15, డిసెంబర్ 2021, బుధవారం

యుగపురుషుడు

 యుగపురుషుడు నరేంద్ర మోడీ


13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.


కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.


75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.


వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.


'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను మోడీగారు జాతికి అంకితం చేశారు.


గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 


ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు. ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.


విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంత అపవిత్రం చేశారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.


అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు. తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.


ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ రోజున ఫలించింది.


ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.


ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.


అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.


ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు? ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.


'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?


స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్ గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్ నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.


యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 


మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.


భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి!


---------------------------------


source: teluguyogi.net

శ్రీమాన్ రుపెనుగుంట్ల సత్యనారాయణ శర్మ గారు

కామెంట్‌లు లేవు: