*28.06.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2183 (౨౧౮౩)*
*10.1-1272-*
*క. "నీ పాదకమల సేవయు*
*నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం*
*తాపార భూతదయయునుఁ*
*దాపసమందార! నాకు దయచేయఁ గదే!"* 🌺
*_భావము: తపస్వులకు కల్పవృక్షమైనట్టి వాడా! నాకు నీ పాదకమలముల యందు అచంచలమైన భక్తి, నీ పాదములను అర్చించే వారి తో స్నేహము (సత్సాంగత్య భాగ్యము), సకల జీవుల యందు అంతులేని అపరిమితమైన దయను అనుగ్రహించుము._* 🙏
*_Meaning: The flower vendor in his humble prayer appealed to Sri Krishna: ”You are like the KalpaVruksha for the sages, who perform penance. Kindly grant me the opportunity of serving Your Lotus Feet, the companionship of Your ardent devotees and infinite compassion towards the fellow beings.”_* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి