🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన తలరాత మార్చే గీత*
➖➖➖✍️
*మన లోపల ఒకడు ఉన్నాడు.... అసలైన వాడు.*
*కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు దొంగలు అడ్డుగా ఉన్నారు..*
*కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు దొంగలు..!*
*ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..*
*ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు. వాళ్ళే కామం, క్రోధం....ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో..*
*" కామ ఏష క్రోధ ఏష రజో*
*గుణ సముద్భవహ "*
*ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు..*
*కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు*.
*ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు.....మనం Ground floor లో ఉన్నాం.*
*మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor.*
*అంటే మనం తమో గుణంలో ఉన్నాం.*
*బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం..... ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం..... ఇంకా Ground floor లోనే ఉన్నాం.*
*ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.*
*ఆ floor పేరు ‘సత్వ గుణం..’*
*ఈ floor చాలా పెద్దగా ఉంటుంది....హాయిగా ఉంటుంది......*
*ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది..*
*అయితే చిన్న సమస్య....... ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి*......
*వాడు...*
*మంచి దొంగ.....వాడు మీకు మంచి మాటలే చెబుతూ ఉంటాడు మీకు Third floor కు దారి చూపిస్తాడు... ఆ floor పేరు శుద్ధ సాత్వికం.... ఇదే చివరిది..... ఇక్కడే మీకు అఖండమైన వెలుగులో కలిసిపోయింది.... ఆ అఖండమైన వెలుగే పరమాత్మ..*
*అది వెలుగులకు వెలుగు, మహావెలుగు.*
*చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక Lift* ఉంది.
*ఆ Lift పేరే "భగవద్గీత".*
*గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు.*
*పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు..*.
*కృష్ణం వందే జగద్గురుం*!
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి