1, ఫిబ్రవరి 2022, మంగళవారం

మన కష్టార్జితాలే

 🤪🤫 *సందేశం* 🤫🥱


అన్నా స్కూలుకు పోతా...

*_15 వేలు తీసుకో_*


అన్నా ఆటో తోలుతా...

*_1 లక్ష తీసుకో_*


అన్నా కారు తోలుతా...

*_10 లక్షలు తీసుకో_*


అన్నా కటింగ్ చేస్తా...

*_10 వేలు తీసుకో_*


అన్నా చెట్లెక్కుతా...

*_10 వేలు తీసుకో_*


అన్నా నేను పెళ్లి చేసుకుంటా...

*_1 లక్ష తీసుకో_*


అన్నా నేను గర్భవతిని...

*_12 వేలు తీసుకో_*


అన్నా నేను సోమరిపోతును...

*_15 వేలు తీసుకో_*


అన్నా నేను టైలర్ని...

*_10 వేలు తీసుకో_*


అన్నా నేను జాలరిని...

*_10 వేలు తీసుకో..._*


అన్నా నాకు ఇల్లు లేదు...

*_డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకో..._*


అన్నా నాకు భూమి లేదు...

*_మూడెకరాల భూమి తీసుకో..._*


అన్నా నాకు భూమి ఉంది...

*_ఎకరాకు 10 వేల చొప్పున తీసుకో..._*


అన్నా నేను విధవరాలిని...

*_నెలకు 2500 తీసుకో_*


అన్నా నేను వికలాంగున్ని...

*_నెలకు 3000 తీసుకో_*


అన్నా నాకు ఆసరా అంటూ ఎవ్వరూ లేరు... 

*_నెలకు 2500 తీసుకో_*


అన్నా నేను ముసలోడిని...

*_నెలకు 2500 తీసుకో_*


*ఒక పిట్ట కథ విందామా?*


_ఒక దొర డబ్బులు పంచుతాను రండి అని ఊర్లో డప్పు వేయించాడు. దొరగారు డబ్బులు పంచుతున్నారట అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు._


_అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు. వచ్చినోళ్లందరికీ డబ్బులు పంచాడు దొరగారు. డబ్బులు తీసుకుని ఊర్లోకి వెళుతుంటే పర్మిట్ రూం ప్రత్యక్షమైంది. దొరగారు ఇచ్చిన డబ్బులు కొన్ని రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో వాళ్ళ ఆడోళ్ల సంపాదనతో తాగారు._

 

*_రాజ్యాంగం ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు?..._*

*_మనంతట మనమే రోడ్డేసుకోలేం, బడి కట్టుకోలేం, ఆస్పత్రి కట్టుకోలేం మార్కెట్ ఏర్పాటు చేసుకోలేం, రైలు మార్గంను ఏర్పాటు చేసుకోలేం._*


_ఆ పనుల్నీ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి గవర్నమెంటు అని పేరు పెట్టారు. ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన పనులు చేసి పెట్టే బాధ్యత అప్పగించారు._


 _అందుకోసం ట్యాక్సుల రూపంలో మన వద్ద డబ్బులు తీసుకుని మన కోసం బడి కట్టాలి, రోడ్డు వేయాలి, ఆస్పత్రి కట్టాలి, కరెంటు ఇవ్వాలి, డ్రైనేజీలు వేయాలి. చెరువులు కట్టాలి, ప్రాజెక్టులు కట్టాలి._


_కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు పెట్టుకుని తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు._


కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. తెలంగాణలో కరిగేపోయాయి. మిగులు రాష్ట్రమని చెప్పుకున్న మనమే లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో చిక్కుకుపోయాం. మొన్నే 40 వేల కోట్లు డబ్బులు పంచాం అని ఘనంగా చెప్పుకున్నారు.


*_ఎవరి సొమ్ము అది? ప్రజలు కట్టిన పన్నులే కదా. మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా._*


*రేపటి నుంచి...*

_తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే 4 రూపాయలు ఎక్కువ పెట్టి పెట్రోలు కొనాలి, 4 రూపాయలు ఎక్కువ పెట్టి డీజిల్ కొనాలి_*


_ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ రూపాయలు పెట్టి క్వార్టర్ బాటల్ కొంటున్నారు._


*_ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో... జనం పాలకులను నిలదీస్తారు, కడిగేస్తారు. ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంటు డబ్బులు తినలేదు. కాబట్టి మూసుకుని కూర్చోరు. తాటతీస్తారు._*


*_కానీ తెలంగాణ ప్రజలు పుడితే పథకం, స్కూలు కెళితే పథకం, పెద్దయితే పథకం, పెళ్లి చేసుకుంటే పథకం, పిల్లలను కంటే పథకం, వ్యవసాయం చేస్తే పథకం, వ్యవసాయం చేయకపోతే పథకం._*


_ఆస్తులను పెంచడం కష్టం గానీ పంచడం ఎంత సేపు, 5 నిమిషాల పని. ఖర్చు చేసుకోవడానికి జనాలకు ఎక్కువ సమయం పట్టదు._


*_ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు._*


_డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా తీసుకున్నారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి తిరిగి కట్టకపోతే?_


*_అదే జరుగుతోంది_*


_చాలా సింపుల్ లాజిక్..._


_మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి._


_ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది ఆయా 'నాయకులను' బట్టి ఉంటుంది._


*_అందుకే అన్నారు... దురాశ దు:ఖానికి చేటు అని._*


*_ఓ ఓటరు మహాశయా మేలుకో. ఉచితంగా ఏది రాదు అనేది అందరూ అర్థం చేసుకోవాలి._*


 *_ప్రభుత్వాలు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో ఒక్కసారి గమనించండి. ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే. అవి ఎలానో తెలుసుకుందాం._*


★సంపాదిస్తే *_income tax_*

★వస్తు సేవలను ఉత్పత్తి చేసి అమ్మితే *_goods & services tax_*

★మార్కెట్‌ చేస్తే *_commercial tax_*

★సినిమాకి వెళ్తే *_entertainment tax_*

★వెహికిల్‌ కొంటే *_life tax_*

★దాన్ని రోడ్‌ పైకి తెస్తే *_road tax_*

★లాంగ్‌ జర్నీ చేస్తే *_toll tax_*

★బండిలో పెట్రోల్‌ పోస్తే *_fuel surcharge tax_*

★భార్య, పిల్లలతో పార్కుకు వెళితే *_entry tax_*

★ఉద్యోగం చేస్తే *_professional tax_*

★వ్యాపారం చేస్తే *_trade tax_*

★అమ్మితే *_sales tax_*

★బట్టలు కొంటే *_VAT_*

★బీర్లు, విస్కీలు కొంటే *_excise tax_*

★కరెంటు, వాటర్‌ బిల్ కడితే *_service tax_*

★ఆస్థి పై *_property tax_*

దిగుమతి చేసుకుంటే *_customs tax_*

★చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే *_swachh bharat charge_*


★ *_మొత్తం మీద మనిషి జన్మిస్తే tax_*

★ *_మనిషి మరణిస్తే tax_*


*_ఇలా పలు రకాల టాక్సులతో మనిషి పుట్టినప్పటి నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు. అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే....._*


*_జై హింద్_*  *_జై తెలంగాణ_*

🙏🙏🙏💐💐

కామెంట్‌లు లేవు: