మనం డబ్బు ఎంత సంపాదించినా మనం చనిపోయిన తరువాత మనతోబాటు తీసుకొని వెళ్ళలేము. అలా వెళ్ళు సమయంలో మనతో బాటు మన సంపదలు కూడా రావాలంటే ఒక్కటే మార్గం.
ఉదాహరణకు మనం అమెరికా వెళ్తున్నప్పుడు అక్కడి ఖర్చుల కొనుగోళ్ళ నిమిత్తం మన భారతదేశ రూపాయలు తీసుకెళ్తే ప్రయోజనముండదు. ఎందుకనగా మన రూపాయలు అక్కడ చెల్లవు కాబట్టి. అంటే మనం బయలుదేరే ముందే మన అమెరికా ఖర్చులకోసం బ్యాంకుల నుండి ప్రభుత్వ గరిష్ట అనుమతి ప్రకారం మన భారతదేశ ద్రవ్యమైన రూపాయలను యిచ్చి వాటికి ఆరోజుటి మారకపు విలువాధారంగా అమెరికా ద్రవ్యమైన డాలర్లను పొంది మనతో బాటు తీసుకువెళ్ళాలి. ఆ డాలర్ల ద్వారానే మనం అక్కడ ఖర్చులు చేయగలం.
యిలా అమెరికా ఒక్కటే కదా ఏ దేశానికి వెళ్ళాలన్నా మన ద్రవ్యాన్ని బ్యాంకుల ద్వారా ఆదేశపు ద్రవ్యంగా మార్పిడి చేసి మనతోబాటు తీసుకొని వెళ్ళాలి.
మన భౌతిక ప్రపంచ ప్రయాణానికే యిన్ని సన్నాహాలు చేస్తున్నప్పుడు మనం మళ్ళీ తిరిగిరాని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మన సంపదలను మార్పిడి చేసి తీసుకొని వెళ్ళగలం కదా.
మనం చనిపోయిన తర్వాత మనతోబాటు మన సంపదలను స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి ఒకటే మార్గం వాటిని స్వర్గలోకానికి తగ్గట్టు మార్పిడి చేయడమే.
మన సంపదలతో భూలోకంలో దానధర్మాలు గాని , అభ్యాగతులను ఆదుకోవడం గాని , మానవ సమాజ శ్రేయస్సు నిమిత్తం వెచ్చించడంలాంటి కార్యక్రమాలలో పూనుకున్నట్లయితే మన ఖాతాలో పుణ్యం జమకాగలదు. యిలా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినట్లయితే అంత పుణ్యం మన ఖాతాలో అలాఅలా పేరుకుపోగలదు. మన సంపదనంతా వెచ్చించి ఎంత పుణ్యం సంపాదించగలమో అవే మనకు మనతోబాటు రాగలవు. అలాంటి పుణ్యాలే మన తదనంతర గమ్యానికి దారిచూపగలవు.
అందువలన మనం వీలైనంతవరకు ఎన్ని మానవసేవ కార్యాలను చేపట్టగలమో అవే మన స్వర్ఖలోకం చేరుకోవడానికి ద్రవ్యమార్పిడి.
మనందరి తక్షణ కర్తవ్యం యిదే మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి