30, ఆగస్టు 2023, బుధవారం

తెలుగుభాష! రతనాలభాష!*

 *నా తెలుగుభాష! రతనాలభాష!*


*అంశం* : *"అధికారభాషపై అధికారుల నిర్లక్ష్యం*

*శీర్షిక* :    *నా తెలుగుభాష! రతనాలభాష!*

*పేరు* : *~శ్రీశర్మద*


సంస్కృతామృతమ్ము నాపోశనంబట్టి 

నన్నయ్య చిన్నయ్య సంస్కరించిన భాష 

తీయతేనెలకన్న కమ్మనై యలరారి 

నయగారములనొలుకు నా తెలుగుభాష 


అల కందుకూరి గురజాడ జాడలన్ 

చిలకమర్తి వారి పల్కులందున కులికి 

పిడుగు వంటి గిగుడు గొడుగు ఛాయన జేరి 

కడిగిన ముత్యమైన భాష నా తెలుగుభాష


రాజుల కాలన రాజసమ్మొలికించి 

చట్టభాషగ తాను మెలగి చెలగి 

చుట్టమై ప్రజకెల్ల అలరారిన భాష 

కమ్మతేనెల మాధురి నా తెలుగుభాష 


భాషోద్యమమునందు వ్యావహారికస్థాయి 

నందిబుచ్చుకొని వచ్చి అందివచ్చిన భాష 

నా తెలుగుభాష నాదరింపగ రారె!

అధికార వ్యవహార డోలలూపగ రారె! 

అందివచ్చును భాష అందగించును భాష 

నిర్లక్ష్యమిక వద్దు లక్ష్యమే ఇక ముద్దు 


జై తెలుగుభాష! జై తెలుగుభాష! 

----------------------------------------------------------

రచన:

*కవితాభారతి*

*~శ్రీశర్మద*

8333844664 

తెనాలి.

కామెంట్‌లు లేవు: