ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ .
ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం .
విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను .
ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
* నస్యకర్మ -
దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు .
* వమనకర్మ -
వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి .
* విరేచనకర్మ -
విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట.
* నిరూహవస్తి -
ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను .
* అనువాసనవ వస్తి -
దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది .
తరువాతి పోస్టు నందు మరికొన్ని ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి వివరిస్తాను .
గమనిక -
నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది .
ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును .
ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి