*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 21 / Sri Devi Mahatyam - Durga Saptasati - 21 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 5*
*🌻. దేవీ దూతసంవాదం -6 🌻*
111. ఓ శోభనాంగీ! దేవతల, గంధర్వుల, నాగుల వద్ద ఉన్న రత్నతుల్యాలైన ఇతర వస్తువులన్ని ఇప్పుడు నా వద్దనే ఉన్నాయి.
112. ఓ దేవీ! మేము నిన్ను ప్రపంచ స్త్రీలందరిలో రత్నసమానమైన
దానిగా తలచుచున్నాం. అటువంటి నీవు నన్ను చేరు. రత్నతుల్యములైన వస్తువుల నంన్నిటిని అనుభవించేవారం మేమే కదా.
113. ఓ క్రాలుగంటీ! నీవు రత్నసమానవడం చేత నన్ను గాని, మహాపరాక్రమశాలి అయిన నా తమ్ముడు నిశుంభుణ్ణి గాని సేవించు.
114. నన్ను పెళ్ళాడితే, అసమాన మహాసంపద నీకు లభింస్తుంది. నీ మదిలో ఇది చక్కగా ఆలోచించుకుని నా భార్యవు కమ్ము.
115-116. ఋషి పలికెను : ఇలా చెప్పగా, ఈ జగత్తును భరించే శరణ్య, శుభంకరి అయిన దుర్గాదేవి లోననవ్వుకొని గంభీరంగా ఇట్లనెను :
17–118. దేవి పలికెను: నీవు సత్యాన్నే పలికావు. ఈ విషయంలో నీవు కొద్దిపాటి అసత్యమైనా చెప్పలేదు. శుంభుడు త్రైలోక్య సార్వభౌముడే. నిశుంభుడూ అట్టివాడే.
119. కాని ఈ విషయంలో నేను దృఢనిశ్చయంతో ఆడిన మాటను బొంకు చేయడమెలా? మునుపు నేను అల్పబుద్ధినై చేసిన ప్రతిజ్ఞను విను.
120. యుద్ధంలో నన్ను ఎవడు ఓడిస్తాడో, నా గర్వాన్ని ఎవడు పోగొడతాడో, నా బలానికి లోకంలో సమానుడెవడో, అతడే నాకు భర్త అవుతాడు.
121. కాబట్టి ఇక్కడకు శుంభుడైనా, నిశుంభ మహాసురుడైనా వచ్చు గాక, నన్ను ఓడించి నాతో వెంటనే పాణిగ్రహణం చేయు గాక. జాగు ఎందుకు?
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి