21, నవంబర్ 2020, శనివారం

కార్తీకపురాణం 7 వ అధ్యాయము*

 *కార్తీకపురాణం 7 వ అధ్యాయము*


🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*శివ కేశ వార్చనా విధులు*


వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. 

శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను. 


*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*

*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.*

   🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: