19, ఆగస్టు 2023, శనివారం

🪷 శ్రీ మద్భగవద్గీత

 🕉️ *🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 

2-అధ్యాయం, 1వ శ్లోకం


 *సంజయ ఉవాచ*


 *తం తథా కృపయావిష్టమ్ ఆశ్రుపూర్ణాకులేక్షణమ్ |* 

 *విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదనః || 1* 


 *పతి పదార్థము* 


తథా = ఆవిధముగా;కృపయా, ఆవిష్టమ్ = కరుణతో నిండిన వాడును; అశ్రుపూర్ణాకులేక్షణమ్= అశ్రు పూర్వములై, వ్యాకుల పాటు తో గూడిన నేత్రముల గలవాడును; విషదంతమ్=శోకించు చున్న వాడును - అగు; తమ్ = ఆ అర్జునుని గూర్చి ; మధు సూధనః = శ్రీ కృష్ణడు; ఇదము వాక్యమ్ = ఈ వాక్యము ను; ఉవాచ = పెలికెను;


 *తాత్పర్యము* 

 సంజయుడు పలికెను:-

ఈ విధముగా కరుణా పూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండి యుండెను. అవి అతని వ్యాకుల పాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీ కృష్ణభగవానుడు ఇట్లనెను.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం🙏🙏*

కామెంట్‌లు లేవు: