16, జూన్ 2021, బుధవారం

చికిత్సా పద్ధతులు - గండూషము

 అయుర్వేదము నందలి మరికొన్ని చికిత్సా పద్ధతులు  - 


*  గండూషము  - 


     ఏదేని వస్తువులను నానబెట్టిన జలముతో పుక్కిలించుట  . 


 *  వస్తి శోధనము  - 


     నాళము ద్వారా జలమును గుదస్థానము నందు ప్రవేశింపచేసి మలశోధనము చేయుట . ఇందువలన మలకోశము శుద్ది అగును.  పొత్తికడుపు పలచన అగును. ఇది హఠయోగుల యొక్క షట్కర్మములలో ఒకటై ఉన్నది . ఆంగ్లము నందు దీనికి "ఎనిమా " అని పేరుతో పిలుస్తారు . 


 *  నాళికా శోధనము  - 


      చిమ్మనగ్రోవి ( సన్నటి పైప్ ) ద్వారా జలమును యోనిస్థానము , కర్ణ రంధ్రము యందు ప్రవేశింపచేసి మలినమును వెలికిదీసి శుద్ధిచేయుట . ఇది వస్తి శోధనము యందలి ఒకరకం . దీనికి వస్తిపీడనము అనే పేరుతో వ్యవహరిస్తారు . 


 *  ముఖనిక్షిప్తము  - 


       అతిమధురం , కరక్కాయ బెరడు మొదలగు వస్తువులను పుక్కిట యందు ఉంచుకుని ఆ రసమును మింగుట . 


 *  నిబంధనము  - 


        గడ్డలు మొదలగు వానికి బియ్యపు పిండి లేక మూలికలు ఉడకబెట్టి కట్టుట . 


 *  బంధము  - 


       గాయములు కలిగినపుడు లేక అవయవములు స్థానము తప్పినను విరిగినను బద్ధపెట్టి కట్టుట . దీనిని ఆంగ్లము యందు "బ్యాండేజి " అని పిలుస్తారు . 


 *  మర్దనము  - 


       తైలాదులను వ్యాధి గల స్థలము నందు లేపనము చేసి చేతితో పట్టుట . 


 *  తాపనము  - 


        వ్యాధి బాధ కలిగినచోట ఇసుక , తవుడు ఆకులు  మొదలైన వానిని వేయించి గుడ్డలో మూటకట్టి గాని లేక వేడినీళ్లను గాజు పాత్ర యందు ఉంచి కాపడం పెట్టటం . 


 *  లేపనము  -  


         తలనొప్పి , గడ్డ మొదలగు వానికి పట్టు వేయుట . పంచకర్మలలో స్నేహన పద్దతి దీనిలోకి వచ్చును. 


 *  అభ్యంగనము  - 


        తైలము , మూలికల రసము , జంబీర ఫల రసము ఇత్యాది స్నేహ వస్తువును తలకు వాడుకొని స్నానము చేయుట . 


          తరవాతి పోస్టులో ఆయుర్వేదము నందు ఉపయోగించు ఔషధాలలోని రకాల గురించి వివరిస్తాను . 


   


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: