------------------------------------

నీ అంతరాత్మ భాషను తెలుసుకో

    అది నీకు సరైన సూచనలనే

                  ఇస్తుంది.

                   

--------------------------------------

🌺 *నేటి మంచిమాట* 🌺

--------------------------------------

    మన ఆలోచనలు ఎలా సాగుతాయో మన జీవనం అలా రూపుదిద్దు కుంటుంది. అదే "యద్భావం తద్భవతి". కనుక పాజిటివ్ ఆలోచనలతో పాటు అందరితో ఆత్మీయతతో మెలుగుదాం తద్వారా అందరి నుండి ఆత్మీయతను పొందుదాం. ప్రేమను పంచుదాం, ప్రేమను పొందుదాం, ఏది ఇస్తామో దానిని పొందుతాం. ఏది తీసుకుంటామో దానిని పంచుదాం. ఇదే భగవంతుని చట్టం, ఈ సత్యాన్ని ఎప్పుడూ మరవకండి. "చేసింది పోదు చెయ్యంది రాదు" మొత్తం జీవితం ఈ ప్రకృతి నియమాలలోనే నడుస్తుంది.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌹పంచాంగం🌹

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 30 - 01 - 2026,

వారం ... భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

మాఘ మాసం,

శుక్ల పక్షం,

 

తిథి : *ద్వాదశి* ఉ9.52 వరకు,

నక్షత్రం : *ఆర్ద్ర* తె3.04 వరకు

యోగం : *వైధృతి* సా4.40 వరకు,

కరణం : *బాలువ* ఉ9.52 వరకు,

                 తదుపరి *కౌలువ* రా8.48 వరకు,


వర్జ్యం : *మ12.25 - 1.55*

దుర్ముహూర్తము : *ఉ8.52 - 9.37*

                               మరల *మ12.36 - 1.21*

అమృతకాలం : *సా5.41 - 7.11*  

రాహుకాలం : *ఉ10.30 - 12.00* 

యమగండం : *మ3.00 - 4.30*

సూర్యరాశి : *మకరం* 

చంద్రరాశి : *మిథునం*

సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50,


                *_నేటి విశేషం_*

                *భీష్మ ద్వాదశి*

*భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి??*

మాఘ మాసంలోని శుక్ల పక్షంలో భీష్మ ద్వాదశి జరుపుకుంటారు. 

ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ ఉపవాసం ఉంటారు.

మన పురాణాల ప్రకారం, భీష్మ పితామహుడు భీష్మ అష్టమి రోజున అష్టమి తిథి నాడు తన శరీరాన్ని త్యాగం చేసాడు, కానీ ద్వాదశి తిథిని అతని కోసం అన్ని ఆచారాలు మరియు మతపరమైన కార్యకలాపాలను నిర్వహించడానికి అతని నిర్వాణ దినోత్సవాన్ని ద్వాదశి నాడు జరుపుకుంటారు.


*🌹భీష్మ ద్వాదశి కథ : 🌹*

మహాభారతంలో, భీష్మ పితామహుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నాడు. 

పాండవులు భీష్ముడిని ఓడించడం అసాధ్యం, ఎందుకంటే భీష్ముడు చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడే చనిపోయే వరం పొందాడు.

యుద్ధంలో, భీష్మ పితామహుడి నైపుణ్యాల కారణంగా కౌరవులు ఓడిపోలేరు. 

భీష్ముడిని ఓడించడానికి ఒక ప్రణాళిక వేయబడింది. 

ఈ పథకం యొక్క కేంద్ర బిందువు శిఖండి, పితామహుడు స్త్రీ ముందు ఎప్పుడూ ఆయుధాలు ఎత్తనని ప్రతిజ్ఞ చేశాడు. 

అందువల్ల, పాండవులు ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నప్పుడు, వారు భీష్ముడిని మోసం చేస్తారు. 

యుద్ధ సమయంలో, వారు శిఖండిని భీష్ముని ముందు ఉంచారు. 

అతని ప్రతిజ్ఞ ప్రకారం, అతను ఆయుధాలు ఎత్తడు. 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపించడం ప్రారంభిస్తాడు. 

చివరికి, పితామహుడు కుప్పకూలి బాణాల మంచం మీద పడుకుంటాడు.

కానీ ఆ సమయంలో భీష్మ పితామహుడు సూర్య దక్షిణాయణం కారణంగా తన ప్రాణాలను వదులుకోలేదు.

సూర్యుడు ఉత్తరాయణంలోకి మారినప్పుడు మాత్రమే అతను తన శరీరాన్ని త్యాగం చేస్తాడు. 


భీష్మ పితామహుడు అష్టమి నాడు తన ప్రాణాలను త్యాగం చేస్తాడు...

అయితే, మాఘ మాసంలోని ద్వాదశి తేదీని అతని పూజ కోసం నిర్ణయించారు. 

ఈ కారణంగా, మాఘ మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి తిథిని భీష్మ ద్వాదశి అంటారు.


*🌹భీష్మ ద్వాదశి పూజ విధానం🌹*

ఉదయాన్నే నిద్రలేచి, అన్ని పనులు ముగించుకుని, స్నానం చేసి, విష్ణువు మరియు సూర్యభగవానుడిని పూజించాలి.


భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు మరియు కుశతో తర్పణం చేయాలి. 

తర్పణ కర్మను అర్హత కలిగిన బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు,

పేదలకు ఆహారం మరియు నూతన వస్త్రాలు ఇవ్వాలి,

సాంప్రదాయకంగా ఈ రోజున పూర్వీకులను కూడా పూజిస్తారు,

ఈ రోజున భీష్మ కథ వినాలి. 

ఈ రోజున పూజలు చేయడం వల్ల వ్యక్తి బాధలు తొలగిపోతాయని మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు 


ఈ పూజ పితృ దోషాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

భీష్మ ద్వాదశి నాడు నువ్వులను దానం చేయండి భీష్మ ద్వాదశి రోజు నువ్వుల దానం యొక్క ప్రాముఖ్యతను కూడా సూచిస్తుంది. 

ఈ రోజున నువ్వులను కూడా ఉపయోగిస్తారు. 

నువ్వులు నిండిన నీటితో స్నానం చేయడం మరియు నువ్వులు దానం చేయడం రెండూ చాలా మంచివని చెబుతారు.


నువ్వులు దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది. విజయానికి ద్వారాలు తెరుచుకుంటాయి. 

స్వచ్ఛమైన నువ్వులను సేకరించి, తమ శక్తి మేరకు బ్రాహ్మణులకు దానం చేయాలి. 

నువ్వులను దానం చేయడం వల్ల కలిగే ఫలం అగ్ని యజ్ఞం లాంటిది. నువ్వుల దానానికి తగిన ఫలితం లభిస్తాయి. 


*భీష్మ పితామహుడికి "మరణాన్ని కోరుకునే" వరం ఎందుకు వచ్చింది?🌹*

మహాభారత కథ ప్రకారం, హస్తినాపురములో శంతనుడు అనే రాజు ఉండేవాడు. 

అతని భార్య పేరు గంగ మరియు వారికి దేవరత్న అనే కుమారుడు జన్మించాడు. 

దేవవ్రతుడు జన్మించిన తర్వాత, ఆమె ఇచ్చిన మాట ప్రకారం, గంగ శంతనుడిని వదిలి వెళుతుంది. 

శంతనుడు ఒంటరిగా మిగిలిపోతాడు. 

ఒకసారి రాజు శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని కలుస్తాడు, ఆమె అతన్ని ప్రేమిస్తుంది. 

సత్యవతితో వివాహ ప్రతిపాదనతో సత్యవతి తండ్రి వద్దకు వెళ్తాడు, సత్యవతి తండ్రి అంగీకరిస్తాడు కానీ సత్యవతి పిల్లలను మాత్రమే రాజ్యం వారసులుగా చేయాలనే షరతు పెడుతుంది, రాజా శంతనుడు ఈ షరతును తిరస్కరిస్తాడు. 

కానీ కొడుకు దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు, అతను అవివాహితుడిగానే ఉంటానని మరియు సత్యవతి పిల్లలకు రాజ్యాన్ని వారసత్వంగా ఇస్తానని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. 


దీని తరువాత, సత్యవతి శంతనుడిని వివాహం చేసుకుంటాడు. 

కొడుకు కఠినమైన ప్రమాణాలను విన్న రాజు శంతనుడు దేవవ్రతకు(భీష్మ )

ఇష్టపూర్వకంగా మరణించే వరం ఇస్తాడు...

*🌹ఈ ప్రతిజ్ఞ కారణంగానే దేవవ్రతకు భీష్ముడు అనే పేరు వస్తుంది.*

భీష్ముడు అష్టమి నాడు ప్రాణాలను వదులుకున్నాడు, కానీ ద్వాదశి నాడు పూజించబడ్డాడు.

మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే భీష్మ ద్వాదశి తిథి తర్పణం మరియు పూజలకు చాలా ముఖ్యమైనది. 

ఈ రోజున స్నానం తర్పణం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. 

ఈ రోజును తిల ద్వాదశి అని కూడా అంటారు. 

కాబట్టి, ఈ రోజున దానములు మరియు నువ్వుల వినియోగం రెండూ మంచివి. 

పాండవులు ఈ రోజున పితామహ భీష్ముని అంతిమ సంస్కారాలు నిర్వహించరని , ఈ రోజున పితృదేవతలకు తర్పణం మరియు శ్రద్ధ చేయడం వల్ల వారి ఆత్మలకు చాలా శాంతి లభిస్తుంది.

భీష్మ ద్వాదశి రోజున భగవన్నామ స్మరణ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కాకుగుతాయి అని, ద్వాదశి నాడు విష్ణువును కూడా పూజిస్తారు. 


పేదలకు వారి సామర్థ్యం ప్రకారం ఆహారం మరియు కావలసిన వంట సామగ్రి అందించటం వల్ల సిరి సంపదలు పెరుగుతాయి ద్వాదశి రోజున స్నానం మరియు దానం చేయడం వల్ల ఆనందం, అదృష్టం మరియు కీర్తి లభిస్తాయి.


                     స్వస్తి..🙏

           *_🌹శుభమస్తు🌹_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - ఆర్ద్ర -‌‌ భృగువాసరే* (30.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

30జనవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🌹 _*శుక్రవారం*_ 🌹

  *🪷30జనవరి2026🪷*      

    *దృగ్గణిత పంచాంగం* 

                 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : ద్వాదశి* ‌ఉ 11.09 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : శుక్రవారం*(భృగువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* రా.తె 03.27 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : వైధృతి* సా 04.58 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : బాలువ* ఉ 11.09 *కౌలువ* రా 09.46 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.45 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*సా 06.18 - 07.46*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.44*

*వర్జ్యం    : మ 01.10-02.38*

*దుర్ముహూర్తం  : ఉ 08.56 - 09.41 మ 12.44 - 01.29*

*రాహు కాలం   : ఉ10.55- 12.21*

గుళికకాళం      : *ఉ 08.04 - 09.30*

యమగండం    : *మ03.12 - 04.37*

సూర్యరాశి : *మకరం*                      

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.49*  

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.39 - 08.55*

సంగవ కాలం         :*08.55 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.29*

అపరాహ్న కాలం    : *మ 01.29 - 03.46*

*ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :*సా 03.46 - 06.03*

ప్రదోష కాలం         :*సా 06.03 - 08.34*

రాత్రి కాలం           :*రా 08.34 - 11.56*

నిశీధి కాలం          :*రా 11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.48*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*కాళీ కరాళవక్త్రాంతా* 

*కామాక్షీ కామదా శుభా*


            *🪷ఓం శ్రీ🪷*

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 12వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 30 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 12వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *30వ తేదీ శుక్రవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణంలోని పన్నెండవ అధ్యాయంలో, ధనపిపాసి సుమందుడు, దయగల కుముద అనే శూద్ర దంపతుల కథ ద్వారా ధర్మం యొక్క విశిష్టతను చాటి చెబుతుంది. భార్య కుముద మాఘ స్నానం చేయగా, కోపంతో ఆమెను కొట్టబోయిన సుమందుడు కూడా నీటిలో పడి మునిగిపోయి, తెలియకనే మాఘ స్నానం చేస్తాడు. మరణానంతరం కుముదను విష్ణులోకానికి, సుమందుడిని యమలోకానికి తీసుకువెళ్లగా, చిత్రగుప్తుడు సుమందుడి బలవంతపు మాఘ స్నానం వల్ల పాపాలు తొలగి, అతను కూడా విష్ణులోకానికి అర్హుడని నిర్ధారించడం ద్వారా, తెలియక చేసిన మంచి పనులు కూడా మనకు శుభ ఫలితాలిస్తాయని ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది```


        *శూద్ర దంపతుల కథ..*```


వశిష్ఠ మహర్షి దిలీపునితో “మహారాజా మరియొక కథను వినుము. ‘సుమందుడను శూద్రుడు ఒకడు ఉండెడివాడు. అతడు ధన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకను సంపాదించ లేకపోవుచున్నానని విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచి వ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. “అమ్మా నేను బాటసారిని అలసిపోయిన వాడను, చలి, చీకటి మిక్కుటముగ నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్లిపోదునని” ఇంట నున్న కుముదను అడిగెను. 


ఆమెయు అతని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమాని అయినా సుమనందుడు వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల చావిడిలో ఒక చోట బాగు చేసి కంబళి మున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు ప్రాతఃకాలమున లేచి హరి నామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను.


కుముద “ఓయీ నీవు ఎచటినుండి వచ్చుచున్నావు ఎచటికి పోవుచున్నావని యడిగెను. 


అప్పుడా విప్రుడు “తుంగభద్రా తీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘ మాసమున పుణ్య నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందు కొరకు ఇట్లు వచ్చి ఉన్నాను” అని సమాధానము ఇచ్చెను. 


ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన నదికి పోవలయునని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసిరావలెననుకొనెను. 

తన అభిప్రాయమును చెప్పగ బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. 

సుమందుడింటికి వచ్చెను.

కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు ‘నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును వలదు’ అని అడ్డగించెను. 


కుముద భర్తకు తెలియకుండ బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. 


సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి. నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. 


ఈ విధముగా నా దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచుకొట్టుచు ఇంటికి తీసికొని వచ్చెను. 


ఆ బ్రాహ్మణుడును స్నానము చేసి దేవత అర్చన చేసికొని తన దారిన తాను పోయెను. 


కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున శ్రీ విష్ణు దూతలు విమానముపై వచ్చి కుముదను విమానమున ఎక్కించి ఆమె భర్తను యమ భటులకు విడిచిరి.

అప్పుడామె విష్ణు దూతలారా ! నామాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమ లోకమునకు తీసికొని పోబడుచున్నాడు. అతని భార్య అయిన నేనును అతనికి భయపడి ఎటువంటి  పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో బాటు యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొనిపోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు  అమ్మా నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగ నరకమునకు పోవలసియున్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని నీ భర్తకు ఏదురు చెప్పలేదు. కాని మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు.

ఇంతే గాక మాఘమాస స్నానమును కూడ మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నొందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడామే నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా !  మా పెనుగులాటలో మూడుసార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా ! బలవంతముగ చేసినను ఇష్టము లేక చేసినా కూడా  మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా? ఆవిధముగా చూసినా నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో పలుమార్లు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతోబాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.

అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని పట్టికలో అన్నియును పాపములే కాని మాఘ మాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టపోయి నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసికొని రావలెనని ప్రయత్నమున, నీటిలో పలు మార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను బలవంతముగ మాఘమాసమున నదిలో పలు మార్లు మునుగుటచే ఇతని  పాపములు పోయి విష్ణు లోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణు దూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమును గొనిపోయిరి. రాజా! బలవంతముగ నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగ పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును చేరు పుణ్యమువచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీస్నానము చేసి, యిష్ట దేవతార్చనము చేసి  

మాఘపురాణమును చదువుకొని, యధాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము.

మానవుడు తెలిసికాని, తెలియకకాని బలవంతముగ దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగ చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవజన్మ దుఃఖ భూయిష్టము పాపబహుళము. ఇట్టివారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగడం సహజము. తప్పని సరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింప వలయును, తన పనులను నూరింటిని అయినను వదలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లుకాక స్నానము, పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును.

మాఘమాసమున ఒకదినమైనను స్నానము పూజా, పురాణశ్రవణము, దానము యధాశక్తి గా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందులవలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసినవానికి పునర్జన్మ వుండదు. వానికి మోక్షము కలుగును. ప్రయాగయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ ప్రభాస, కోణభద్ర, గౌతమీ యిత్యాది నదులయందు స్నానము చేసినను, కూడ ఇంతటి పుణ్యమే కలుగును. మానవులు అందరూ వారు ఎటువంటి వారయినను మాఘస్నానము పూజ, పురాణ శ్రవణము, దానము వాటి అన్నిటినికాని, కొన్నిటిని యధా శక్తిగ చేయుటయే వారికి పాప తరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము” అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను.```


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*మాఘపురాణం పన్నెండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।।



ప్రతిపదార్థ:


యదా — ఎప్పుడైతే; తే — నీ యొక్క; మోహ — మోహము ; కలిలం — క్లిష్టపరిస్థితి (ఊబి); బుద్ధిః — బుద్ధి; వ్యతితరిష్యతి — దాటిపోవును; తదా — అప్పుడు; గంతాసి — నీవు పొందెదవు; నిర్వేదం — వైరాగ్యమును; శ్రోతవ్యస్య — ఇంకా వినబోయే దానికి; శ్రుతస్య — ఇప్పటి దాక విన్న దానికి; చ — మరియు.


 తాత్పర్యము :



మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).

  

 వివరణ:


ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు, భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే, వేదాలలోని ఆడంబరమైన కర్మ కాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులౌతారు, అని శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిఉన్నాడు (2.42-2.43వ శ్లోకాలు). కానీ, ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వాడు, భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకొని, వాటిని వాంఛించడు. అలాంటి వ్యక్తికి వైదిక కర్మ కాండల పట్ల ఆసక్తి పోతుంది. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది.


పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన (1.2.12)


‘కామ్య కర్మల ద్వారా పొందిన ఇహపరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకొని, జ్ఞాన-సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు.’

ఆర్యా శతకం - 1*

 🙏🙏🙏🙏


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 14*


*అధికాంచి పరమయోగిభిరాది మపరపీఠసీమ్ని దృశ్యేన।*

*అనుబద్ధం మమ మానస మరుణిమ సర్వస్వసంప్రదాయేన ॥*


*భావము :*


*అమ్మా, ఈ సకల ప్రపంచమును నీవు తన రక్త వర్ణములో ముంచి వేస్తావు. అటువంటి ఎరుపు వర్ణములో, కాంచీ పురములో నెలకొన్న నిన్ను యోగీశ్వరులు, ఏ రూపములో సందర్శిస్తారో, ఆ రూపముతో ఉన్న మాత నన్ను కరుణించుగాక.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

పంచాంగం 30.01.2026 Friday,



 

పంచాంగం 30.01.2026 Friday,

 ఈ రోజు పంచాంగం 30.01.2026 Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భృగు వాసర ఆర్ద్ర నక్షత్రం వైదృతి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: త్రయోదశి


 

నమస్కారః , శుభోదయం

29, జనవరి 2026, గురువారం

సాధన చతుష్టయ సంపత్తి. 40 .

 సాధన చతుష్టయ సంపత్తి. 40 .      

( మహావాక్యముల విచారణ )


మనం వేదాన్త విషయాలు చదువుతున్నప్పుడు, ' అసలు కొరుకుడు పడడం లేదు, కొద్దిగా కష్టంగా, విషయం అయితే అర్ధమైనట్లే వుంటున్నది కానీ, పూర్తిగా చదివిన తరువాత, చదివినది నిలబడడం లేదు, ఇది మనకు సంబంధించినది కాదేమో అనిపిస్తుంది. ' అని ఇలాంటి స్పందనలు తరుచుగా వింటూ ఉంటాము.


దీనికి సంబంధించిన వివరణ, ఆదిశంకరులు, ' వివేక చూడామణి ' లో విశదంగా చెప్పడం జరిగింది, సంస్కృత శ్లోకాల ద్వారా. వీటిని మన సౌలభ్యం కోసం, సులభమైన శైలి లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఓం శ్రీగురుభ్యోమ్ నమ :


ఆత్మ తత్వాన్ని గురించి, జగద్గురువులు చెబుతున్నారు.


* * *

శ్లో.  

అంతభేదమనపాస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం /

      నిత్యముక్తమవిభక్తమూర్తి యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని // 260 .


శిష్యా ! భేదములను పోగొట్టగలదీ, సచ్చిదానంద స్వరూప లక్షణము కలది, అలలు లేని సముద్రము వలే నిశ్చలంగా వున్నదీ, బంధ రహిత స్వరూపమైనట్టిది అయిన అఖండ తత్వముగల ఏబ్రహ్మము వున్నదో, ‘ అది నీవే ‘ అనే నిశ్చయమైన విచారణలో వుండుము. 


* * *

ఆత్మకు, జీవుడు - ఈశ్వరుడు, జగత్తు - బ్రహ్మము, జ్ఞానము - అజ్ఞానము, సుఖము - దుఃఖము, నీవు - నేను అనే భేదభావనలు వుండవు.    


సముద్రములో అనేక కెరటాల తాకిడివున్నా, కెరటాలు లేక నిశ్చలంగావున్నా, సముద్ర అంతరంగం ఏ అలజడి లేకుండా నిశ్చలంగా, గంభీరంగా, అపారంగా ఎలా కనబడుతున్నదో అదేవిధంగా, అజ్ఞానంచే మొదట అంత : కరణము అలజడులకు గురి అయినా, జగత్తు నానావిధమైన రూపాలతో కనబడుతున్నా, జ్ఞానదృష్టితో చూడడం మొదలుపెట్టినవానికి, కల్లోలరహితంగా కనిపిస్తుంది.  


అదే ‘ బంధరహిత స్థితి. ముక్తస్వరూపము. అవిభక్త స్వరూపము. ‘ అట్టి పరబ్రహ్మమే నీవు అయివున్నావు, అనే భావన వదలకుము. ఇదే పరమ విజ్ఞానపదము.  


* * *

శ్లో.  

ఏకమేవ సదనేక కారణం కారణాంతరనిరాస్య కారణం /

      కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మతత్వమసి భావయాత్మని // 261 .


పరబ్రహ్మము ఒక్కటే, అన్నికారణములకు మూలమైవున్నది. ఒకే పరబ్రహ్మము సత్వగుణ ప్రధానంగా నిమిత్త కారణం గానూ, తమోగుణ ప్రధానంగా ఉపాదాన కారణంగానూ వున్నది.    


శ్రుతులు చెప్పినట్లు పరబ్రహ్మమునకు, వేరొక కారణవస్తువు లేదు. తనకు తానే కారణం. ఆమాటకు వస్తే, పరమాత్మ తత్త్వం తెలియ జేయడానికి విజ్ఞులు కార్యకారణ సూత్రమును పరబ్రహ్మమునకు ఆపాదిoచారు కానీ, నిరుపాధికమగు పరబ్రహ్మము కార్యకారణ విలక్షణము. 


బ్రహ్మము స్వయం ప్రకాశకము. ఆ బ్రహ్మమే నీవు అయితివి. నేను ఫలానా నామధేయము కలవాడిననే జ్ఞానం మానవునకు ఎలా నిరపేక్షికమైనదో, సంశయ రహితమైనదో, అదే విధంగా, ‘ బ్రహ్మజ్ఞానికి, నేను బ్రహ్మమును అనే భావన సందిగ్ధము లేనిది. అనగా నిశ్చయమైనది. ‘


* * *

ఏ పరబ్రహ్మము సంకల్ప, వికల్ప రహితమో, మహా గొప్పదో, నాశ రహితమో, నశించే వాటికీ లౌకిక విషయాలకు వేరుగా వుంటుందో, ఏది శ్రేష్టమో, ఏది శాశ్వతమో, ఏది అపార సుఖమో, నిర్లిప్తమో, మాయారహితమో,అట్టి పరబ్రహ్మము నీవే అయి వున్నావు. ఈ విధంగా నిరంతరమూ నీ హృదయంలో భావించు.  


ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతువునకు, తొమ్మిదిసార్లు ‘ తత్వమసి ’ మహావాక్యాన్ని బోధించాడు.   


అదే విధంగా జగద్గురువులు, తమ శిష్యగణంపై ప్రీతితో, అంతకన్నా ఎక్కువసార్లు ఆ వాక్యార్ధాన్ని వివరిస్తున్నారు.


* * *

స్వస్తి.  

ఆదిశంకరుల అనుగ్రహంతో మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు ప్రభాకర్.


* * *

About Sri Anandamayi Ma (1896-1982)

Sri Anandamayi Ma was one of the greatest spiritual figures of the 20th century, widely revered as a saint, a guru, and an incarnation of God. 


Her devotees ranged from prime ministers and great saints down to the simplest villagers. People came to India from all over the world to simply see her and sit in her presence. Though virtually she was not having formal education,, she spoke with the authority of direct experience and captivated all with her sweetness and power. 


Although she never gave a lecture or established an institution, many Ashrams and Schools were set up in her name throughout India. To this day, all those who turn to her, feel both her presence and her guidance. Her life and teachings are an inspiration to all who feel drawn to the spiritual path.


* * *

Born into a prestigious but poor Brahmin family in rural Bengal on August 30, 1896, Ma was given the name, Nirmala Sundari Devi, the Goddess of Taintless Beauty. Her father, Shri Bipin Bhattacharya, spent most of his time absorbed in worship and devotional chanting while her mother, Mokshada Sundari Devi, was the epitome of dignity and devotion to her family’s welfare. 


Nirmala’s birth was preceded by many miraculous signs and visions and she exhibited perfect awareness and consciousness from the day she was born. 


She never uttered a cry, but was peaceful and radiant, surprising people who were present at the time of her birth.


At each stage of life, ‘ Ma ‘ spontaneously manifested an example of perfection in fulfilling her particular role. Even as a toddler, Nirmala was often seen in states of spiritual ecstasy, especially during kirtan, or devotional singing.  


As a small girl, she was the embodiment of sweetness and beauty, manifesting no desire of her own, but living to serve others, seeing only the One in All. 


* * *

The traits of absolute obedience, and perfect purity manifested in all her behaviour, along with the mystical quality of absorption in inner yogic states and visions. Her irresistibly cheerful and loving nature made her a favourite among Muslim and Hindu villagers alike and she delighted everyone by fulfilling their desires.


On occasion, while playing with her friends, she would become immobile, and with her face shining with inner effulgence and divine mantras would issue from her lips in flawless accents. 


When listening to kirtan, she would enter into a deep inner state with tears streaming down her face. She took complete joy in nature, always happiest when she was outside where she could commune with animals, plants, and trees as her intimate friends.


💐🙏💐

శ్రీదత్త పురాణము (27)

 శ్రీదత్త పురాణము (27)


పతంగం : యదువల్లభా ! పతంగమంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరోరకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసీ నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ (స్త్రీ) హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడు లోనై అలాగ బలైపోతున్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసికూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు.


మధుకరం : మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వు పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్టనింపు కుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్టపోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపునిండిన తక్షణం ఆ పూటకు మధూకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధూకర వృత్తిని ఆవలంభించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించేవారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడ బెట్టకూడదు. ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి.


ఏనుగు : నువ్వు రాజువి కాబట్టి, అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి, దాని మీద సన్నని కర్రలు వేసి, వాటి మీద గడ్డి పరచి, దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి, మీ రాజుభటులు చుట్టు పక్కల పొదలలో దాగి, పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపు టేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి, పరస్పరం పోరాడుకొని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశానికి దారితీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియజేస్తోంది.