🌹💐🥀🙏🌸🌷🌺🌾
*ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి*
*సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహా*
మామూలుగా పత్తినుంచి తీసిన సన్నని దారపుపోగును మూడుసార్లు మూడువేళ్ల చుట్టూ తిప్పితే వత్తి తయారవుతుంది.
ఈ తరహా వత్తిని ప్రమిదలో వేసి ఒక కొన పైకి వచ్చేలా పెడతారు. అక్కడ నూనెతో తడిపి దీపం వెలిగిస్తారు.
మూడువత్తులను కలిపి ఒక వత్తిగా చేసి, త్రివర్తి సంయుక్తంగా దీపం వెలిగించాలని తద్వరా గృహంలో మంగళప్రదంగా ఉంటుందని దీపారాధన శ్లోకం తెలియచేస్తూ ఉంది. అది ఆచరించటం సాంప్రదాయం.
కొందరు రెండు లేదా అయిదు వత్తులు కూడా పెడతారు. అది సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. మరికొందరు కుంభం వత్తి లేదా బొడ్డువత్తి తయారుచేస్తారు. క్రిందగుల్లగా ఉండి ఒకటే కొసపైకి తేలి గరాటులా కనిపించే వత్తి అది. దానిని ప్రమిద మధ్యలో వెలిగిస్తారు కుంభం వత్తిని సాధారణంగా ఒకటికి మించి వెలిగించరు.
*దేవస్య పార్శ్వయోః దీపానుద్దీప్య అని గృహంలో పూజామందిరంలో దేమునికి ఇరుప్రక్కలా రెండు కుందుల్లో దీపారాధన చేయాలి.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి