1, ఫిబ్రవరి 2022, మంగళవారం

పునర్జన్మ సిద్ధాంతాన్ని

 అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు, తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ, అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో ఆయా తల్లుల స్తనాలు, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంది. కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతస్సిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది.


స్తన్యాభిలాషాత్ (3.1.21) . 


పై వివరణను 'న్యాయ దర్శనము' పునర్జన్మకి మద్దతుగా చెప్పిన ఇంకొక ఉదాహరణగా పేర్కొంటోంది. 


పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపొతే, మనుష్యుల మధ్య ఉన్నఅసమానతన అనేది, కారణం చెప్పడానికి వీలు కాకుండా, అసంబద్దంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డి వాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే, తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనము అతని కర్మ వలన ఇలా జరిగింది అంటే, అతను ఈ ప్రస్తుత జన్మ యే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పము అంటే, అది కూడా నమ్మశక్యంగానిదే, ఎందుకంటే భగవంతుడు పరమ దయ కలవాడు, నిష్కారణముగా ఎవ్వడూ గుడ్డి వాడిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ (logical) వివరణ ఏమిటంటే అతను తన పూర్వ జన్మ కర్మ ల ఫలితంగా గుడ్డి వాడిగా పుట్టాడు. అందువలన, సహజవివేకము మరియు వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా మనము పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసినదే.


. 🚩🙏 హరే కృష్ణ 🙏🚩

కామెంట్‌లు లేవు: