28, జూన్ 2021, సోమవారం

అరుణ ప్రశ్న

 అరుణ ప్రశ్న ఋగ్వేదంలో శక్తిని దాని వ్యాప్త మును సూత్ర పరంగా తెలుపు చున్నది. అదే రుద్ర రూపమని రుద్ర శక్తి వ్యాప్తంగా తెలియుట. అగ్ని మన దేహములో చైతన్య పరచుటకు ఏ సూత్రం ఆధారమగునో ఆ ఆధార సూత్రము యఙ్ఞమే. దీనికి అరుణ మనే ఋగ్వేద ప్రశ్న సవివరంగా తెలుపు చున్నది. అణు భద్రాం దిశాం వరః, అణు వర్ణే భూమిః, ఋగ్వుషాం వసుః,(ఋక్కు లక్షణము ఉష రూపంలో కాంతి రూపంలో)వసుః భూమికి,తాం యఙ్ఞ్యస సర్వాం నవ యజామహే. యజామహే నవా సర్వాం తాం యఙ్ఞం.ఏదైతే నిత్య నూతనమైన ప్రకృతిని జీవం గలిగి యుండుటయే యఙ్ఞం. అనగా నిత్య నూతనంగా పూర్ణ శక్తి ఎప్పుడూ వకే రీతిలో వుండుట, మార్పుయనే లక్షణము లేకుండా. యత్ జా, యేదైతే జీవ వ్యాప్తంగా లక్షణము గల జీవము, దేహము, మహా యనే పూర్ణ శక్తి.అగ్ని  హవిస్సు రూపంగా కూడియున్న తత్వమును మహా యని అది తెలియుట పదార్ధ రూప ఙ్ఞానము యనగా దేహము. అది అంతకు ముందు లేదు ఇప్పుడు మార్పువలన వున్నదని తెలిసినది. అదియును పూర్తిగా తెలియలేదు. మహా, మహే గా మారు ప్రక్రియ. మూడవ ప్రక్రియ మహీ పదార్ధ రూపం. మూడవ రూపం వలననే పదార్ధ రూపమైన దేహము. శక్తికి మూడు సూత్రముల ద్వారా వ్యాప్తి. మహా మెుదటి సూత్రం మహే రెండవ సూత్రం. మహీ మూడవ సూత్రం. మూడవ సూత్రం క్షేత్రము. భూమి ద్వారా దాని వసుః లక్షణము వాసనల ద్వారా అనగా గుణముల వలన తెలియుట. అంతకు ముందు రెండు సూత్రములవలన తెలియలేదు. కాని వాటి తత్వమును మూడవ సూత్రం ద్వారా నిరూపణ. దీని తత్వము శివ శక్తి. అణువు భద్రమై ప్రకాశించు ధాతు లక్షణమై, నలు దిశలయందుండు వ్యాప్తి చెందిన కాంతి రూపము ,వర్ణ లక్షణంగా, పరిణామ రూపంలో సూక్మంగా మారిన వాసనల రూపం క్షేత్రం. అది భూమిగానీ, దేహం గాని. దీనిని తాం యఙ్ఞ్యస సర్వాం నవ యజామహే. మన దేహము కూడా తల్లి దండ్రుల యఙ్ఞ క్రియయే. వకే కుటుంబమునకు మాత్రమే పరిమితి యఙ్ఞం అనే దేహం.యఙ్ఞం సర్వవ్యాప్తమైన ప్రకృతి రక్షణకు, ప్రకృతి రక్షణ పరమార్ధం సర్వ జీవ వ్యాప్త లక్షణము.అనంతమైన ఙ్ఞానము.మనం చేసే కర్మలు స్వార్ధ మునకు కాకుండా సర్వ జీవ రక్షణకని తెలిసి చేయుట ఙ్ఞానం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: