జై శ్రీమన్నారాయణ్ ...
భక్త మహాశయులకు
మనవి.
శ్రీ ఆదిలక్ష్మి అలిమేలు మంగా సహిత శ్రీ (బాలాజీ ) వేంకటేశ్వర స్వామి దేవస్థానం గ్రామం శ్రీనగరం, తుక్కుగుడా మున్సిపాలిటీ(మంఖాల్) లో భాగ్య నగరమునకు 22 కి.మి దూరంలో దేవాద్రి,గరుడాద్రి ,కుక్కుటాద్రి, నీలాద్రి, బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు గా పిలువబడే (త్రిగుణ పర్వతములు ) సప్త మహాపర్వతములలోని దేవాద్రిగా పిలువబడే మహాపర్వత గుహాంతరాళం లో అత్యంత వైభవంగా 3700 సంవత్సరాల క్రితం స్వయంభుగా వ్యక్తమై వెలసిన శ్రీ ఆదిలక్ష్మి ,అలిమేలు మంగా సమేత శ్రీ (బాలాజీ) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రప్రథమంగా శ్రీ పార్వతి సమేతుడై ఈశ్వరుడు దర్శించి పూజించిన ఈ దివ్య సన్నిధిలో మరియు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వానమాముల జీయ్యర్ స్వామివారు, అత్తాన్ శఠగోపదేశికులవారు ,
ప్రతివాదిభయంకరం శ్రీ రంగాచార్యులవారు, శ్రీ రంగ రాజభట్టర్ వారు, ఆసూరిమరింగంటి లక్ష్మణాచార్యుల వారు ఇంకెందరో పీఠస్తులు మరియు భాగవతోత్తములు తీర్థపరిగ్రహణముచేసి మంగళాశాసనములు చేసిన ఈ మహాస్థలములో, అణువణున భగవంతుడు ఉన్నాడు అన్న నిదర్శంగా చూపే ఈ దివ్య సన్నిధిలో
స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సర మాఘ బహుళ సప్తమి తేదీ 5-3-2021శుక్రవారం మొదలు తేదీ 14-4-2021 వరకు మండల దివసములు
(41,రోజులు)
దేవాద్రిగా (దేవుని గుట్టగా) కొనియాడబడే మహాపర్వతమునకు మహా గిరి ప్రదక్షిణ మహోత్సవం లోక కళ్యానార్థం మరియు ఆలయ సర్వతోముకాభి వృద్ధిని కాక్షింస్తు భగవత్ కైంకర్య సేవగా అత్యంత వైభవంగా జరుగును.
కార్యక్రమం ప్రారంభం
తేదీ 5-3-20221 శుక్రవారం ఉదయం 7-00 గంటలకు అఖండ దీపారాధన స్వామివారికి తిరుమంజన అభిషేకం,
శ్రీ విష్వక్సేనారాధన స్వస్తి పుణ్యాహవాచనం ,రక్షాబంధనం, కలశ స్థాపన ,అర్చన అనంతరం మంగళవాద్యములు ముందు సాగుతుఉంటే, భాగవతతోత్తములు వేదమంత్రములు ,దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తూ,భక్తులు గోవింద నామాలను గానం చేస్తూ దేవాద్రి (దేవుని గుట్ట)మహాగిరి పదక్షిణ
మహోత్సవం ప్రారంభం అవుతుంది.
ఈ గిరి ప్రదక్షిణ మన పూర్వజన్మ సుకృతంవల్ల భగవంతుడే తన అపార కృపతో మనను అనుగ్రహించి అందించిన మహత్తరమైన, అద్భుతమైన సదావకాశంగా భావించి
ప్రతి ఒక్కరు త్రికరణ శుద్ధితో ఈ మహత్కార్యంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రులై తరించగలరు.
సర్వేజనా సుఖినోభవంతు.
భక్తులకు సూచనలు..
1. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఉదయం గం 6-30 ని నుండి ఉ: 9-30 ని వరకు కొనసాగుతుంది.
2. ప్రదక్షిణ పూర్తిచేసిన తరువాత స్వామి వారిని దర్శించండి.
3.మహాగిరి ప్రదక్షిణ 1,2 లేదా 3 చేయవచ్చును.
4. ప్రదక్షిణ సమయం లో భక్తులు గోవింద నామాలను గానం చేయాలి.
5. 11రోజులు, 21రోజులు లేదా 41 రోజులు గిరి ప్రదక్షిణ చేయు భక్తులు( గోవింద మాల)ధారణ చేసి నియమాలను పాటించాలి.
6.అన్ని గ్రామాల్లో ఉండే భజన బృందాలు భజన చేస్తూ దేవాద్రి మహాగిరి ప్రదక్షిణ చేయండి.
7.ఇతర వివరములకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
9848947776
9848056485
ఇట్లు
వంశపారంపర్య
ధర్మకర్తలు.
అశేష భక్తకోటి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి