21, నవంబర్ 2020, శనివారం

వేమన పద్యం *


 వేమన పద్యం *


తనువ  దెవరిసొమ్ము తనదని పోషింప, 

ధనమదెవరిసొమ్ము  దాచుకొనగ, 

ప్రాణ  మెవరిసొమ్ము పాయకుండగ  నిల్ప, 

విశ్వదాభిరామ వినురవేమ *


భావము =


మనిషి జన్మ పలు జన్మల పుణ్య సిద్ధి యని ఆర్యోక్తి. అలాంటి మనిషి పై, అతనిపై అతనికే అధికారములేదు, అది అంతా ఆ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడు లీల. ఆయనే అన్ని నీకు సమకూర్చుతాడు, హరింపచేస్తాడు. ఈ సుందరమైన దేహం దేవుడిచ్చిన బహుమానం.  దీన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటాము. ఎన్నాళ్లు  ఉంటామో ఈ సుందర రూపంతో తెలియని మనిషి తన అశాశ్వత రూపాన్ని ఎంతో ఆపురూపంగా చూచుకొన్నపటికి, ఆ దైవం ఆజ్ఞ కాగానే, నీది అనుకొన్న తనువు విడచి పోవాలిసిందే, ఇది అంతా నాది అనే ఆశతో దాచుకొన్న ధనము అంతా పరాధీనమై పోతుంది, ప్రాణము ను పోకుండా ఆపలేము, ఈ తనువు, ధనము, ప్రాణము,  అన్ని ఆ భగవంతుడు ఇచ్చినవి, ఈ లోకంలో ఆయన పిలవగానే అన్నిటిని విడచి ఆయన సన్నిధికి చేరుకోవలిసిందే.వున్న కొన్నినాళ్లు తోటి మనిషిని ప్రేమిస్తూ, సఖ్యత తో విరోధము లేక  జీవనమ్ సాగించటమే మనిషి ధర్మం.   ఇది ఈ నాటి వేమన పద్య భావన.


మీరు రాజబాబు 😷🎹🎼🎤

కామెంట్‌లు లేవు: