స్నేహితులు లేని వారు అరుదుగా ఉంటారు. ఒకరోఇద్దరో స్నేహితులందరికీ ఉంటారు. కాస్త నడక, మాట వస్తే చాలు స్నేహం కోసం ఆ ప్రాణి ఎదురుచూస్తుంది. కేవలం మనుషులకే కాదు జంతువుల్లో కూడా స్నేహాన్ని చూస్తుంటాం. నోరు లేని ప్రాణులే స్నేహం కావాలనుకొంటే ఇక మనసు, నోరున్న మనం స్నేహం కోసం అర్రులు చాస్తాం అంటే వింతేమ్తుంది? విచిత్రమేముంది? స్నేహమేరా జీవితం! స్నేహమేరా శాశ్వతం !! అని పాడుకున్నదే అందుకుకదా!?
స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి. 98 ఏళ్ల వృద్ధునికి తన చిన్ననాటి స్నేహితుడు ఎదురైతే చాలు అప్పటిదాకా కదలలేక పడి ఉన్నా సరే చిటుక్కున లేచి కూర్చుంటాడు. చిరునవ్వుతో పలుకరిస్తాడు. అంతటి శక్తి స్వచ్ఛత ఒక్క స్నేహానికే ఉన్నయ్.
స్నేహం గురించి కేవలం చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటే లౌకికంగానే కాదు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు కూడా మాట్లాడుతారు.
చెడు మార్గంలో వెళ్లేవారిని మంచి మార్గంలో తెప్పెంచే శక్తి ఒక్క స్నేహానికి మాత్రమే ఉంది. కుటుంబంలో ఉన్న బంధుత్వాల దగ్గర మొదలయ్యే బాధను స్నేహితులకు చెప్పి దూరం చేసుకొంటారు. అమ్మనాన్న, ఉపాధ్యాయులు , అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు ఆఖరికి దాంపత్యబంధం కన్న గొప్పది స్నేహబంధం.
ఎటువంటి సమస్యనైనా స్నేహితునితో పొరపొచ్చాల్లేకుండా చర్చించుకోవచ్చు. అహానికి అక్కడ చోటే ఉండదు. స్నేహంలో ఎక్కువతక్కువలుండవు. పేదవాడు గొప్పధనవంతునితో స్నేహహస్తాన్ని కలుపవచ్చు. బాగా చదువుకున్నవారు అసలు చదువే లేని పామరునితో అత్యంత గాఢంగా స్నేహం చేయవచ్చు.
స్నేహానికి కాలంతో కూడా పట్టింపుండదు. వయస్సు తేడా రాదు. ఎవరి హృదయమైనా స్నేహం అనే మాటను పలికితే చాలు ఆ స్నేహమాధుర్యంతో ఆ హృదయశోకమంతా మాయమైపోతుంది. స్నేహం ఒక్క తరానితో ఆగిపోదు. తరతరాలకు తరగని గనిలా అందుతుంది.
మంచిస్నేహితుడు కష్టనష్టాల్లో అండగా ఉంటాడు. స్నేహానికి అవధులుండవు
🤝🤝🤝🤝🤝🤝🤝
*స్నేహితులు దినోత్సవ.. శుభాకాంక్షలు*💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి