6, ఫిబ్రవరి 2022, ఆదివారం

ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం

 ద్వైతం అంటే మనలోని జీవాత్మ,పరమాత్ముడు వేర్వేరు అని, 

విశిష్టాద్వైతం అంటే జీవుడిలోనే పరమాత్మ ఆత్మగా వెలుగుతున్నాడని,

అద్వైతం అంటే జీవాత్మే మేఘాల(మాయ)చే కప్పబడిన సూర్యుడు(పరమాత్మ) అని అంటే జీవాత్మకు పరమాత్మకు భేధం లేదని .

ఇంకా సరళంగా చెప్పాలంటే
ద్వైతం అనగా నేను వెలుగు లో ఉన్నాను అని,
విశిష్టాద్వైతం అనగా నాలో వెలుగు ఉందని,
అద్వైతం అంటే నేనే వెలుగు అని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు: