1, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఏకమూలికా ప్రయోగాలు .

 రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 


     

      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 


     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 


  ఏకమూలికా ప్రయోగాలు - 


 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 


 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 


 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 


 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 


 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 


 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 


 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 


 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 


 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 


 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 


 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 


 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 


 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 


 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 


 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 


 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 


 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 


 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 


 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 


 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 


 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 


 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 


 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 


 * మద్యము శోకము నందు శ్రేష్టం . 


 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 


 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 


 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 


 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 


 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 


 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 


 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 


 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 


 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 


 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 


 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 


 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 


 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 


 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 


 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 


 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 


 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 


 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 


 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 


 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 


 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 


 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 


 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 


 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 


 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 


 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 


       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 


       సంపూర్ణమైన వివరణల కొరకు మరియు మరెన్నో అమూల్యమైన విషయాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

కామెంట్‌లు లేవు: