15, డిసెంబర్ 2021, బుధవారం

సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము

 సూర్యుడు నెలకు ఒక రాసి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈనెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13 న ముగుస్తుంది. సూర్యుడు రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటారు. సూర్యుడు జనవరి 14న మకర రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు సంచరించే పన్నెండు నెలలు కలిపి దేవతలకు ఒక సంవత్సరం.


ఒక సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు. మొదటిది ఉత్తరాయణం రెండోది దక్షిణ దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. దక్షిణాయణం అంటే రాత్రి వదలి పగలు ప్రవేశించే సమయం, ప్రాంతః కాలం వంటిది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.ధనుర్మాసంలో, ప్రతి ఇంటి ముందు సాయంత్రము రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ. మద్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లి కాని కన్యలకు, త్వరగా మంచి మొగుడు లభించి వివాహమవుతుందని నమ్మకం.


హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయము ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు.

కామెంట్‌లు లేవు: