30, ఆగస్టు 2023, బుధవారం

హనుమాన్ చాలీసా

 🙏🙏🙏🙏🙏🙏🙏

 *హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు,

సమాధానములు*


🔔🔔🔔🔔🔔🔔🔔🔔


1, చాలీసా " అంటే ఏమిటి ?

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా

__ అని పేరు { చాలిస్ అంటే హిందీ లో 40 అని }


2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి ?


జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు

అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం.

 *అజ్ఞానమును* *హననము చేయునది కనుక*

*జ్ఞానమునకు హనుమ అని పేరు.* 


3. ఆంజనేయ - అర్థం ?


జ. ఆంజనేయ అంటే ....

సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే

అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే

పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.


4. తులసీదాస్ అస్సలు పేరు ?


జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం

స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమంతుడు బ్రహ్మచారి 

అయితే మరి సువర్చల ఎవరు ?


జ. దేవుళ్ళ భార్యలను,

మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు.


భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి,  

    

సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల

వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల"

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం

మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?


జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం

అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ

హనుమత్ స్మరణాత్ భవేత్. 


హనుమంతుని స్మరించటం వలన

మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ

విద్య నేర్చుకున్నాడు హనుమ.అంటారు కదా

అసలు సూర్యుడు తిరగడు కదామరి ?


జ. తిరగడం అంటే ఇక్కడ,

ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు,

క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది

దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


8. హనుమంతుని పంచముఖములు ఏవి ?


జ. హనుమ శివాంశ సంభూతుడు.

శివుని పంచముఖములు,హనుమంతునిలో

ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః

వచ్చినది అది సద్యోజాత శివవదనము.

దక్షిణం వైపు నార సింహం.

అది శివుని వామదేవ ముఖం.


రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోరరూపం,

వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.


ఉత్తరం వరాహ ముఖం

అది శివుని తత్పురుష రూపము.

సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న

సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 

ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. 

అది శివుని ఈశాన ముఖం .

వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు.

ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి.

ఈ మూర్తి పది చేతులతో వుంటాడు.


వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ

నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది,


9. "జయ" హనుమాన్ అని

హనుమకి జయం చెప్పడమేంటి ?


జ. ఎవరైనా ఏది సాధించడానికి (పురుషార్థాలను) 

పుట్టారో అది సాధించడమే జయం అంటే.


జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం.

దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము

అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి

ఉండు అని అర్థము.


10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు ?

జ.126 సం.జీవించాడు.


శ్రీరామదూతం శిరసా నమామిః🙏

*సర్వేజనాసుఖిననోభవంతు*🙏🙏🙏

కామెంట్‌లు లేవు: