6, ఫిబ్రవరి 2022, ఆదివారం

 "అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం".
అంటే "చేసిన కర్మల ఫలితం అది చెడైనా ,మంచైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే."

"జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం"అని ఉంది.అంటే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలఫలితాన్ని దగ్దం చేస్తుంది అని 

మన గతకర్మల ఫలితంగా మన కాలు ఒక్కటి పోవలసింది అనుకొందాము.కాని మనం సంపాదించిన జ్ఞానాగ్ని వలన మనకాలికి ఒక ముల్లు గుచ్చుకోవడం వలన  కర్మ ఫలితం పోవచ్చు. విధంగా మన కర్మఫలితం  మేరకు తగ్గించబడడం జరుగుతుంది.
జ్ఞానం సంపాదించుకోవడానికి భగవత్ప్రీత్యర్థ కర్మలు చేయడం(నిస్వార్థసేవ,సత్యవాక్పరిపాలన,కపటం లేకుండడం మొదలగునవి ),కర్మల పట్ల అసంగత్వం కలిగిఉండడం (కర్మయోగం) అవసరం.

 

కామెంట్‌లు లేవు: